తాజా తాజా: ప్రీ మెట్ గాలా 2018 బ్యాష్ లో క్యాజువల్ లుక్స్ లో దీపికా

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

ఈ ఏడాది మెట్ గాలాలో పాల్గొంటానని ప్రియాంకా చోప్రా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై దీపికా మౌనం పాటించింది. కాబట్టి, దీపికా ఫ్యాషన్ కి సంబంధించిన ఈ ప్రత్యేకమైన ఈవెంట్ కి ఈ ఏడాది డుమ్మా కొట్టే అవకాశాలున్నాయని అందరూ అనుకున్నారు.

అయితే, "పద్మావత్" స్టార్ అందరికీ సర్ప్రైజ్ ఇచ్చింది. అది కూడా మెట్ గాలా 2018కి కేవలం కొన్ని గంటల ముందు!

దీపికా ఈ ఈవెంట్ కి అటెండ్ అవడానికి సంసిద్ధంగా ఉంది. ప్రియాంకా చోప్రాతో కలిసి దీపికా ఈ ఈవెంట్ కి అటెండ్ అవడం మనందరి ఎక్సయిట్ మెంట్ ను మరొక లెవెల్ కి తీసుకెళ్లింది కదా!

just-in-deepika-all-casual-at-pre-met-gala-2018-bash

ప్రియాంకా తనకొచ్చిన ఇన్విటేషన్ ను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అయితే, దీపికా న్యూ యార్క్ లో జరిగిన ప్రీ మెట్ గాలా బ్యాష్ కు అటెండ్ అయి తన స్టైలిష్ అపియరెన్స్ తో ఈ ఈవెంట్ కు అటెండ్ అవుతున్న సంగతిని విభిన్నంగా బయటపెట్టింది.

ఈ ఈవెంట్ లో బ్లాక్ ట్యాంక్ టాప్ కి హై వెయిస్ట్ ఫ్లేర్డ్ జీన్స్ ను అలాగే లాంగ్ ఓవర్ కోట్ ను మ్యాచ్ చేసి స్టైలిష్ గా కనిపించింది. ఈ ఈవెంట్ లో సెలెబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ హ్యారీ జోష్ ను హగ్ చేసుకుని కెమెరాలకు స్టిల్స్ ఇచ్చింది ఈ బాలీవుడ్ సోయగం.

క్యాజ్యువల్ లుక్ లో రాక్ చేసింది. అయితే, ముఖ్యమైన ఘట్టానికి ఈ అమ్మడు ఏం ధరిస్తుందో క్లూ కూడా అందలేదు.

గతేడాది జరిగిన ఈవెంట్ లో దీపికా అత్యంత సుందరంగా కనిపించింది. అయితే, ఆమె డ్రెస్ మాత్రం ఈవెంట్ కి ఏ మాత్రం నప్పలేదు. టామీ హిల్ ఫిగర్ ఐవరీ శాటిన్ బ్యాక్ లెస్ గౌన్ ను ధరించింది ఈ భామ. ఫ్లోరల్ హెడ్ బ్యాండ్ తో పాటు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ను ధరించింది. అయితే, ఈ లుక్ ఏమాత్రం బాగాలేదన్నది అప్పటి టాక్.

just-in-deepika-all-casual-at-pre-met-gala-2018-bash

తన అవుట్ ఫిట్ వలన ఆమె అనేక ట్రాల్స్ ను ఎదుర్కోవలసి వచ్చింది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ యూజర్ మెల్విన్ ఫెంటీ పోస్ట్ అప్పట్లో సంచలనంగా మారింది. "మెట్ గాలా థీమ్ ఏంటి సెలెబ్రిటీస్ వేసుకున్న డ్రెస్ లేంటి" అని దీపికా ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.

ఈ పోస్ట్ ను రియానా అనే ప్రముఖ సింగర్ లైక్ చేయడం వలన ఈ పోస్ట్ అప్పట్లో పాపులర్ అయింది. టూ బ్యాడ్ కదా!

ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే, దీపికా ఇప్పటికి కంఫర్ట్ జోన్ నుంచి బయటకి వచ్చి ట్రాలర్స్ నోర్లు మూయించేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది.

మరి, దీపికా కు ఆల్ ది బెస్ట్ చెప్పేద్దామా!

బోల్డ్ స్కై కి ట్యూన్ అయి ఉండండి మెట్ గాలా 2018కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను తెలుసుకోండి.

English summary

Just In: Deepika All Casual At Pre-Met Gala 2018 Bash

Dippy is attending the Met Gala again along with Piggy Chops. And with this news she has doubled our excitement! Deepika announced her Met Gala attendance by making an appearance at the Pre-Met Gala bash, held in New York. She rocked the casual look but what she will be wearing at the main soiree, we are yet to see!