Latest Updates
-
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా
కేన్స్ 2018: రెడ్ కార్పెట్ పై తన స్టన్నింగ్ లుక్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసిన కంగనా
కంగనాను రెడ్ కార్పెట్ క్వీన్ గా మనం అభివర్ణించవచ్చు. తన అపియరెన్స్ పై ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ఈ బాలీవుడ్ భామకు ఏ మాత్రం సంకోచం అలాగే బిడియం లేదు. రెడ్ కార్పెట్ పై "తను వెడ్స్ మను" నటీమణి కంగనా ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ట్రెడిషనల్ శారీస్ లేదా ఫ్యూజన్ వేర్, సేఫ్ గౌన్స్ లను పక్కన పెట్టి అందుకు భిన్నంగా ఎక్స్పెరిమెంట్ తో కూడిన అట్టైర్ తో రెడ్ కార్పెట్ పై దర్శనమిచ్చింది. కేన్స్, కంగనా ఎక్స్పెరిమెంట్ కు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది.
ఈ ప్రత్యేకమైన లుక్ ఎవరి ఊహకూ అందనిది. ఇది కచ్చితంగా ఒక ప్రయోగమని చెప్పుకోవచ్చు. ఈ లుక్ ను చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు.

ఈ ఈవెంట్ కి కంగనా ధరించిన అవుట్ ఫిట్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఆమె అభిమానులు ఆనందంతో ఎగిరి గంతేస్తున్నారు. ఫ్యాషన్ క్రిటిక్స్ కు విశ్లేషణ రాయడానికి ఒక అద్భుతమైన అంశం దొరికింది.
70 ల నాటి పెర్మ్ హెయిర్ స్టయిల్ లో భారీగా డిజైన్ చేయబడిన ఈ అవుట్ ఫిట్ లో కంగనా మెరిసిపోయింది. నేడో బై నెడ్రేట్ తాసిరోగ్లు చేత ఈ రివీలింగ్ సేక్విన్డ్ క్యాట్ సూట్ డిజైన్ చేయబడింది. మొత్తానికి, ఈ ఈవెంట్ లో కంగనా మూస ఫ్యాషన్లకు స్వస్తి పలికి తనదైన స్టయిల్ లో ఫ్యాషన్ కి అర్థం చెప్పింది.
రెడ్ కార్పెట్ లో మొదటి సారే తనదైన ప్రత్యేకతను చాటిచెప్పే ఫ్యాషనిస్టాల హృదయాలను కొల్లగొట్టింది.
రెడ్ కార్పెట్ పై తన హొయలును ప్రదర్శిస్తూ ఫ్యాషన్ పై తన మక్కువను చాటుకుంది. తన సొగసుతో ఈ అటైర్ కే వన్నేతీసుకొచ్చింది.
సిల్వర్ ఎంబ్రాయిడరీ కలిగిన ఈ అటైర్ లో ప్రతి నిశితమైన అంశాన్ని కూడా శ్రద్ధతో డిజైన్ చేశారు. రెడ్ కార్పెట్ పై రెట్రో అవతార్ లో కంగనా అదరగొట్టేసింది.

కేన్స్ లో కంగనా రణౌత్
అద్భుతమైన క్యాట్ ఐ మేకప్ తో కంగనా లుక్ ను ఎలివేట్ చేయడంలో మేకప్ ఆర్టిస్ట్ పనితనం మనకు కనిపిస్తుంది. ఈ మేకప్ తో కంగనా క్యాట్ వుమెన్ గా మారిపోయింది. హల్లే బెర్రీకి కంగనా ఇప్పుడు స్ట్రిక్ట్ కాంపిటీషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లే మరి.
కేన్స్ లో ఇప్పటి వరకు ఏ భారతీయ మహిళ కనిపించనటువంటి విభిన్నమైన దుస్తులలో కంగనా దర్శనమిచ్చింది. ఆమె ధైర్యాన్ని మనం మెచ్చుకుని తీరాలి. స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చి తీరాలి. మన క్యాట్ వుమెన్ కంగనా ఫ్యాషన్ సెన్స్ ప్రపంచవ్యాప్తంగా ఫ్యాషనిస్టాలను ఆకట్టుకుంటోంది.
తన అద్భుతమైన లుక్ తో కంగనా అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. ఫారీన్ మీడియా కంగనా ఫ్యాషన్ సెన్స్ పై విశ్లేషణలు మొదలుపెట్టింది. ఇండియన్ మహిళ ఇలా ఫ్యాషన్ లో ప్రయోగాలు చేయడం విదేశీయులను ఆశ్చర్యపరిచింది. కంగనా ధైర్యాన్ని సెలెబ్రిటీస్ తో పాటు మీడియా కూడా అభినందనలు తెలుపుతోంది.
కంగనా తన మాటల్లోనే కాదు ఫ్యాషన్ స్టేట్మెంట్ లో కూడా స్ట్రైట్ ఫార్వార్డ్ నేచర్ ను వ్యక్తపరుస్తోంది. తనకు నచ్చింది ధరించి ఫ్యాషన్ లో ట్రెండ్ సృష్టించేందుకు కంగనా ముందుకు సాగుతుందేమో!



Click it and Unblock the Notifications