For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఇంటర్నెట్ ప్రపంచాన్ని షేక్ చేసిన సోనం , కరీనా..!

  |

  ఎప్పుడైనా సోఫా నుండి ఎగిరి దూకి, ఓ మై గాడ్ , వాట్ ఎ బ్యూటీ అంటూ అరిచారా? ఈ ముగ్గురు రావిషింగ్ దివాస్ ఫొటో చూశాక ఇంటర్నెట్ ప్రపంచమే ఉలిక్కిపడి అలా అరిచింది. ముఖ్యంగా సోనం కపూర్, కరీనా కపూర్ ఇంటర్నెట్ ట్రాఫిక్ ని అమాంతం పెంచారనే చెప్పవచ్చు.

  ఈ ముగ్గురు కపూర్ త్రయం సెక్సీ పోజులతో ఒకే ఫ్రేంలో చేరి సెగలు పుట్టించేలా ఫోటోషూట్ లో పాల్గొన్నారు. సోనం, కరీనా మరియు రియా కపూర్లు ముగ్గురూ " వీరే దీ వెడ్డింగ్" సినిమా ప్రమోషన్లో భాగంగా ఫోటోషూట్ లో ప్రత్యేకంగా పాల్గొని, ఆరెంజ్ ఎప్పటికీ బ్లాక్ కలర్ ప్రత్యామ్నాయం కాదని నిరూపించారు.

  Kareena Veere Di Wedding

  ఈ ముగ్గురు అందగత్తెలు నిండైన నలుపు రంగు దివాస్ దుస్తులను ధరించి ఐవరీ (చెక్కబడిన క్రీమీ వైట్ దంతము వలెనున్న) బాక్ గ్రౌండ్ ముందు నిలబడి ఇచ్చిన పోజు, ప్రకృతిలో చూడని అందాలు ఇంకా అనేకం ఉన్నాయా? అని అనిపించేలా, హైలెట్ గా నిలిచింది అని చెప్పవచ్చు.

  భంగిమలు సైతం ప్రాణాలు తీయగలవు అని ఉంటే, ఈ ముగ్గురు ఇచ్చిన పోజులు ఆయుధాలవలె మారి తునాతునకలు చేసేవి.

  చివరిసారిగా మనం కరీనాను "రాయల్ బ్లూ సపరేట్స్" దుస్తులలో చూశాము, ఇప్పుడు స్లిట్(చీలిక)తో కూడిన నలుపు దుస్తులలో సూపర్ హాట్ గా కనిపించి, తన పదునైన చూపులతో ఇంటర్నెట్ ప్రపంచాన్ని తునాతునకలు చేసింది.

  కరీనా కపూర్ ధరించిన ఈ సూపర్ సెక్సీ దుస్తులు మిగిలిన అన్నిరకాల ఆర్భాటపు దుస్తులకు భిన్నంగా కనిపించినా, సోనం దుస్తులు కాస్త విరుద్దంగా ఖరీదైన లుక్ ని అందించాయని చెప్పవచ్చు. నలుపు లెహంగాపై ప్రకాశవంతమైన సిల్వర్ షోన్ కోటింగ్ డిజైన్ కలిగిన దుస్తులని ధరించిన సోనం, చేతిలో నలుపు దుప్పటాని కలిగి ప్రధాన ఆకర్షణగా నిలించింది. నిజంగా మతిపోగొట్టే పోజుతో దర్శనమిచ్చిన సోనం, అభిమానులకు పండగని తెచ్చిందనే చెప్పుకోవాలి. ఒకరకంగా ఇది కిల్లర్ మూవ్.

  సోనం చెల్లెలు రియా బంగారపుటంచును కలిగిన నలుపు రంగు సాదా శారీలో ఉన్నా కూడా, పైన ధరించిన గ్లిట్టరింగ్ గోల్డ్ జాకెట్, ఖచ్చితంగా చూపును రియా మీద పడేలా చేస్తుంది అనడంలో ఆశ్చర్యం లేదు. నిజానికి ఈ ముగ్గురూ ఎవరికి వారే గొప్ప అన్నట్లుగా ఫోటోలో ఉన్నారు.

  వీరే దీ వెడ్డింగ్ ప్రమోషన్ షూట్ కార్యక్రమంలో ఈ ఫాషనబుల్ షూట్ సరికొత్త ఫాషన్ ప్రపంచానికి వేదికైంది . ఈ సినిమా ట్రైలర్ ఎక్కువగా నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్ స్టైల్ స్టేట్మెంట్స్ గురించి హైలైట్ చేసింది. సెక్స్ అండ్ సిటీ వలె, ఈ సినిమా కూడా పెద్ద విజయాన్ని అందుకుని, స్త్రీలు బెస్ట్ ఫ్రెండ్స్ గా మరియు ఫన్ లవింగ్ నేచర్ కలిగి ఉండగలరు అని నిరూపించగలదు అని ఆశిద్దాం.

  English summary

  How Kareena And Sonam Broke The Internet?

  The Kapoor trio sizzled in a hot and exclusive photoshoot for their upcoming film, 'Veere Di Wedding'. The very fashionable shoot mirrored the fashion shown in their upcoming movie. The trailer of the flick highlighted the style statements of four bffs. The three leading babelicious divas donned striking inky black attires
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more