దుర్గాపూజ ప్రత్యేకం ; వెస్ట్రన్ దుస్తులతో చోకర్లు వేసుకోటానికి చిట్కాలు

By: DEEPTHI T A S
Subscribe to Boldsky

ఏడాదికి మించి చోకర్లు ట్రెండ్ లో ఉన్నాయి. మంచి విషయం ఏంటంటే వీటిని ఎవరైనా సంప్రదాయ, వెస్ట్రన్ దుస్తులపై వేసుకోవచ్చు. ఏ బెంగాలీకైనా దసరా సమయం ప్రయోగం చేయటానికి మేటి సమయం, అలాగే చోకర్స్ ప్రయత్నించడం మేటి ప్రయోగమవుతుంది. మీ మెడ పొడవుగా ఉంటే అదొక లాభం.

చోకర్స్ ఎంత ట్రెండీ అయినా, అవి వేసుకోవడం కష్టం. సరిగ్గా నప్పే బట్టలతో ధరించకపోతే, మొదటికే మోసం వస్తుంది.

మేము వెస్ట్రన్ దుస్తులతో వేసుకోదగిన చోకర్ల రకాల గూర్చి మీకు పరిచయం చేయబోతున్నాం. ఇవి భారత సాంప్రదాయ దుస్తులతో కూడా ధరించవచ్చు.

సాంప్రదాయ చోకర్

సాంప్రదాయ చోకర్

ఒకవేళ మీరు మీ వెస్ట్రన్ బట్టలపై సాంప్రదాయ చోకర్ వేసుకోవాలని భావిస్తున్నట్లయితే మరియు మీకు ఏ చోకర్ ను వాడాలో తెలియకపోతే ఆందోళన చెందకండి.డ్రెస్సులు, పెద్ద మెడ ఉన్న టాప్ లపై కుందన్ లేదా ముత్యాలు పొదిగిన సాంప్రదాయ చోకర్లు బావుంటాయి.అవి మీ లుక్ ను అద్భుతంగా మార్చేస్తాయి.

గిరిజన చోకర్

గిరిజన చోకర్

గిరిజన చోకర్ లు అసామాన్యం కానీ చాలా హుందాగా ఉంటాయి.జానపద నృత్యాలు, ప్రత్యేకంగా సంతాలీ నృత్యం ఇష్టపడే స్త్రీలకి ఈ లుక్ పరిచయమే. ఈ చోకర్లు సాంప్రదాయ, వెస్ట్రన్ దుస్తులు రెండింటిపై బావుంటాయి.బొహీమియన్ లుక్ లో వీటిని జాగ్రత్తగా వాడినట్లయితే,ఈ రకపు చోకర్ అద్భుతంగా కన్పిస్తుంది.

పూసల చోకర్

పూసల చోకర్

డ్రస్ ఆకారం బట్టి, పూసల చోకర్లు సాంప్రదాయ, వెస్ట్రన్ దుస్తులకు రెండింటికి నప్పుతాయి. కానీ అన్ని పూసల చోకర్లు సాంప్రదాయ దుస్తులకి బాగోవు. అలాగే అన్ని వెస్ట్రన్ దుస్తులకి కూడా బాగోవు.

ఈ ఎంపిక కఠినమైనదే కానీ మేము మీకు సాయం చేస్తాం. పెద్ద మెడ ఉన్న మాక్సి డ్రస్ కానీ, భుజాలు లేని టాప్ కానీ కొంటున్నట్లయితే, ఈ పూసల చోకర్లు హుందాగా కన్పిస్తాయి.

వజ్రాల చోకర్

వజ్రాల చోకర్

వజ్రాల చోకర్లు అన్నిటికన్నా ఖరీదైనవి. అందుకని మండపాల ఉత్సవాలలో వీటిని ధరించకపోవటమే మంచిది. ఒకేచోట కూచుంటే ఇలాంటి చోకర్లు పొడవైన మ్యాక్సి డ్రస్ పై కానీ, షీత్ పై కానీ అందంగా ఉంటాయి. మరోసారి చెప్తున్నాం, ఆ డ్రస్ యొక్క మెడ స్పష్టంగా ఉండాలి.

పువ్వుల చోకర్

పువ్వుల చోకర్

ఈ రకపు చోకర్లను బట్టతో లేదా లేసులతో చేస్తారు.ఇవి డ్రస్ లు, లేసు టాప్ లపై అందంగా కన్పిస్తాయి. మా సలహా ఏంటంటే వీటిని లేతరంగు దుస్తులతో వేసుకోండి. ఇంకా అద్భుతంగా కన్పిస్తాయి.

బట్టల చోకర్

బట్టల చోకర్

ఇది అందరూ ఎక్కువగా వాడే రకం. దీని ఎంపిక సులభం కాదు. మీరు వీధుల్లో చాలామంది వీటిని వేసుకోవడం చూసే ఉంటారు, కానీ వారి స్టైల్ కి నప్పక అసహ్యంగా ఉంటాయి.

English summary

Styling Tips For Wearing Chokers During Durga Puja, Chokers For Durga Puja, Durga Puja 2017 Western Style Trends, Durga Puja 2017, Chokers Trend, Durga Puja Style Tips 2017, Durga Puja Fashion Tips 2017

Have a look at how chokers can look best with Western attires this Durga Puja.
Story first published: Thursday, September 14, 2017, 22:00 [IST]
Subscribe Newsletter