పెళ్ళికూతురు నుండి అతిధుల వరకు సోనమ్ మెహెంది వేడుకలో మెరిపించే డ్రెస్ డిజైన్స్

Written By: Gayatri Devupalli
Subscribe to Boldsky

ఒక సొగసుకత్తె పెళ్ళికి సంసిద్ధమవుతుందంటే, ఆ వేడుకలో సొగసు-సోయగాల పాళ్ళు సహజంగానే ఎక్కువగా ఉంటాయి. ఆ సొగసుకత్తె ఎవరో గ్రహించారా? అవును మనం మాట్లాడుకుంటున్నది సోనమ్ కపూర్ గురించే! ఆమె తన ప్రియుడు ఆనంద్ ఆహుజాను రేపు వివాహం చేసుకోబోతున్నది.

పెళ్లి వేడుకలు ముందుగా మెహెంది పండుగతో అట్టహాసంగా మొదలయ్యాయి. సోనమ్ పీచ్ మరియు గ్రే రంగుల మేళనతో రూపొందించిన సంప్రదాయ దుస్తులలో మెరిసింది. ఆమె ఆనందమంతా ఆమె అణువణువులోనూ కొట్టోచ్చేటట్లు కనిపిస్తుంది. ఆమె తన చేతులపై మెహెంది సొగసులను అలవోకగా చూపిస్తూ కెమెరాలకు పోజులిచ్చారు. ఆమె దుస్తులపై బంగారు జరీ పనితనం మరియు ఆమె ధరించిన జుంకీలు ఆమెకు నిండుతనాన్ని అందించాయి.

From Bride To Guests: Who Wore What At Sonams Mehendi?

ఆమెకు కాబోయే భర్త ఆనంద్, సాల్మన్ సిల్వర్ రంగు బంద్ గలా షేర్వాణి ధరించి ఆమెకు సరైన జోడిగా నిలిచారు.

ఈ వేడుకకు తెలుపు మరియు పాస్టెల్ షేడ్స్ థీమ్ కలర్స్ గా అనిపించినప్పటికీ, కొంతమంది ఆహూతులు నిండైన రంగులున్న దుస్తులను కూడా ఎన్నుకున్నారు.

సోనమ్ చెల్లెళ్ళయిన జాహ్నవి మరియు ఖుషి, మనీష్ మల్హోత్రాచే డిజైన్ చేయబడిన లెహంగాలలో చూపు తిప్పుకోలేనంత అందంగా కనిపించారు. జాహ్నవి లేలేత తెలుపు, గులాబి మరియు బంగారు రంగుల దుస్తులు ధరిస్తే, ఖుషి ముదురు నీలిరంగు లెహంగాకు జతగా తెల్లని చికన్కారి వర్క్ చేసిన గులాబి దుపట్టా ధరించింది.

జాహ్నవికి మల్లె సోనమ్ చెల్లెలు రియా మీగడ వన్నె దుస్తులు ధరించింది. ఆమె తమ్ముడు హర్షవర్ధన్ తెల్లని కుర్తా పైజామా పైన నెహ్రూ కోట్ వేసుకున్నాడు. సోనమ్ తండ్రి అనిల్ కపూర్ తెల్లని సాంప్రదాయ దుస్తులలో హుందాగా కనిపించారు.

వీరేకాక , ఈ వేడుకలో పాలుపంచుకున్న కరణ్ జోహార్, శంతను మరియు నిఖిల్ రూపకల్పన చేసిన తెల్లని ఎసిమెట్రిక్ కుర్తాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కుర్తాకు జతగా ధరించిన నల్లని పాదరక్షలు మరియు కుర్తాకు తగిలించిన బ్రూచ్ సంప్రదాయ శోభను చేకూర్చింది. ఇతని స్నేహితురాలైన రాణి ముఖర్జీ సంప్రదాయ వస్త్రధారణకి మెలికనిచ్చి ఆశ్చర్యపరచింది. ఈ హిచ్కీ నాయిక తెల్లని ప్రింటెడ్ ప్యాంట్ కు జతగా వదులైన పొడుగాటి లెస్ తో కూడిన స్లీవ్స్ ఉన్న షర్టు ధరించింది. చెవులకు ముత్యాల దిద్దులు మరియు డోల్స్అండ్ గబ్బన చెప్పులు ఈమె ధరించింది.

అర్జున్ కపూర్ మరియు సంజయ్ కపూర్ పెళ్లికే కల తెచ్చేలా నారింజ రంగు షేర్వాణీలు ధరించి సందడి చేసారు. దివంగత శ్రీదేవి భర్త అయిన బోనీ కపూర్, నలుపు మరియు లావెండర్ రంగుల సమ్మేళనంలో సంప్రాదాయ దుస్తులు ధరించారు.

మెహెంది వేడుకకు తరువాత జరబోయే పెళ్ళికి సోనమ్ ఏ విధంగా ముస్తాబవ్వడానికి సిద్దమవుతుందో, అనే ఆత్రుత మీకు కూడా కలుగుతుంది కదా? అయితే మరిన్ని వార్తల కొరకు బోల్డ్ స్కైను చూస్తూ ఉండండి.

From Bride To Guests: Who Wore What At Sonams Mehendi?
From Bride To Guests: Who Wore What At Sonams Mehendi?
From Bride To Guests: Who Wore What At Sonams Mehendi?
From Bride To Guests: Who Wore What At Sonams Mehendi?

English summary

From Bride To Guests: Who Wore What At Sonam's Mehendi?

Our dazzling diva looked like a dream in a peach and grey coloured traditional attire on her intimate mehendi ceremony. Her soon-to-be Anand Ahuja donned a salmon-silver hued bandhgala sherwani and was her perfect twining. Sonam's cousins, Janhvi and Khushi Kapoor, looked simply stunning in Manish Malhotra lehengas,
Story first published: Monday, May 7, 2018, 20:00 [IST]