ఎడారిలో చలిని పెంచే దిశగా ఇషా గుప్తా ...

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

సూర్యుని తాపం పెరగనీ, వడగళ్ళ తుఫాను పుట్టనీ, పర్వతాలైనా మహాసముద్రాలైనా ఏప్రదేశమైనా కానివ్వండి , ఇషా గుప్తా భంగిమ, వాతావరణంలో అసాధారణ మార్పులు తీస్కుని రావడం మాత్రం ఖచ్చితం. ఈ సమయం ఒక ఎడారి ఆ భంగిమలకు వేదికైంది, ఒక ప్రముఖ కంపెనీ ప్రచార నేపధ్యంలో భాగంగా ఒంటెలతో కలిసి దిగిన ఫోటోలు సెన్సేషన్ గా మారాయి. ఇక నెటిజన్లు ఊరుకుంటారా, షేర్ల మీద షేర్లు చేస్కుంటూ పండగ చేసుకుంటున్నారు.

మరియు గోధుమ రంగులో విస్తారంగా పరచుకుని ఉన్న ఎడారి ఇసుక మధ్యలో ఒక మిలియన్ డాలర్ బేబీ వలె కనిపించింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఇతరుల వలె ఎడారి ఉష్ణోగ్రతలు పెంచకుండా, చలిని పెంచే దిశగా ఇషా కనిపించి, ఇంటర్నెట్ ట్రాఫిక్ ను పెంచింది. ఏమిటీ అద్భుతమైన మార్పు అని అనిపించేలా! మనమందరమూ ఈ వేసవిలో కోరుకునే మార్పు అటువంటిదేగా?

Esha Is All Blue Da Ba Dee In The Desert

ఈ ప్రచార షూటింగ్ నిమిత్తం, నీలంరంగు దుస్తులు ధరించి మండుటెండలో ఎడారిలో కొత్త వార్డ్రోబ్ గోల్స్ ఇచ్చినట్లు కనిపించింది. “ఆర్.ఎస్ బై రాకీ స్టార్” బ్రాండ్ కోసం రాకీ ఎస్ రూపొందించిన డెనిమ్ ఆఫ్–షోల్డర్ దుస్తులను ధరించిన “రుస్తుం” సినిమా హీరోయిన్ ఇషా గుప్తా, ఒక డెనిమ్ ఆఫ్-భుజం దుస్తులను, సరిజోడీ బూట్లను ధరించి అబ్బురపరచేలా దర్శనమిచ్చింది. ఆమె భుజంమీద జలపాతంలా జాలువారుతున్న గోధుమరంగు జుట్టు ఒక భిన్నమైన వైల్డ్ క్రూయాల్ లుక్ ఇచ్చింది. ఇక్కడ జుట్టు సాధారణ అంశంగా తోచడంలేదు. తలకు కట్టిన బాండ్ మరియు అలంకరణను చూస్తుంటే, ఒక బోహేమియన్ లుక్ తీసుకు రావడంలో ప్రత్యేక శ్రద్ధను తీసుకున్నట్లుగా తోస్తుంది.

ఇక ఆమె రెండో ఫోటోకి వస్తే, ఇషా మోనోక్రోమ్స్ తో ఆడినట్లుగా అనిపిస్తుంది. ముదురు రంగులో ఉన్న డెనిమ్ క్రాప్ టాప్ ధరించి, ముదురు నీలిరంగులోని చీలిక కలిగిన స్కర్ట్ ధరించి సూపర్ లుక్ ఇచ్చింది. ఆభరణాల పరంగా పసుపురంగు చెవి పోగులను ధరించి, మల్టీ కలర్ బాండ్ ధరించి గాలికి ఎగురుతున్న జుట్టుతో ఫోటోలకు పోజులిచ్చింది.

Esha Is All Blue Da Ba Dee In The Desert

ఈ ఫోటో షూట్ లో నేరుగా ప్రపంచాన్ని చూస్తున్నట్లు తలెత్తి అసాధారణ వ్యక్తిత్వం ప్రతిబింబించేలా నిలబడి అదరగొట్టింది. సోషల్ మీడియాకి నిద్రలేని రాత్రులను బహుమతిగా ఇస్తుంది అనడంలో ఆశ్చర్యమే లేదు.

మేమైతే నిశ్చేష్టులమయ్యాం. మరి మీరు? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలుపండి.

English summary

Esha Is All Blue Da Ba Dee In The Desert

Be it sunshine or hailstorm, be it mountains or oceans, Esha Gupta can fearlessly strike a pose anywhere. This time the location was a desert and Esha brought coolness to the location. The first look had 'Rustom' actress wearing a denim off-shoulder dress and teaming it with a pair of boots. But what did she wear for her second look?
Story first published: Monday, May 7, 2018, 12:00 [IST]