For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రియాంక చోప్రా తాజా మ్యాగజైన్ షూట్ లో అంతులేని అద్భుతమైన సంబరమాశ్చర్యాన్ని కలిగించింది

By R Vishnu Vardhan Reddy
|

వియాత్నం దేశానికి చెందిన హార్పర్ బజార్ ఫిబ్రవరి 18 సంచిక పై ప్రియాంక చోప్రా తన అందాలతో తళుక్కున మెరిసింది మరియు ఆమె యొక్క బాహ్య సౌందర్యాన్ని చూస్తే ఎవ్వరు కానీ కళ్ళు తిప్పుకోలేరు. ఆ మ్యాగజైన్ లో ఆమె యొక్క అందం ఎంతో మంది మదిని దోస్తోంది. శృంగార భరితంగా కనపడుతూ, అదే సమయంలో ఎంతో ఆకర్షణీయంగా సమ్మోహన పరుస్తూ అందరి మతి పోగొడుతుంది.

ఈ సంచికలో కవర్ స్టోరీ పై కనపడటానికి జోహార్ మురాద్, గాలియా లాహివ్, మార్చేసా, వాలెంటైన్స్ వాన్ న్గుయెన్ మరియు క్రిస్టయిన్ సిరియానో వంటి ప్రముఖులు రూపొందించిన దుస్తులను ధరించింది.

కవర్ లుక్ కోసం :

కవర్ లుక్ కోసం :

కవర్ పేజీలో కనపడటానికి ప్రియాంక చోప్రా శరీరం పై ఎండిపోయిన రోజా పువ్వు రేకులను అలంకరించుకొని ముగ్దమనోహరంగా కనపడుతూ ఒకింత విభిన్నమైన హాస్యచతురతతో కూడిన దుస్తులను ధరించింది. నల్లటి లెథర్ టోపీ, మెరిసే చెవి రింగులు మరియు లోహంతో చేసిన హీల్స్ ని ధరించింది. ఆమె వేసుకున్న దుస్తులు అద్భుతంగా మరియు ప్రత్యేకంగా ఉన్నాయి. కానీ, ప్రియాంక చోప్రా ధరించడం తో వాటికి మరింత అందం వచ్చినట్లు అయ్యింది.

" మీరు నా వాలెంటైన్ గా ఉంటారా ? "

ప్రియాంక చోప్రా ఒక మ్యాగజైన్ షూట్ కోసం ఇచ్చిన ఈ శృంగారభరితమైన చిత్రాన్ని, తన సామజిక మాధ్యమాల ఖాతాలో షేర్ చేసింది. అలా షేర్ చేస్తూ ఏమని రాసుకొచ్చిందంటే " మీరు నా వాలెంటైన్ గా ఉంటారా ? " అని అడిగింది. ఆమె వేసుకున్న ఎర్రటి దుస్తులు మెడ భాగంలో మరీ లోతుగా ఉన్నాయి. ఒక థ్రెడ్ చోకర్ ని ధరించి మరియు కొన్ని ఉంగరాలు వేళ్ళకు పెట్టుకొని ఉంది ప్రియాంక చోప్రా. ఇలా ప్రియాంక చోప్రాని గనుక చూస్తే ఎవ్వరైనా ప్రేమలో పడిపోతారు. మీకు కూడా అలాంటిటి భావనే కలుగుతోందా ?

విభిన్నమైన బొమ్మలాగా :

విభిన్నమైన బొమ్మలాగా :

ఒక మ్యాగజిన్ షూట్ కోసం అద్భుతమైన క్రిమ్సన్ తుళ్ళే గౌనిని ధరించింది ప్రియాంక చోప్రా. ఆ సమయంలో ఆమె ప్రతిస్పందనలు చూస్తే ఖచ్చితంగా ఎవ్వరికైనా నోట మాట రాదు. ఒక మెరూన్ టోపీ ని మరియు లోహంతో చేసిన థ్రెడ్ చోకర్స్ ఉపయోగించి ఆ గౌనిని ధరించింది. లేత గోధుమ రంగు హీల్స్ కు కడియంని అంటించిన ఒక జత హీల్స్ ని ఆమె ధరించింది.

