సంప్రదాయ-ఆధునిక శైలుల మేళవింపుతో మైమరపిస్తున్న మాధురి

Written By: Gayatri Devupalli
Subscribe to Boldsky
madhuri-dixit-upgraded-her-style-statement-for-an-event

మాధురి దీక్షిత్ ఇటీవల ముంబైలో రాయల్ ఒపేరా హౌస్ లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైంది. వస్త్రధారణలో ఆమె అనుసరించే వినూత్న శైలి చూపరుల మతి పోగొట్టింది.

నిత్య యవ్వనంతో మిస-మిసలాడే మధురి అందాన్ని ఆమె ధరించిన సముద్రపు అలల నీలి రంగు చీర ద్విగుణీకృతం చేసింది. చీరపై ఎంబ్రాయిడరీ చేయబడిన బెల్ స్లీవ్స్ ఓవర్-జాకెట్ ధరించిన ఆమె సమ్మోహనంగా ఉంది. ప్రస్తుతం చీరలపై ఓవర్-జాకెట్ వేసుకోవడం అనే ట్రెండ్ నడుస్తుంది. ఈ తరహా జాకెట్ ఫాషన్ ప్రియుల వార్డ్ రోబ్ లో ఖచ్చితంగా ఉండాల్సిందే!

ఎనభయ్యవ దశకంలో తన నట ప్రస్థానం మోదలుపెట్టిన మధురి, ఆరంభం నుండి ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కాలానుగుణంగా ఎప్పటికప్పుడు నూతన ఒరవడిని తన సొంతం చేసుకుంది. ఈ వస్త్రధారణతో తన సొగసును మరొక మెట్టు పైకెక్కించింది.

మీకు కూడా ఈ స్టయిల్ నచ్చిందా? మీరు ఈ స్టైల్ ను సొంతం చేసుకోవడానికి సిద్ధమా? ఐతే ఇంకెందుకు ఆలస్యం!

madhuri-dixit-upgraded-her-style-statement-for-an-event
madhuri-dixit-upgraded-her-style-statement-for-an-event
madhuri-dixit-upgraded-her-style-statement-for-an-event
madhuri-dixit-upgraded-her-style-statement-for-an-event
madhuri-dixit-upgraded-her-style-statement-for-an-event
madhuri-dixit-upgraded-her-style-statement-for-an-event
madhuri-dixit-upgraded-her-style-statement-for-an-event
madhuri-dixit-upgraded-her-style-statement-for-an-event
English summary

madhuri-dixit-upgraded-her-style-statement-for-an-event

Madhuri Dixit Nene attended an event at the Royal Opera House in Mumbai and her innovative style statement will blow your minds. The ever-beautiful actress wore an aqua blue saree with an over-jacket which had an embroidered body and bell sleeves.