Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
ట్రెండ్ సెట్టర్ ప్రియాంకా చోప్రా సరికొత్త ఫోటో షూట్
ట్రెండ్ సెట్టర్ ప్రియాంకా చోప్రా సరికొత్త ఫోటో షూట్

వారాంతాన్ని ఖచ్చితంగా ఎలా ముగించాలో తెలిసిన స్టార్ సెలెబ్రిటీ ప్రియాంకా చోప్రా అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఈసారి, ఆ ముగింపు మరింత అద్భుతంగా ఉందనే చెప్పవచ్చు. ఒక్క ఫోటో షూట్తో ప్రపంచాన్నే తనవైపుకు తిప్పేసుకోగల భిన్నమైన సెలెబ్రిటీగా “పీసీ” కి పేరుంది. పీసీ ఫోటో షూట్లను రెగ్యులర్ ఫాలో అయ్యేవారు, తరువాత ఎటువంటి దుస్తుల్లో అలరిస్తుందా అని మరింత ఆసక్తిగా ఎదురుచూసేలా పీసీ ఫోటో షూట్లు ఉంటాయి అంటే అతిశయోక్తి కాదు. ప్రపంచ ఫాషన్ పోకడలను అన్నింటినీ తన ఫోటో షూట్ ద్వారా అందరికీ పరిచయం చేసేలా పీసీ ఫోటో షూట్స్ ఉంటాయి. ఎక్స్ప్రెషన్స్, స్టైల్, మేకప్, డ్రెస్సింగ్, ఆభరణాలు ప్రతి అంశంలోనూ భిన్న సారూప్యతలను ప్రదర్శించగల సెలెబ్రిటీగా ప్రపంచానికి సుపరిచితం ప్రియాంకా చోప్రా.

మొదటి ఫోటోలో, భిన్నమైన స్లీవ్స్ కలిగిన హాఫ్ షౌల్డర్ ఎరుపు రంగు నిర్మాణాత్మకమైన దుస్తులు ధరించి, సెన్సిబుల్ స్మోకింగ్ హాట్ లుక్ పోజ్ ఇచ్చింది. ఇక ఆమె రెండవ ఫోటోలో, ఘనమైన తెల్లటీ ఫ్లవరీ స్టైల్ పట్టీని ధరించినట్లు కనిపిస్తుంది, ఇది హాఫ్-షౌల్డర్ రఫ్ల్డ్ లుక్ కలిగి భిన్నంగా కనిపిస్తుంది. ఇది ఒక అద్భుతమైన మేఘాల వంటి నిర్మాణాన్ని తలపిస్తుంది అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు.

నలుపు రంగు లెదర్ షార్ట్ ధరించి, నీలంరంగు జూలు వలె కనిపిస్తున్న పర్పుల్-హ్యూటెడ్ బూట్స్ ధరించి సరికొత్త ఫాషన్ పోకడలను పరిచయం చేసేలా ఉన్న పీసీ ధరించిన దుస్తులు ఆమెకు వినూత్నమైన అబ్స్ట్రాక్ట్ టచ్ తీసుకుని వచ్చింది అని చెప్పవచ్చు.
ఇక మూడవ ఫోటో కిందకు వస్తే, పూర్తిగా నలుపు రంగుతో నిండిపోయేలా ఉన్న వస్త్రధారణతో, సెక్సీ హాట్ పోజుతో కుర్చీలో స్టైల్ గా కూర్చుని కనిపిస్తూ ఉంది. ఏదో ఘనకార్యం సాధించిన విజయ గర్వం కళ్ళల్లో ప్రస్పుటించేలా ఇచ్చిన ఆ పోజ్ రియల్లీ అల్టిమేట్. పూర్తి ముదురు నల్ల-రంగు షీర్-ఫాబ్రిక్ దుస్తులు ధరించి, అద్భుతంగా కనిపిస్తూ ఉంది. బాస్ లేడీ వైబ్స్ వలె ఉండే నల్లటి బూట్లు ఆమె రూపాన్ని మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేయడంలో ఎంతగానో సహాయపడింది.

చివరగా, పీసీ తన సాధారణ రూపంలో కూడా ఒక అందమైన కలలా అద్భుతంగా ఉంది. బెలూన్-వంటి స్లీవ్స్ మరియు సరిపోలే ప్యాంటుతో కూడిన, వదులైన యాంటీ-ఫిట్ టాప్ ధరించి, సిల్హౌట్ పద్ధతులకు విరుద్ధంగా హాట్ సెక్సీ పోజ్లో దర్శనమిస్తూ ఉంది.
ప్రియాంకాచోప్రా, ఫోటోషూట్ రిఫ్రెష్ లుక్ జోడించిట్లు అద్బుతమైన మనోభావాలను ప్రతిబింబిస్తుంది. పీసీ దుస్తులు అందంగా ఉండడమే కాకుండా, ప్రత్యేకమైన వ్యక్తిత్వ పోకడలను కూడా ప్రతిబింబించేలా కనిపిస్తుంది అనడంలో ఎమాత్రం ఆశ్చర్యం లేదు.
ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, జీవన శైలి తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.



Click it and Unblock the Notifications