For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2019 మెట్ గాలలో అద్భుతమైన బార్బీ గర్ల్ లుక్ తో మెప్పించిన దీపికా పదుకొనే

|

దీపిక పదుకునే వరుసగా మూడవసారి కూడా మెట్ గాలా కార్యక్రమానికి ఎంపిక అయింది. అంతేకాకుండా, మెట్ గాలా థీమ్ ను అందుకునేలా దీపికా ధరించిన దుస్తులు ఈసారి నెటిజన్స్ దృష్టిని మరల్చనీయకుండా చేయడంలో సఫలీకృతమయ్యాయనే చెప్పవచ్చు. ఇది సుసాన్ సొంటాగ్స్ 1964 లో రచించిన, నోట్స్ ఆన్ "క్యాంప్ " వ్యాసం ఆధారిత నెపధ్యానికి తగినట్లుగా ఈ దుస్తులను డిజైన్ చేయడం జరిగింది. జాక్ పోసెన్ రూపకల్పన చేసిన ఈ గౌన్, అద్భుతమైన రచనారూపకానికి సాక్ష్యంగా ఉన్నట్లు తలపించింది. అయితే, కేవలం ఆమె గౌన్ మాత్రమే కాకుండా, ఆమె మేకప్, హెయిర్ స్టైల్, ఆమె శైలి, ఆమెని మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేశాయి అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు.

గతంలో ధరించిన మెట్ గాలా దుస్తుల కారణంగా విమర్శలకు గురైన అనుభవంతో, ఈమారు అటువంటి పరిస్థితి తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా కనిపించింది. క్రమంగా ఆకట్టుకునేలా ముస్తాబై, మెట్ గాలాలో ప్రత్యేకాకర్షణగా నిలిచింది. ఆమె డిజైనర్ ద్వారా ప్రత్యేకంగా తయారుచేయించిన, పింక్ లురెక్స్ జాక్వార్డ్ గౌన్ పదునైన ఒరిగామీ ఫోల్డ్స్, మరియు ప్రోటోలాబ్స్ ఎంబ్రాయిడరీ వర్క్ జోడించుకుని అద్భుతంగా తీర్చిదిద్దబడింది. ఈ దుస్తుల థీమ్ కూడా విమర్శకుల నోళ్లకు పని చెప్పకూడదు అన్నట్లుగా ఎంచుకున్నట్లుగా తెలుస్తుంది. అనగా, ప్రతి విషయంలోనూ దీపికా ప్రత్యేకమైన జాగ్రత్తలను తీసుకున్నట్లుగా అర్ధమవుతుంది.

దీపికా సహజంగానే మేకప్ మరియు ఫాషన్ పోకడల దృష్ట్యా ప్రత్యేకమైన శైలిని అనుసరిస్తూ ఉంటుంది. క్రమంగా ఈ కార్యక్రమంలో తన దుస్తులలోనే, తన పట్టుదలను ప్రతిబింబించేలా ముస్తాబైంది.

ఇక ఆభరణాల పరంగా, ప్రత్యేకించి తయారుచేయబడిన చేతి గాజులు, చెవి రింగులు, లారైన్ స్క్వార్ట్జ్ చేత డిజైన్ చేయించిన స్టేట్మెంట్ హెయిర్ బాండ్ ఈ బార్బీ కాంపీ ఎఫెక్ట్ కు అదనపు ఆకర్షణగా నిలిచాయి. సహజత్వానికి కాస్త భిన్నంగా ఆమె అనుసరించిన మేకప్, ట్రెండ్ కి తగినట్లుగా ఫ్యాషన్ ఆరాధకులకు ప్రేరణగా నిలిచిందనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. రెడ్ వైన్ రంగుతో కూడిన లిప్ షేడ్, ఊదాగులాబీరంగు ఐషాడోతో కూడిన మేకప్, దీపికా దుస్తుల పనితనాన్ని రెట్టింపు చేశాయి. ఇక హెయిర్ స్టైల్ విషయానికి వస్తే, స్టైలిస్ట్ కి హాట్సాఫ్ చెప్పక తప్పదు. దీపికాకు బార్బీ టచ్ తీసుకుని రావడంలో, గాబ్రియల్ జార్జ్ పనితనం అద్భుతమనే చెప్పాలి. ఈ హెయిర్ స్టైల్ హై-పోనీ డిజైన్ కలిగి, ఇన్నోసెంట్ లుక్ తలపించేలా రూపకల్పన చేయబడింది.

మా వరకు దీపికా ఒక అద్భుతమైన బొమ్మలా కనిపించింది ? మరి మీకు ? మీ అభిప్రాయాలను క్రింది వ్యాఖ్యల విభాగంలో పంచుకోండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర విషయాలతో పాటు. ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి.

English summary

Deepika Padukone’s Barbie Look At Met Gala 2019

Deepika Padukone also graced the Met Gala for the third time and this time, the actress actually nailed the theme, which was Susan Sontag's 1964 essay, 'Notes on "Camp". Deepika wore a Zac Posen gown and exuded grandeur and magnificence. However, not just her gown, it was her makeup and hairdo, which elevated her style and made her look 'Campy'.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more