For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సోనమ్ తన పెళ్లి వేడుకలలో ఏ స్టైల్ లో కనిపించబోతోందో తెలుసా?

|

ఆనంద్ అహుజాతో సోనమ్ కపూర్ వివాహం అంగరంగవైభవంగా జరగనుందన్న విషయాన్ని కపూర్ ఫ్యామిలీ స్పష్టం చేసింది. ఈ వేడుకకు కేవలం కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. కాబట్టి, ఏర్పాట్లన్నీ త్వరత్వరగా జరుగుతున్నాయి. వెడ్డింగ్ తో పాటు అందుకు సంబంధించిన ఫంక్షన్స్ కి సంబంధించిన ఏర్పాట్లు బాగానే జరుగుతున్నాయని తెలుస్తోంది.

సోనమ్ ఫ్యాషన్ ఐకాన్ గా పేరు పొందిన విషయం మనకి తెలిసిందే. వింటేజ్ ఎత్నిక్ అటైర్స్ నుంచి బ్రీజీ ట్రెడిషనల్ వేర్స్ ని వివిధ సందర్భాలలో ధరించింది సోనమ్.

Mehendi To Bidaai, How We Want Sonam To Look

కాబట్టి, తన జీవితంలోని ముఖ్యమైన రోజున సోనమ్ ఎటువంటి లుక్ లో కనిపించబోతుందో గెస్ చేయడం కష్టమే. కాబట్టి, ఆ రోజు ఫ్యాషన్ లో ని ప్రయోగాలతో మనల్ని ఆశ్చర్యపరుస్తుందా లేదంటే సేఫ్ గా ప్రయోగాల జోలికి వెళ్లకుండా ఉంటుందా? అన్న విషయం తెలియాలంటే వేచి చూడాలి.

ఏది ఏమైనా, సోనమ్ మాత్రం తన దుస్తుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే.

Mehendi To Bidaai, How We Want Sonam To Look

అయినా సోనమ్ తన స్టైల్ లో ఎలా ఆకట్టుకుంటుంది అన్న అంశం మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. అంతగా ఫ్యాషన్ తో అనుబంధాన్ని ఏర్పరచుకుంది సోనమ్. సందర్భానికి తగినట్టుగా ఫ్యాషన్ ని జోడిస్తూ తనకంటూ స్టైల్ ని ఏర్పరచుకున్న ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ లుక్ ని మనం ఈ అమ్మడి ఇంతకు ముందు లుక్స్ తో కంపేర్ చేసి ఒక అంచనాకి వద్దాం.

ఇక్కడ సోనమ్ కి చెందిన కొన్ని ఎత్నిక్ లుక్స్ ని మీ ముందుంచాము. తన ప్రీవియస్ అపియరెన్స్ ని మిక్స్ చేసి తన వెడ్డింగ్ డే నాడు మరింత ప్రత్యేకంగా కనిపించే అవకాశం కలదు.

Mehendi To Bidaai, How We Want Sonam To Look

మెహేందీ/సంగీత్ పార్టీలో

మెహేందీ రోజున ట్రెడిషనల్ కాంటెంపరరీ ఫ్యూషన్ వేర్ ను ధరించి సోనమ్ తన ఫన్ సైడ్ ని చూపిస్తుందని ఆశిస్తున్నాము. అనామికా ఖన్నా లేదా మాసబా కి చెందిన స్టైల్ ను ఈ సందర్భంగా అనుసరిస్తుందని ఊహించవచ్చు. మేకప్ కోసం సోనమ్ డ్యూయీ టచ్ కలిగిన పింక్ కు ప్రాధాన్యత ఇస్తే మరింత బాగుండవచ్చు. మినిమల్ జ్యువెలరీ లేదా అస్సలు జ్యువెలరీ లేకుండా తన లుక్ ని యాక్సెంట్యుయేట్ చేసుకుంటే బాగుంటుంది.

హల్దీ :

ఈ రోజు సోనమ్ జ్యువెలరీ లేకుండా ఉండవచ్చు. క్యాషుల్ లుక్ ని సైడ్ స్వెప్టు డ్రెస్ మరియు సబ్టిల్ మేకప్ తో క్యారీ చేయవచ్చు. మోడరన్ అట్టైర్ కి ట్రెడిషన్ ను జోడించి అందంగా కనిపించే అవకాశం ఉంది.

రిసెప్షన్ :

రిసెప్షన్ లో సోనమ్ రెండు ఎక్స్ట్రీమ్ లుక్స్ లో కనువిందు చేసే ఆస్కారం కలదు. ప్రిన్సెస్ వంటి ప్యాస్టాల్ షేడ్ గౌన్ లో షో స్టాపింగ్ అవతార్ తో ఫ్యాషన్ ఐకాన్ మరింత అద్భుతంగా కనిపించే అవకాశం కలదు. ఈ ఈవెంట్ కోసం స్మోకీ ఐ మేకప్ లో బోల్డ్ లిప్ షేడ్ ని జోడించి కాంటెంపరరీ జ్యువెలరీను మ్యాచ్ చేస్తే సోనమ్ లుక్ మరింత అద్భుతంగా ఉండే అవకాశం కలదు.

Mehendi To Bidaai, How We Want Sonam To Look

వెడ్డింగ్:

అబూ జానీ మరియు సందీప్ ఖోస్లార్ వారు డిసైన్ చేసిన అట్టైర్ ను సోనమ్ వివాహ వేడుకలో ధరించబోతుందని బాలీవుడ్ లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అనితా డోంగ్రే లేదా మనీష్ మల్హోత్రా లేదా సబ్యసాచి వారు డిసైన్ చేసిన వాటిని సోనమ్ ధరించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. లేదా మనం ఎక్స్పెక్ట్ చేయని డిసైనర్ కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది. డిసైనర్ డ్రెస్ కావచ్చు లేదా సారీ లేదా లెహంగా కావచ్చు, మార్చ్ 8 వరకు మన సస్పెన్స్ కొనసాగుతుంది.

స్టేట్మెంట్ జ్యువెలరీ పీస్ అనేది తన డ్రెస్ కున్న ఎఫెక్ట్ ను ఏ మాత్రం తగ్గించదు. కాబట్టి సోనమ్ తన వెడ్డింగ్ కు "లెస్ ఈజ్ మోర్" అనే కాన్సెప్ట్ ను అనుసరిస్తుందో లేదో చూడాలి.

ఈ వివాహ వేడుకలో సోనమ్ కచ్చితంగా వెడ్డింగ్ వేర్ ట్రెండ్స్ ను క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

English summary

Mehendi To Bidaai, How We Want Sonam To Look

It becomes very difficult to ascertain what look Sonam would be sporting on her D-Day. Will she play safe or push the boundaries? Speculation doesn't end here! We still have this nagging voice inside our head that says, "How is Sonam going to look?" So, we have handpicked our favourite Sonam-ethnic looks for her wedding day and other functions.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more