చిత్రాంగద- బొహీమియన్ మరియు క్లాసి అందాల సంచలన సమ్మేళనం !

Written By: Gayatri Devupalli
Subscribe to Boldsky

బయట ఎండలు మండిపోతున్నాయని, ఒంటిని చల్లబరుచుకోవడానికి ఇంట్లో ఎయిర్ కండీషన్డ్ రూములో కూర్చున్నప్పటికీ, చిత్రాంగద తన సున్నితమైన వాడి వేడి వన్నెలతో చెమటలు కక్కిస్తుంది.

తన ఇంస్టాగ్రామ్ ఎకౌంట్లో లోల లేబుల్ తో సుమన్ బి చేత డిజైన్ చేయబడిన మిడ్నైట్ బ్లూ దుస్తులు ధరించి అలవోకగా తీసుకున్న ఫోటోలు పోస్ట్ చేసి చూపరుల మతి చెదరగోట్టింది.

ఉత్సాహభరితమైన రంగులలో,చురుకైన యాక్ససరీలతో, అగ్గి పుట్టించే గ్లామర్ తో ఈ ఛామనఛాయ సొగసుకత్తె, గత కొన్ని సంవత్సరాలుగా తన వన్నెతరగని అందాలతో, వీక్షకులని క్షణాల్లో దాసోహం చేసుకుంటుంది.

Chitrangdas Bohemian-Classy Look Is The New Rage

తరుణ్ తహిల్యాని డిజైన్ చేసిన తెల్లని లేహంగా నిస్సంకోచంగా ధరించి ( డి-డే రోజు ధరించడం నిషిద్దమనే ఆలోచనలు కలిగిన రోజుల్లో ) అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ అందాల భామ తన మనసుకు నచ్చిన దుస్తులు ధరించేటప్పుడు, ప్రపంచం ఏమనుకుంటుందనే ఆలోచనలను ఎప్పుడు లెక్క చేయదు.

వయస్సు పెరుగుతున్న కొద్దీ ఈమె సొగసు కూడా పెరుగుతూ వస్తుందనేది ఎవరూ కాదనలేని నిజం. లేయర్లుగా ఉండే ఫ్రింజ్ స్లిప్ దుస్తులలో ఆమె మతిపోగొట్టేలా మరియు నాటకీయంగా ఉంది.

లక్ష్మి లెహర్ మరియు సబీనా హల్దార్ డిజైన్ చేసిన క్లాసీ దుస్తులు ధరించి, దానికి జతగా ఆఫ్ బీట్ గా ఉండే చంకీ ఆభరణాలు ధరించింది. ఎర్రని జూకాలు మరియు కొట్టోచ్చే బ్రాస్లెట్లు ధరించి తన లుక్ నే మార్చేసింది.

నిజానికి ఇటువంటి లుక్, కేవలం నిన్నటి తరం తారలైన క్లాసి మార్లిన్ మన్రో మరియు బోహీమియన్ అలీ మెక్ గ్రా కలిసి షాపింగ్ కి వెళ్తేనే సాధ్యమవుతుంది.

Chitrangdas Bohemian-Classy Look Is The New Rage

తన దుస్తులకు జతగా ఆమె ధరించిన న్యూడ్ రంగు సాండల్స్ కొంత నిరుత్సాహపరిచాయనే చెప్పాలి. నలుపు షేడ్స్ కు ఆమె ప్రాధాన్యమిచ్చి ఉంటె బాగుండేది.

ఏదేమైనప్పటికీ, మొత్తంగా చెప్పాలంటే , ఈ చెమటలు కక్కించే అందాలు కలిగిన భామ, ప్రతిసారి తన మైమరపించే రూపురేఖలతో మనల్ని ఆకట్టుకుంటుంది అనేది కాదనలేని నిజం.

English summary

Chitrangda's Bohemian-Classy Look Is The New Rage

Chitrangda Singh had us sweating in the air-conditioned room with her new hot avatar. Her Instagram account came alive with the picture of her posing in a midnight blue dress by Lola by Suman B. She left no stone unturned to prove that she is only getting sexier with time. Characterised by layers, her fringe slip dress was absolutely mind-blowing.
Story first published: Friday, May 4, 2018, 11:30 [IST]