కేన్స్ 2018 ఫిలిం ఫెస్టివల్ : సోనం ధరించిన లెహంగా ఇప్పుడు హాట్ టాపిక్

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

కేన్స్ 2018 ఫిలిం ఫెస్టివల్ : సోనం ధరించిన లెహంగా ఇప్పుడు హాట్ టాపిక్

కేన్స్ 2018 ఫిలిం ఫెస్టివల్లో ఆమె మొట్టమొదటి రెడ్ కార్పెట్ ప్రవేశానికి ముందే, సోనమ్ కపూర్ అహూజా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తన దుస్తులకు సంబంధించిన టీజర్ ను విడుదల చేసి, జనాల చేత వావ్ అనిపించింది. ఈ పీక్-ఏ-బూ స్టోరీలో దుస్తుల గురించి పరిచయం ఇచ్చినా, పూర్తిగా ఎలా ఉండబోనుందో కనీస అవగాహనకు కూడా రాలేకున్నాం.

మరియు అది గౌన్ లేదా పాంట్ సూట్ కాదు, ఖచ్చితంగా లెహెంగా అయి ఉండొచ్చు అని మాత్రం నెటిజన్ల అభిప్రాయంగా ఉంది. అవును ఈ పెళ్ళికూతురు సాంప్రదాయక భారతీయ వస్త్రాలతో కేన్స్ లో అడుగుపెట్టి, మరో సంచలనానికి తెరతీయనుందని తెలుస్తుంది.

Cannes 2018: Wow! Sonam’s Lehenga Is What Everyone Is Talking About

ఆమె స్టైలిస్ట్ సిస్టర్ రియా కపూర్ బహిర్గతo చేసిన వివరాల ప్రకారం, సోనం ఖచ్చితంగా లెహంగా లో దర్శనమివ్వబోతుంది. ఈ లెహంగాలో అత్యద్భుతంగా, నెవెర్ – ఎవర్ లుక్ తో రెడ్ కార్పెట్ పై అడుగు పెట్టనుందని తెలుస్తుంది. ఇంతకు ముందు 2013 లో కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో చివరగా డర్టీపిక్చర్, కహానీ వంటి సినిమాల్లో తన పేరును దేశంమొత్తo వినబడేలా చేసిన విద్యాబాలన్ సవ్యసాచి లెహెoగాలో దర్శనమిచ్చింది. ఆ తర్వాత ఇంతకాలానికి సోనం కపూర్ అహుజా లెహంగాలో దర్శనమివ్వబోనుంది.

విద్యాబాలన్ తర్వాత అంతర్జాతీయ కార్యక్రమాలలో ఇప్పటివరకు ఎవ్వరు కూడా భారతీయ సాంప్రదాయానికి నిలువెత్తు రూపమైన లెహెంగాను ధరించలేదు. ఒక అంతర్జాతీయ ఈవెంట్ కోసం, లెహంగాను ఎంచుకోవడం ఖచ్చితంగా ఒక అసాధారణ విషయమే. అంతేకాకుండా చూపు తిప్పుకోలేనివిధంగా దుస్తులు ఉంటాయి అనడంలో ఆశ్చర్యమే లేదు. ఈ బెస్పోక్ లెహెంగాతో సోనమ్ కపూర్ డిజైనర్స్ అయిన రాల్ఫ్ మరియు రస్సో భారతీయ ప్రఖ్యాత దుస్తుల మార్కెట్లోకి ప్రవేశించారు.

Cannes 2018: Wow! Sonam’s Lehenga Is What Everyone Is Talking About

కొత్త పెళ్ళికూతురు, సోనం స్వర్గం నుండి నేరుగా భూమికి విచ్చేసిన దేవకన్యలా ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. బాల్ – గౌన్ స్కర్ట్, స్ట్రక్చరల్ బ్లౌస్ మరియు చోళీని తలపించే మిస్-మాచ్డ్ స్లీవ్స్ తో కూడిన ఆఫ్ – వైట్ లెహెoగా ఎంతో అద్భుతంగా అలంకరించబడి, వర్ణింపశక్యం కాని విధంగా చూపరుల్ని విస్మయుల్ని చేస్తుంది. ఆమె దుస్తులలో వెండి పూల ఎంబ్రాయిడరీ లెహంగాకు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు, దానికి జీవం పోసింది.

