ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాషనిస్ట్ లు ప్రియాంకా చోప్రా గౌన్ కు ఫిదా అయిపోయారు...!!

Posted By:
Subscribe to Boldsky

ఫ్యాషన్ కు కేరాఫ్ అడ్రస్ గా ఉండే మెట్ గాలా - 2017 న్యూయార్క్ సిటిలో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు హాలీవుడ్‌ నటీమణులు, ఫ్యాషన్‌ డిజైనర్లు హాజరయ్యారు. కళ్లు చెదిరే అందమైన పొడవాటి గౌన్లు ధరించి ఎర్రతివాచీపై నడిచి అందరి దృష్టిని ఆకర్షించారు. మెట్రోపాలిటన్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్స్‌ వారి కాస్ట్యూమ్‌ ఇన్‌స్టిట్యూట్‌కోసం విరాళాలు సేకరించడానికి ప్రతి సంవత్సరం ఈ ఈవెంటన్ ను ఏర్పాటు చేస్తారు.

దీనికి ఉన్న మరో పేరు కాస్ట్యూమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ గాలా. కాస్ట్యూమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ వార్షిక ఎగ్జిబిషన్‌ను సోమవారం ప్రారంభించారు. ఏటా ప్రత్యేకమైన థీమ్‌తో ఏర్పాటు చేసే ఈ గాలాకి పలువురు సెలబ్రిటీలు హాజరవుతారు.

రెడ్ కార్పెట్ పై హాలీవుడ్ భామలు హొయలు పోయారు. డిజైనర్ డ్రెస్సులతో చూపరులను కట్టిపడేశారు. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్... మతులు పోగొట్టే ఒంపు సొంపులతో... పిచ్చెక్కించేశారు. ఈ ఈవెంట్ లో దేశీ గ‌ర్ల్ ప్రియాంకా చోప్రా వెరైటీ గౌన్‌తో మెట్ గాలా రెడ్ కార్పెట్‌ను ఓ ఊపు ఊపేసింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఫ్యాషనిస్ట్‌లు ఆమె గౌన్‌కు థ‌మ్సప్ చెప్పారు.

Priyanka Walks The Red Carpet At Met Gala Awards 2017; Floors People With Her Ralph Lauren Outfit

ప్రియాంకా చోప్రా మ‌ళ్లీ త‌ళుక్కుమ‌న్న‌ది. వెరైటీ డ్రెస్సులో హీటెక్కించింది. బాల్‌గౌన్ కోట్‌లో హాట్ బేబీలా ద‌ర్శ‌న‌మిచ్చింది. న్యూయార్క్‌లో జ‌రిగిన మెట్ గాలా ఈవెంట్‌లో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా ట్రెంచ్ కోట్ డ్రెస్సులో మెరిసిపోయింది.

మెట్‌గాలా కాస్ట్యూమ్ ఇన్స్‌టిట్యూట్ ప్ర‌తి ఏడాది ఈ షో నిర్వ‌హిస్తున్న‌ది. ఆ షోలో జరిగే రెడ్ కార్పెట్ లో పాల్గోనేందుకు మేటి మోడ‌ల్స్ వ‌స్తారు. ఈ సారి ప్రియాంకా అక్క‌డ భారీ గౌన్‌తో బ్యూటీఫుల్ గా కనిపించింది. రాల్ఫ్ లారెన్ డిజైన్ చేసిన కోట్ స్ట‌యిల్ బాల్‌గౌన్‌లో ప్రియాంకా త‌న అందాల‌ను ప్ర‌దర్శించింది. అతి పెద్ద కాలర్ కలిగిన నెక్ లైన్ షోల్డర్స్ హైలైట్ చేస్తూ రెడ్ కార్పెట్ పై క్వీన్ లా ప్రదర్శించింది.

అత్యద్భుతగా డిజైన్ చేసిన ఈ గౌన్ షేప్ లో కలిగిన కోట్ మీద బ్లాక్ బటన్స్ , నడుము వద్ద బెల్ట్ టైప్ లో ఫిట్ గా స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించింది. ఈ డ్రెస్ ను డిజైన్ చేసిన వ్యక్తి చాలా క్లాస్ గా డిజైన్ చేశారు.. ఈ గౌన్ వేసుకొని రావ‌డానికి ప్రియాంకా కూడా చాలానే క‌ష్ట‌ప‌డింది.

