Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
కేన్స్ ఫిలిం ఫెస్టివల్ 2019 లో భాగంగా, పీటర్ డున్డాస్ రూపొందించిన గౌన్లో తళుక్కుమన్న దీపికాపదుకునే
దీపికా పదుకొనే తన కేన్స్ 2019 జర్నీని నాటకీయంగా ప్రారంభించి అందరి దృష్టిని తన వైపుకు మరల్చుకునేలా చేసింది. ఈ సారి కేన్స్ ఫెస్టివల్ 2019 లో భాగంగా, తన దుస్తుల ఎంపికలో ప్రత్యేక శ్రద్ద తీసుకున్నట్లుగా కనిపిస్తుంది. క్రమంగా డిజైనర్ పీటర్ డున్డాస్ రూపొందించిన ఈ దుస్తులలో ఒక కాంతి పుంజం వలె మెరిసిపోతూ హొయలొలికించింది దీపికా. తన కేన్స్ 2019 జర్నీని మొదటి నుండీ ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని భావించిందేమో కానీ, ఈసారి ఆమె గౌన్, ఈఏడాది మెట్ గాలా కార్యక్రమాన్ని గుర్తుచేసేలా కనిపిస్తూ ఉంది. ఏదేమైనా, దీపికా అద్భుతంగానే కనిపిస్తూ ఉంది, తన దుస్తుల ఎంపికతో మరో మారు ఫాషన్ ప్రియుల చూపులను తనవైపుకి తిప్పుకునేలా చేయడంలో విజయం సాధించిందనే చెప్పాలి.

కొన్ని వారాల క్రితం జరిగిన మెట్ గాలా కార్యక్రమంలో, దీపికా, జాక్ పోసెన్ రూపొందించిన గౌన్లో బార్బీ వైబ్స్ తలపించేలా కనువిందు చేసింది. అదే స్పిరిట్ తో, ఈ కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో కూడా వారియర్ ప్రిన్సెస్ ని తలపించేలా కనపడి మరో సెన్సేషన్ క్రియేట్ చేసింది. క్రమంగా ఈ అద్భుతమైన గౌన్లో అందరినీ నిశ్చేష్టులను చేయగలిగింది. ఈ గౌన్ రూపొందించిన విధానం కూడా అద్భ్తమనే చెప్పాలి. ఇప్పటి వరకూ ఎక్కడా చూడని విధంగా, తేలికపాటి రంగులను జోడించి ఆకర్షణీయంగా రూపొందించడం జరిగింది. దీపిక ధరించిన ఈ బిషప్ స్లీవ్ గౌన్ 18 వ శతాబ్దానికి చెందిన, సాంప్రదాయక బాల్రూమ్ డాన్స్ థీం తలపించేలా ఉన్నా, ఈ దుస్తులకు అదనంగా డీప్ నెక్ స్లిట్ జోడించి మోడరన్ టచ్ ఇచ్చింది.
కేవలం దుస్తుల పరంగా మాత్రమే కాకుండా, ఆభరణాల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ద కనపరిచింది దీపిక. తాను ధరించిన డైమండ్ లోరైన్ స్క్వార్ట్జ్ చెవి రింగులు, మరియు స్ట్రాపీ బ్లాక్ ఆక్వాజురా చెప్పల్స్ తో తన వస్త్రధారణకు పూర్తి రూపాన్ని ఇచ్చింది. ఇక మేకప్ విషయానికి వస్తే, కళ్ళకు విన్గ్డ్ ఐ లైనర్ జోడించి, పై భాగాన్ని న్యూడ్ - టోన్డ్ లుక్ తో ముగించింది. ఇక పెదాలపై వేసిన పింక్ లిప్ షేడ్ ఆమె మేకప్ కు సరైన బ్యాలెన్స్ గా కనిపించింది. అయితే, దీపికా, ఈసారి కూడా తన హై-పొనీటెయిల్ హెయిర్ స్టైల్ ను రిపీట్ చేసింది. అయితే ఈ హెయిర్ స్టైల్ తన వస్త్రధారణకు న్యాయం చేసిందనే మేము భావిస్తున్నాం. మరి దీపికా, కేన్స్ ఫిలిం ఫెస్టివల్ 2019, మొదటి లుక్ గురించి మీరేమనుకొంటున్నారు ? క్రింది వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.
ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర మేకప్, ఫాషన్, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, మాతృ శిశు సంబంధ, వ్యాయామ, లైంగిక, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి.



Click it and Unblock the Notifications


