మాధురి ఏక్, దో, తీన్ పాటకు తనదైన మేకోవర్ తో మెరుపులద్దిన జాక్వెలిన్

Posted By: Gayatri Devupalli
Subscribe to Boldsky
Jacquelines Ek-Do-Teen Look OUT!

ఇటీవల బాలీవుడ్ హాటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నర్తించిన పాట టీజర్ అంతర్జాలంలో విడుదలైంది. ఎనభైలలో సంచలనాలు సృష్టించిన మాధురి దీక్షిత్ "ఏక్, దో, తీన్" పాటకు ఈ అమ్మడు తన కాలు కదిపింది. విడుదలైన కాసేపటికే ఈ పాట అంతర్జాల ప్రేక్షకుల మనసు కొల్లగొట్టింది. టైగర్ ష్రాఫ్ మరియు దిశా పటాని జంటగా నటించిన రాబోయే యాక్షన్ సినిమా "భాగీ-2" లో "మోహిని"గా తన మార్కు అభినయంతో అలరించబోతుంది.

బాలీవుడ్ లో ఫ్యాషనబుల్ నటీమణులలో, ఉత్తమ నర్తకీమణులలో ఒకరిగా పేరుపొందినా కూడా జాక్వెలిన్, అలనాడు మాధురి దీక్షిత్ అద్భుతమైన స్టెప్పులు వేసి రికార్డులు బద్దలుకొట్టిన పాటకు తగిన న్యాయం చేయగలుగుతుందో! లేదో! అని అభిమానులు, క్రిటిక్స్ సందేహించారు.

అభిమానులు ఎప్పటికి మర్చిపోలేని మాధురి దీక్షిత్ "మోహిని"దుస్తులకు చిన్నపాటి మార్పులు చేసి ఈ పాటలో వేసుకుంది. 1987 నాటి ఒరిజినల్ పాటలోని పింక్, పసుపు మరియు నీలం రంగుల కాంబినేషన్ టూ-పీస్ దుస్తులను ధరించి సెగ పుట్టించింది.

ఆమె వేసుకున్న, బాగా డీప్ నెక్ ఉన్న బ్లౌజ్ మరియు తొడల పైకి స్లిట్ ఉన్న స్కర్ట్ 2018 ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా వేడి పెంచేటట్టుగా ఉంది. ప్రేక్షకులు ముద్దుగా జాకీ అని పిలుచుకునే ఆమె కూడా ఈ పాట టీజర్ ను షేర్ చేసింది. ఆ పాటను చూసిన ప్రతి ఒక్కరూ ఆమెకు అభిమానిగా మారక మానరు.

ఆ టీజర్ వీడియో ఇక్కడ మీ కోసం.టీజర్ చూసిన ప్రతిఒక్కరికి పూర్తి పాట చూడాలనే ఆరాటం ఎక్కువైంది.

Jacquelines Ek-Do-Teen Look OUT!

English summary

Jacqueline's Ek-Do-Teen Look OUT!

Jacqueline's Ek-Do-Teen Look OUT!,Bollywood hottie Jacqueline Fernandez revealed her look for the revamped version of Madhuri Dixit's iconic dance number Ek-Do-Teen, today, and Internet lost its collective minds.