అమ్మకు ప్రేమతోనే ప్రపంచ సుందరి అయింది...17ఏళ్ళ తర్వాత ! మన ఇండియన్ ప్రపంచ సుందరికి ఫిదా

Posted By:
Subscribe to Boldsky

భారత్‌కు మిస్‌ వరల్డ్‌ కిరీటం దక్కింది. దాదాపు పదిహేనేళ్ల తర్వాత మిస్‌ ఇండియా మనూషి చిల్లర్‌ మిస్‌ వరల్డ్‌ కిరీటం అందుకున్నారు. చైనాలో జరిగిన 2017 మిస్‌ వరల్డ్‌ పోటీల్లో మొత్తం 118 మంది సుందరీమణులు పోటీపడ్డారు. ప్రేక్షకులు, న్యాయనిర్ణేతల ఓట్లను కలుపుకొని తొలుత టాప్‌ 40 మందిని ఎంపిక చేశారు. అనంతరం టాప్ 25, టాప్‌ 8, చివరకు టాప్‌ 3 రౌండ్లు నిర్వహించారు.

Indian Student Manushi Chillar Won The 67th Miss World Title

67వ మిస్ వరల్డ్ లో చివరిగా టాప్‌ 3లో మిస్‌ ఇండియా, మిస్‌ మెక్సికో, మిస్‌ ఇంగ్లండ్‌లు పోటీపడ్డారు. చివరి రౌండ్‌లో ప్రపంచంలో ఏ వృత్తితో ఎక్కువగా సంపాదించవచ్చన్న న్యాయనిర్ణేతల ప్రశ్నకు మిస్‌ ఇండియా మనూషి చిల్లర్‌ ప్రపంచంలో అన్నిటికన్నా అమ్మదనమే గొప్పదని తెలిపారు.

Indian Student Manushi Chillar Won The 67th Miss World Title

ఇది డబ్బుల వ్యవహారం కాదు. ప్రేమకు, గౌరవానికి ప్రతిరూపం అని పేర్కొన్నారు. అనంతరం విజేతగా హర్యానా మెడికల్ స్టూడెంట్ మనూషి చిల్లర్‌ను ప్రకటించడంతో 2016 మిస్‌ వరల్డ్‌ నుంచి కిరీటం అందుకున్నారు. రెండోస్థానంలో మిస్‌ మెక్సికో, మూడో స్థానంలో మిస్‌ ఇంగ్లండ్‌లు నిలిచారు. 17 ఏళ్ల క్రితం బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా 2000 మిస్‌ వరల్డ్‌ కిరీటం దక్కించుకున్నారు.

Indian Student Manushi Chillar Won The 67th Miss World Title

కిరీటం పొందే సమయంలో సిక్స్ యార్డ్ సిల్వర్ గౌన్లో చాలా అద్భుతంగా ఉంది. చివరి క్షణాల్లో జడ్జెస్ అడిగిన ప్రశ్నకు అత్యద్భుతమైన సమాదానం ఇచ్చి జడ్జెస్ ను ఫిదా చేసి, ఇండియా ది గ్రేట్ అనిపించింది. మరి ఈ ప్రపంచ సుందరిని మీరు కూడా చూసేయండి.

English summary

Indian Student Manushi Chillar Won The 67th Miss World Title

haryana-student-manushi-cchillar-won-miss-world, Indian Student Manushi Chillar Won The 67th Miss World Title
Subscribe Newsletter