ఫిలింఫేర్ అవార్డ్స్ 2018 వేడుకలో రాకుమారిలా ప్రీతిజింటా

By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్ - 2018 కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. . ముంబయిలోని వర్లీలో తాజాగా జరిగిన వేడుకలకు బాలీవుడ్‌కు చెందిన అతిరథ మహారథులు హాజరై సందడి చేశారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌, దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌ వ్యాఖ్యాతలుగా వ్యవహరించి సందడి చేశారు.

ప్రీతిజింటా స్టైల్ డిఫరెంట్

ప్రీతిజింటా స్టైల్ డిఫరెంట్

ఈ కార్యక్రమంలో ప్రజాదరణ పొందిన చిత్రాలు, నటులు, ఇతర విభాగాలకు అవార్డులు అందజేశారు. ఈ వేడుకలో సెలెబ్రిటీల సందడి అందరినీ ఆకట్టుకుంది. బాలీవుడ్ సెలెబ్రిటీలు తమదైన స్టైల్ లో ఈ అవార్డు వేడుకకు విచ్చేశారు. వారందరిలో, బాలీవుడ్ నటి ప్రీతీ జింతా స్టైల్ చాలా డిఫరెంట్ స్టైల్ లో వేడుకకు వచ్చింది. రెడ్ కార్పెట్ పై తనదైన స్టైల్ లో సందడి చేసింది ప్రీతి జింతా.

రాకుమారిలా

రాకుమారిలా

అందమైన ఫ్లోరల్ లేస్ ఎంబ్రాయిడరీ కలిగిన పౌడర్ పింక్ టుల్లే గౌన్ వేసుకుంది. ఈ స్ట్రాప్లెస్ గవున్ లో తన ప్యాలస్ నుంచి ఈ అవార్డు ఫంక్షన్ కి విచ్చేసిన అందమైన రాకుమార్తెలా కనిపించింది ప్రీతీ జింతా. తన అట్టైర్ కి తగిన యాక్ససరీస్ ని ధరించి కుందనపు బొమ్మలా మెరిసింది. చాలాకాలం తరువాత, ప్రీతీ మళ్ళీ ఇంత స్టన్నింగ్ గా కనిపించిందని అంటున్నారు ఆమె అభిమానులు.

విద్యాబాలన్

విద్యాబాలన్

బెస్ట్ ఫీమేర్ యాక్టర్‌గా విద్యాబాలన్ అవార్డు అందుకున్నారు. 63వ జియో ఫిల్మ్‌ఫేర్ అవార్డు వేడుకలో ఆమెకు ఈ అవార్డును ప్రదానం చేశారు. ‘తుమ్హారీ సులు'లో నటనకు గాను విద్యాబాలన్‌కు బెస్ట్ ఫీమేల్ యాక్టర్ అవార్డు వరించింది.

 షారూక్ ఖాన్

షారూక్ ఖాన్

ఈ అవార్డు వేడుకకు బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా రేఖ అవార్డును అందజేశారు. ‘బద్రీనాథ్‌కి దుల్హానియా'లో బెస్ట్ లీడింగ్ రోల్ చేసినందుకు అలియాభట్‌కూ, ‘మామ్' సినిమాలో నటనకుగాను శ్రీదేవికి ఈ అవార్డు దక్కింది. ఇంకా భూమి పెడ్నేకర్ (శుభ్ మంగళ్ సావ్‌ధాన్), సబా ఖమర్ (హిందీ మీడియం), జైరా వాసిమ్ (సీక్రెట్ సూపర్ స్టార్)లు కూడా ఎంపిక అయ్యారు.

English summary

Preity Zinta At The Filmfare Awards 2018

Preity Zinta At The Filmfare Awards 2018
Story first published: Monday, January 22, 2018, 12:00 [IST]
Subscribe Newsletter