పూలరాణి :

పూలరాణి :

ఆమె యొక్క అందమైన శరీరాకృతిని వర్ణించాలన్నా, ఒక్క మాటలో చెప్పాలన్నా అందుకు ఈ పదం అయితేనే అతికినట్లు సరిపోతుంది. పూలతో చేయబడిన బ్యాక్లెస్ గౌనుని ధరించి అద్భుతమైన మరియు అమోఘమైన అందంతో మెరిసిపోయింది ప్రియాంక చోప్రా. గౌనుతో పాటు అలంకరింపబడ్డ లేతగోధుమ రంగు పంప్ హీల్స్ ని కూడా ధరించింది.

అచ్చం కళాకారుడి లా :

అచ్చం కళాకారుడి లా :

ఒక అద్భుతమైన చిత్రలేఖనం చుస్తున్నామా అనే విధంగా ఈ ప్రత్యేకంగా ఏర్పరచిన భుజాల వరకు ఉన్న రూఫ్ఫ్లే డ్రెస్ ని వేసుకున్న ప్రియాంకను చుసిన తర్వాత మదిలో మెదిలే ఆలోచన ఇదే. ఎడమ భుజం పై నుండి ఆలా జాలువారేలా ఉన్న రూఫ్ల్స్ ఆమె అందానికి మరింత అందాన్ని తెచ్చాయి. ఆ యొక్క గౌను పై పూలను అందంగా అపురూపంగా చేతితో పెయింటింగ్ వేయడం జరిగింది. ఇది చూడటానికి ఎంతో చూడముచ్చటగా ఉంది. ఆ గౌను పై మొత్తం చేతితో అందంగా పూలను వేయడం జరిగింది. దీంతో ఆ గౌనుకి మరింత అందం వచ్చింది. వీటితో పాటు ఆమె మెరిసిపోయే చెవి రింగులను కూడా ధరించింది.

పసుపుపచ్చ అందగత్తె :

పసుపుపచ్చ అందగత్తె :

అంతరిక్ష అందం ఏమైనా భువికి వచ్చిందా అనేలా ఈ పసుపుపచ్చ రూఫ్ఫ్లే గౌనిని ధరించిన ప్రియాంకను చూస్తే కలిగే మొట్టమొదటి భావన. అసమానరీతిలో ఉన్న ఈ యొక్క దుస్తులు చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. దేనికి తోడు నడుము భాగంలో నిర్మాణం ఎంతో వైవిధ్యంగా ఉంది. ఈ అందమైన దుస్తులను ప్రియాంక లాంటి అందగత్తె ధరించడంతో శృంగార తత్వం ఉట్టిపడింది.

 సాధారణంగా మెరిసేతత్వం :

సాధారణంగా మెరిసేతత్వం :

ప్రియాంక వేసుకున్న ఈ దుస్తులు మరీ అంత ప్రత్యేకంగా ఏమి కనపడటం లేదు. అందుకు కారణం ఇలాంటి మెరిసే దుస్తులను ఎంతోమంది సెలెబ్రిటీలు సాధారణంగా వేసుకుంటుంటారు. కానీ, ప్రపంచంలోనే ఫ్యాషన్ కు చిరునామాగా మారిన ప్రియాంకకు, సాధారణమైన దుస్తులను కూడా అద్భుతంగా శృంగార భరితంగా ఎలా మలుచుకోవాలి, అందంగా ఎలా ధరించాలో తెలుసు. ఈ దుస్తుల విషయంలో కూడా ప్రియాంక చోప్రా అలానే ధరించి, అందర్నీ చూపు తిప్పుకోనివ్వకుండా కట్టిపడేసింది.

English summary

Priyanka Chopra In Harpers Bazaar Vietnam

Priyanka Chopra got featured in Harper Bazaar Vietnam's February 2018 issue and we simple cannot take our eyes off this eternal slayer. All the shared looks from the magazine are simply taking us off the grounds, as the sexier they are, equally charming is what they appear.
Story first published: Tuesday, February 27, 2018, 12:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more