Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
హాట్ : మిస్.పీసీ స్లిట్ –బ్లేజర్ డ్రెస్ లో మళ్ళీ చంపేసింది
లేడీ బాస్ లా నడుస్తుంది, చూపరుల కళ్ళు జిగేల్ మనిపించే దుస్తులలో ధగ ధగ మెరిసిపోతుంది, ఫాషన్ ప్రపంచాన్నే అవపోసన పట్టింది, తన క్రూరమైన చూపులతో అభిమానుల గుండెలను తూట్లు పొడుస్తుంది. మరెవరో కాదు, బాలీవుడ్ నుండి హాలీవుడ్ వెళ్లి తనకంటూ ఒక ముద్ర వేసుకున్న ప్రియాంకా చోప్రా.
అవును మిస్. పీసీ గా పేరున్న ప్రియాంకా చోప్రా, ఈమధ్యనే స్పోర్టెడ్ డెనిమ్ డ్రెస్ లో తళుక్కుమనిపించి చూపరుల చూపులు తిప్పుకోలేని విధంగా హొయలొలికించింది. సోనం కూడా ప్రియాంకా సెక్సీ అవతార్ పై “ మీరు చంపేస్తున్నారు” అని కామెంట్ పెట్టింది.

నిమిషం తీరికలేని పని ఒత్తిడి, పని జాబితాతో కూడుకుని ఉన్న ప్రియాంకా చోప్రా ఎల్లప్పుడూ ఫ్రెష్ గా అందాన్ని నిర్వహిస్తుంది అంటేనే అర్ధమవుతుంది, ప్రియాంకాకు వృత్తిపట్ల ఉన్న నిబద్దతా, అంకితభావం ఎలాంటిదో. భావవ్యక్తీకరణలో, ఆత్మస్థైర్యంలో తనకు తానే సాటిగా ఉన్న ప్రియాంకా ప్రపంచం గుర్తించిన తారల్లో ఒకరుగా ఉన్నారంటే ఆశ్చర్యం వేయక మానదు. ముఖ్యంగా భుజాల మీద జాలువారుతున్న ప్రియాంకా జుట్టు, మనల్ని ఊపిరి సలపనివ్వదు అంటే ఆశ్చర్యం లేదు.
డియాన్ లీ లింగరీ బ్లేజర్ డ్రెస్ లో, పీసీ ప్రపంచం తనవైపు చూసేలా చేయగలిగింది. ముఖ్యంగా ఈ పొడవాటి స్లీవ్స్ కలిగిన దుస్తులలో బ్రా-స్లిట్స్ ప్రత్యేక ఆకర్షణ అని చెప్పక తప్పదు. అసలు ఈ దుస్తులకు అంత క్రేజ్ రావడానికి కారణం కూడా అదే మరి. ఏది ఏమైనా ప్రియాంకా ఇలాంటి ధైర్యం చేయగలదు, మరియు డీప్ నెక్లైన్, ఈ దుస్తులకు మరింత సెక్సీనెస్ ను జోడించింది.

ఈ లేయర్డ్ హెమ్ కలిగిన డెనిమ్ దుస్తులు , షార్ప్ - కట్ బ్లేజర్ మరియు సెక్సీ లింగరీ కలయికతో కూడి ఉంటుంది. ఈ స్టేట్మెంట్ బ్లేజర్ ప్రియాంకా అందానికి సరికొత్త మెరుగులు దిద్దినట్లుగా కనిపించింది. పొడవాటి కాళ్ళను కలిగిన ప్రియాంకా ఆదుస్తులలో చందమామ వలె కనిపిస్తూ ఉంది అని నెటిజన్లు కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు. మరియు తన స్టాల్వే లెదర్ హాండ్ బాగ్ ప్రియాంకా స్టైల్ కు సరిగ్గా నప్పేలా ఆకర్షణీయంగా కనిపించింది.
రెండురోజుల తర్వాత మరలా అస్సాం సాంప్రదాయవాద దుస్తులలో కనిపించి వెస్టర్న్ స్టైల్ కు కన్నుకుట్టేలా కనపడింది. తద్వారా ప్రియాంకా మనల్ని రోజుకో అందంతో కిర్రాక్ పుట్టిస్తూ ఉందని వేరే చెప్పనవసరం లేదు. మీరేమనుకుంటున్నారు ఈ అందాల తార లుక్ గురించి?



Click it and Unblock the Notifications