మణికర్ణిక లేటెస్ట్ లుక్ తో సంచలనం సృష్టిస్తున్న కంగనా రనౌత్

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky
Kangana Ranaut Latest Look From Manikarnika

'మణికర్ణిక' మూవీ సెట్స్ లో ఝాన్సీకి రాణీ అవతార్ లో రాయల్ లుక్ లో దర్శనమిచ్చిన కంగనా రనౌత్ లుక్ కి నెటిజన్లు బ్రహ్మరథం పడుతున్నారు.

మెరూన్ నీతా లుల్లా శారీలో మ్యాచింగ్ బ్లౌజ్ తో కనిపించింది కంగనా. ఈ శారీపై గోల్డెన్ బూటీ ప్రింట్స్ కలవు. బ్లౌజ్ పై గోల్డ్ జరీ ఎంబ్రాయిడరీ కలదు. ఈ శారీపై బంగారు ఆభరణాలను ధరించింది. చోకర్ అలాగే మల్టీ లేయర్డ్ నెక్లెస్, గుండ్రటి ఇయర్ స్టెడ్స్, గోల్డ్ మరియు గ్లాస్ బ్యాంగిల్స్ తో గోల్డ్ హెయిర్ యాక్ససరీని ధరించింది కంగనా.

మెరూన్ మరియు గోల్డ్ స్టయిల్ బుక్ తో పాటు తన జడలో మూడు ఎర్రగులాబీలను ధరించింది.

ఈ సినిమాకి చెందిన లుక్స్ ఇదివరకు విడుదలయ్యాయన్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై కాంట్రవర్సి కూడా నడుస్తోంది .

తాజాగా, రాణీ లక్ష్మీభాయ్ అవతార్ లో కంగనా అద్భుతంగా కనిపించి అభిమానులకు కనువిందు కలిగించింది.

Kangana Ranaut Latest Look From Manikarnika
Kangana Ranaut Latest Look From Manikarnika
Kangana Ranaut Latest Look From Manikarnika
Kangana Ranaut Latest Look From Manikarnika
English summary

Kangana Ranaut Latest Look From Manikarnika

The internet is going crazy about the recent upload from Manikarnika's sets where Kangana was seen in a royal 'Jhansi Ki Rani' avatar. Kangana was seen in a maroon Neeta Lulla saree with a matching blouse. The saree had golden buti prints all over the body, while the blouse also had gold zari embroidery. She matched the sari with gold jewellery.
Story first published: Monday, February 26, 2018, 16:30 [IST]