Priyanka Walks The Red Carpet At Met Gala Awards 2017; Floors People With Her Ralph Lauren Outfit

అంత‌టి గౌన్‌ను ఒంటిపై మోసుకురావ‌డానికి ఇబ్బంది ప‌డింది. ఓ ప్ర‌త్యేక వాహ‌నంలో రావాల్సి వ‌చ్చింది. అంతేకాదు మెట్లు ఎక్క‌డానికి కూడా మ‌రొక‌రు సాయం చేయాల్సి వ‌చ్చింది. ఇంత పెద్ద గౌన్ ఈవెంట్ మొత్తం హైలైట్ చేసింది 'సూపర్ గౌన్ '' ప్రశంసలు కూడా అందుకుంది. ఇంకా ఈ క్లాసిక్ సూపర్ గౌన్ కు బ్లాక్ కలర్ ప్లాట్ ఫార్మ్ బూట్స్ మరింత అదనపు గ్లామర్ ను జోడించింది. ఈ లెదర్ బూట్స్ ఫ్లాట్ ఫార్మ్ హీల్, జిమ్ తో చాలా అందంగా ఉన్నాయి.

హెయిర్ స్టైల్ చాలా సింపుల్ గా పైకి టైట్ గా బన్ వేసి, నెక్ లైన్ మీద ఎక్కువ ఫోకస్ చేసే విధంగా జాగ్రత్తలు తీసుకుంది. హై రైస్ కాలర్ తో హెయిర్ బన్ వల్ల నెక్ మరింత పొడవుగా మరియు ఫరెక్ట్ ఫిగర్ తో కనబడేలా చేసింది.

ఈ గౌన్ కు తగిన విధంగానే ఎక్కువ యాక్సెసరీస్ (ఆభరణాలు)లేకుండా, మినిమమ్ యాక్సెసెరీస్ తో సిల్వర్ రింగ్ ఫర్ఫెక్ట్ అవుట్ ఫిట్ తో సింపుల్ గా అట్రాక్టివ్ గా తయారైంది. అయితే ఆమె వేసుకున్న డ్రెస్ మాత్రం చూసి, అద్భుతంగా ఉందంటూనే నెటిజ‌న్లు ఫ‌న్నీ ట్వీట్ల‌తో పండ‌గ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ట్విట్టర్ లో ప్రియాంకా గౌనే ట్రెండింగ్ అవుతున్నది.

Priyanka Walks The Red Carpet At Met Gala Awards 2017; Floors People With Her Ralph Lauren Outfit

ఆమె కోట్ ఎంత పొడుగ్గా ఉందంటే, వెన‌క భాగంలో దాన్ని ఒక‌రు ప‌ట్టుకువెళ్లాల్సిందే. ప్ర‌స్తుతం అమెరికా టీవీ సీరియ‌ల్ క్వాంటికోలో ప్రియాంకా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. గ్లామ‌ర్ గాళ్ ప్రియాంక‌కు ఇప్పుడు అమెరికాలో ఫుల్ క్రేజీ వ‌చ్చేసింది. జెన్నిఫ‌ర్ లోపేజ్‌, స‌ల్మా హ‌య‌క్‌, సెరీనా విలియ‌మ్స్ లాంటి సెల‌బ్రిటీలు కూడా మెట్‌గాలాలో పాల్గోన్నారు. సింగ‌ర్ క‌మ్ సాంగ్ రైట‌ర్ నిక్ జోనాస్‌తో ప్రియాంకా ఫోటోల‌కు ఫోజులు కూడా ఇచ్చింది. బాలీవుడ్ భామ న‌టించిన హాలీవుడ్ మూవీ బేవాచ్ జూన్ 2న రిలీజ్ కానున్న‌ది.

English summary

Priyanka Walks The Red Carpet At Met Gala Awards 2017; Floors People With Her Ralph Lauren Outfit

Priyanka Walks The Red Carpet At Met Gala Awards 2017; Floors People With Her Ralph Lauren Outfit,
Story first published: Tuesday, May 2, 2017, 14:42 [IST]
Subscribe Newsletter