రాణిలా.. రాజ‌సం ఒల‌క‌పోస్తూ వ‌చ్చిన దీపిక ప‌దుకొణె

Written By: KrishnaDivYa P
Subscribe to Boldsky

ప‌ద్మావ‌త్ సినిమాలో రాజ‌సం ఒల‌క‌పోసిన బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా ప‌దుకొణె మ‌రోసారి రాణి అవ‌తార‌మెత్తింది. త‌న తండ్రి ప్ర‌కాశ్ ప‌దుకొణెకు భార‌త బ్యాడ్మింట‌న్ సంఘం అంద‌జేసినా జీవిత సాఫ‌ల్య పుర‌స్కార వేడుక‌కు చీర‌, న‌గ‌లు ధ‌రించి హాజ‌రైంది. త‌న చీర‌క‌ట్టుతో మురిపించిన సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రీ అందుకు త‌గిన మ్యాచింగ్ న‌గ‌లు వేసుకుని అవాక్క‌యేలా చేసింది. వేడుక‌లో భావోద్వేగానికి గురై క‌న్నీరు కార్చ‌డం మీడియాలో వైర‌ల్‌గా మారింది.

దేవ‌త‌లా దీపిక‌

దేవ‌త‌లా దీపిక‌

స‌భ్య‌సాచి రూపొందించిన పీచ్ వ‌ర్క్ చీర‌లో దీపిక శోభాయ‌మానంగా క‌నిపించింది. ఆ చీర‌లో ఆమె ప‌ద్మావ‌త్‌లోలాగా రాజసంగా క‌నువిందు చేసింది. దీంతో అభిమానులు ఫిదా అయిపోయారు. రాణి ప‌ద్మిని పాత్ర‌లో రానిస‌లా క‌నిపించింద‌ని అంటున్నారు. అందుకు త‌గ్గట్టే భారీత‌నం ఆమెలో కొట్టొచ్చింది.

ధ‌గ‌ధ‌గ‌లాడిన న‌గ‌లు

ధ‌గ‌ధ‌గ‌లాడిన న‌గ‌లు

ఆమె సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా క‌ట్టుకున్న భారీద‌నం ఉట్టిప‌డ్డ చీర‌కు స‌రిపోయే న‌గ‌లు ధ‌రించ‌డం ఇంకా హైలైట్. ఆ బంగారు న‌గ‌లు మ‌రింత వ‌న్నె తెచ్చాయి. దీపిక‌కు ఇష్ట‌మైన గుండ్ర‌ని చెవి దుద్దులు గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఇలాంటివే ఇంత‌కు ముందు చాలా సార్లు ధ‌రించిందామె.

ఇష్ట‌మైన గుండ్ర‌ని చెవి దుద్దులు

ఇష్ట‌మైన గుండ్ర‌ని చెవి దుద్దులు

దీపిక‌కు గుండ్ర‌ని చెవి దుద్దులు అంటే చాలా ఇష్టం. అంత‌కు ముందు కూడా చాలా కార్య‌క్ర‌మాల్లో ఆమె ఇలాంటివే ధ‌రించింది. త‌న తండ్రికి స‌న్మానం చేసిన ఈ వేడుక‌కూ అలాంటి దుద్దులే పెట్టుకొని వ‌చ్చింది. గ‌త వారం జ‌రిగిన ఫిల్మ్‌ఫేర్ పుర‌స్కార వేడుల‌కు ఇలాంటివే ధ‌రించింది దీపిక‌. అప్పుడూ స‌బ్య‌సాచే చీర‌ను రూపొందించ‌డం విశేషం.

భావోద్వేగంతో క‌న్నీరు

భావోద్వేగంతో క‌న్నీరు

వేడుక‌ల‌తో బ‌హుమ‌తి అందుకొన్న త‌ర్వాత త‌న తండ్రి ప్ర‌కాశ్ ప‌దుకొణె సందేశం ఇస్తున్న స‌మ‌యంలో దీపిక‌, ఆమె సోద‌రి అనిశా భావోద్వేగానికి గుర‌య్యారు. ఆనంద బాష్పాలు కార్చారు. ప్ర‌కాశ్ జీవితంలో తొలిసారి జీవిత సాఫ‌ల్య పుర‌స్కారం అందుకోవ‌డం, అదీ అతిపెద్ద భార‌త బ్యాడ్మింట‌న్ సంఘం అంద‌జేయ‌డంతో వారి కుటుంబం అంతా భావోద్వేగం చెందారు.

కుటుంబ‌మంతా ఫొటోల‌కు పోజు

కుటుంబ‌మంతా ఫొటోల‌కు పోజు

చివ‌ర్లో దీపిక‌తో క‌లిసి కుటుంబం అంతా ఫొటోల‌కు పోజులిచ్చారు. అందులో వారంతా చాలా సంతోషంగా న‌వ్వుతూ క‌నిపించారు. ఎంబ్రాయిడ‌రీ చేసిన స‌ల్వార్‌లో దీపిక సోద‌రి అనీశా సైతం చాలా అందంగా క‌నిపించింది. ఇక వాళ్ల అమ్మ క్రీమ్ క‌ల‌ర్ చీర‌లో, ముత్యాల న‌గ ధ‌రించి అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించారు.

English summary

Deepika Padukone Attends An Award Event In Style

Deepika Padukone's father Prakash Padukone won the Lifetime Achievement Award from the Badminton Association of India. Deepika attended the award ceremony with family to support her father. DeePee was looking gorgeous in her style book; but paparazzi broke news when the actress was seen emotionally breaking down.
Story first published: Wednesday, January 31, 2018, 15:30 [IST]
Subscribe Newsletter