ఆమె మేకప్ ఆర్టిస్ట్ అయిన నమ్రతా సోనీ సోనంను న్యూడ్ మరియు డ్యూవీ లుక్ తలపించేలా తయారు చేసింది. సోనo, లేత పింక్ లిప్ షేడ్ మరియు స్మోకీ కోహ్ల్ ద్వారా క్లాసీ టచ్ ఇవ్వగలిగింది. ఎక్కువ ఆభరణాల జోలికి పోకుండా, ఉత్తమమమైన లగ్జరీ బ్రాండ్లయిన చోపార్డ్, ఆమ్రపాలి జ్యూవెల్స్ నుండి ఎంపిక చేయబడిన అతి తక్కువ ఆభరణాలను ధరించింది.

అయితే, మా దృష్టిని ప్రత్యేకంగా అల్లినట్లున్న కేశాలంకరణ ఆకర్షించింది. ఆమె కేశాలంకరణ, ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఆర్టిస్టిక్- బన్ వెనుక ఉన్న ప్రఖ్యాత డిజైనర్ స్టీఫన్ లాన్సీన్ చేత రూపుదిద్దబడింది. దుస్తులకు సరిపోయేలా అలంకారప్రాయమైన గజ్రా మద్య పాపిటి లుక్ ఇస్తూ విదేశీ ఫ్యాషన్ విమర్శకుల ప్రశంసలను అందుకునేలా చేస్తుంది.

Cannes 2018: Wow! Sonam’s Lehenga Is What Everyone Is Talking About

సాంప్రదాయిక సౌందర్యాన్ని ప్రపంచ ప్రమాణాలతో సోనo సమ్మేళనం చేసిన విధానం అబ్బురపరచేలా ఉంది. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో భాగంగా ప్రతి ఒక్కరు వివిధ రకాల అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన దుస్తులలో రెడ్ కార్పెట్ మీద సందడి చేస్తుంటే, సోనం కపూర్ అహుజా మాత్రం దేశీయ ప్రమాణాలతో కూడిన లెహంగా ధరించి తనకంటూ ప్రత్యేక శైలి ఉందని నిరూపిస్తుంది.

పెళ్లి కూతురైన సోనం కపూర్ విధానాలు, అనేకమంది నోట్స్ రాసుకునేలా చేస్తున్నాయి అనడంలో ఆశ్చర్యమే లేదు. ఫాషన్ విలువలు ఎక్కడికీ పోవు, అప్పుడప్పుడు దేశీయ సాంప్రదాయాన్ని నలుదిక్కులా విస్తరించాలని చూసే సోనం ఆలోచన మాత్రం ఆహ్వానించదగ్గ పరిణామం.

సోనం లెహంగాతో ఒక చర్చకి తెరతీసింది అన్న విషయంతో మీరు ఏకీభవిస్తున్నారా? సోనం కపూర్ ధరించిన లెహంగా ద్వారా దేశీయ ప్రమాణాలను, సాంప్రదాయాలను నలుదిక్కులా విస్తరింపజేయగలదని భావిస్తున్నారా? మీ వాఖ్యలను క్రింది వాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి. ఇటువంటి ఆసక్తికరమైన అప్డేట్ల కోసం తరచూ మా పేజీని సందర్శించండి.

English summary

Cannes 2018: Wow! Sonam’s Lehenga Is What Everyone Is Talking About

Sonam's first red carpet attire of this Cannes season was not a gown or a pantsuit but a stunning lehenga. Her bespoke Ralph & Russo embellished off-white lehenga had a ball-gown skirt, a structural blouse, and a choli featuring mismatched sleeves. The silver floral embroidery on her attire not only accentuated the outfit but also brought liveliness to it.