ప్రియా ప్రకాష్ వారియర్ ఈ ప్రారంభోత్సవ వేడుకలో ఎర్రటి దుస్తుల్లో ఎంత అందంగా ఉందొ తెలిస్తే మతిపోతుంది

Written By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky
Priya Prakash Varrier At A Flower Show

మళయాళ నటి అయిన ప్రియా ప్రకాష్ వారియర్ ని, ఇప్పుడు ' దేశం ప్రేమిస్తున్న' అమ్మాయిగా కూడా పిలుస్తున్నారు. ఈమె ఈరోజు ఒక వేడుకలో పాల్గొనటానికి హైదరాబాద్ కి వచ్చింది.

దేశం మొత్తాన్ని తన హావభావాలతో ఒక ఊపు ఊపేసిన యువ అమ్మాయి అంతర్జాలంలో ఒక పెను సంచలనంగా మారింది. ఒక పూల ప్రదర్శనను ప్రారంభించడానికి వచ్చిన ఈ అమ్మాయి, ఒక అందమైన పువ్వులా అలంకరించుకొని వచ్చింది. ప్రియా ఎర్రటి అందమైన దుస్తులను ధరించింది. అంతేకాకుండా తక్కువ మేకప్ వేసుకొని, ఆ కురులను అలా వదిలేసింది. ఈ వేడుకలో కూడా ఎంతో అందంగా కనపడింది మరియు ఆమె వ్యవహరించే శైలిలో ఉండే నిరాడంబరత చూసే వారందరిని కట్టిపడేసింది.

ఈ యువ కాలేజీ అమ్మాయి చూడటానికి 'పక్కింటి అమ్మాయి' ల కనపడుతుంది. ఈమె ఒక్క రాత్రి లోనే దేశం మొత్తంలో కొన్ని లక్షల హృదయాలను గెలుచుకొంది. ఇంత తక్కువ సమయంలో ఎవ్వరుగాని ఇంత ప్రజాధారణ సంపాదించలేదు. ఈ విషయంలో అన్ని రికార్డులను చెరిపేసింది.

Priya Prakash Varrier At A Flower Show

ఈ వారం ప్రారంభంలో, ఈ అమ్మాయి సామజిక మాధ్యమాల్లో ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించిపెనుసంచలనం గా మారింది. ఇంస్టాగ్రామ్ లో ఈమెను అనుసరించే వారి సంఖ్య క్షణాల్లో విపరీతంగా పెరిగిపోయింది.

వేడుకలో కూడా మతిపోయే విధంగా ఈ అమ్మాయి ఎంతో అందంగా కనపడింది. అమాయకత్వంతో పాటు, మెరుపులాంటి చిరునవ్వుతో అందరి మనస్సులను దోచేసింది.

నటిగా కంటే కూడా, అంతర్జాలంలో సంచలనంగా మారడంతోనే ప్రియా ఒక పెద్ద సెలబ్రిటీ అయిపొయింది. గూగుల్ ల్లో సెలెబ్రిటీల కోసం వెతికే సంఖ్యలను చాలా వాటిని ప్రియ దాటేసింది. ప్రస్తుతం ఈమె "ఓరు ఆడార్ లవ్" అనే మలయాళ చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రంలోని పాటలో, ఈమె నటించిన ఒక చిన్న వీడియో సామజిక మాధ్యమాల్లో పెనుసంచలనంగా మారింది. ఈమెను రాత్రికి రాత్రే సెలబ్రిటీ ని చేసింది. అందులో ఈమె హావభావాలు అందరికి నచ్చడంతో అంతర్జాలంలో అది వైరల్ గా మారింది.

ఇంత మంది దృష్టిని ఆకర్శించడంతో, ఈమె అభిమానులు ఈమెకు ' దేశం ప్రేమించే అమ్మాయి' గా పేరుపెట్టారు.

Priya Prakash Varrier At A Flower Show
Priya Prakash Varrier At A Flower Show
Priya Prakash Varrier At A Flower Show
Priya Prakash Varrier At A Flower Show
Priya Prakash Varrier At A Flower Show
Priya Prakash Varrier At A Flower Show
English summary

Priya Prakash Varrier At A Flower Show

Malayalam actress Priya Prakash Varrier, aka the 'National Crush' was first spotted at a public event this morning in Hyderabad. The young girl who has taken over the internet by power attended a flower show, dressed up like a bright flower herself. At the event, she was looking very adorable, especially with the innocent and charming smile.