ఫిలింఫేర్ అవార్డ్స్ లో రకుల్ ప్రీత్ రెడ్ కార్పెట్ గౌన్

Subscribe to Boldsky

65వ జియో ఫిలింఫేర్ పురస్కారాలలో రకుల్ ప్రీత్ సింగ్ పై అందరి దృష్టి పడింది. దక్షిణ భారతదేశపు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రాచుర్యం పొందిన నటి రకుల్ ప్రీత్ సింగ్., రకుల్ ప్రీత్ సింగ్ తన వస్త్ర ధారణలో నూతన పోకడలు కనిపించేలా ఫాషన్ గేం ఆడుతుంటుంది. ఈసారి మరింత ఆధునీకరణను జోడించి అందరి దృష్టిని తనవైపుకు మరల్చుకునేలా చేయగలిగింది. చిత్ర పరిశ్రమలోనే అతిపెద్ద అవార్డు ఉత్సవం అయిన ఫిలింఫేర్ అవార్డ్స్ ఫంక్షన్లో మరింత గ్రేస్ లుక్ జోడించి అందరి మన్ననలు అందుకుంది.

అల్పనా నీరజ్ రూపొందించిన దుస్తులలో కనిపించి అందరి తలలూ ఒక్కసారిగా తన వైపు తిప్పుకునేలా చేయగలిగింది రకుల్ ప్రీత్. రాయల్ బ్లూ రంగులో, ఫ్లోర్ – లెంగ్త్ స్టైల్ జోడించి, శరీరాన్ని బిగుతుగా పట్టినట్లుగా ఉన్న ఈ దుస్తులలో ఆత్మవిశ్వాసoతో కనిపించింది.

Rakulpreet’s Red Carpet Gown At Filmfare Awards Is Perfection

లోతైన V-నెక్ కలిగిన ఈ స్లీవ్ లెస్ వస్త్రధారణలో రకుల్ సెక్సీగా కనిపించింది. ఆమె గౌను ఎ-లెవల్లో ఎక్కువ పొడవుగా ఉన్నా కూడా, ఒక సెన్సేషన్ క్రియేట్ చేసేలా నూతన స్థాయికి తీసుకుని వెళ్ళింది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మాకు కూడా ఆమె V- నెక్ ను అలంకరించిన బ్లాక్ రఫెల్స్ స్టైల్ చాలా నచ్చింది. మరియు ఆమె ధరించిన మెటాలిక్ బెల్ట్ ఆమె దుస్తులను ఒక చక్కటి నిర్మాణాన్ని ఇచ్చింది. ఎంతైనా రకుల్ ఫాషన్ ఐకాన్ అని మరోసారి రుజువు చేసుకుంది.

రకుల్ ప్రీత్ సింగ్ పెద్దగా ఆభరణాలకు ప్రాముఖ్యతను ఇవ్వలేదు కానీ, ధరించిన ఆక్వామెరీన్ చెవి రింగులు, స్టేట్మెంట్ రింగ్ దుస్తులకు ఒక పరిపూర్ణతను తీసుకుని వచ్చాయి. ఏ దుస్తులకైనా ఆభరణాలు కూడా నప్పేలా ఉండాలి. ఈ విషయంలో రకుల్ ఎంతో జాగ్రత్తను తీసుకుందనే చెప్పాలి. మృదువైన బ్లాక్ కాజల్ మరియు సహజ పింక్ లిప్ షేడ్ తో ఆమె అలంకరణ అత్యంత సహజంగా ఉంది. హెయిర్ స్టైల్ విషయానికి వస్తే, మిడిల్ పార్టెడ్ లుక్ జోడించి, వదులుగా దుస్తులకు నప్పేలా లూస్ హెయిర్ స్టైల్లో కనిపించింది.

ఈ దుస్తులలో రకుల్ ప్రీత్ మీకెలా అనిపించింది. క్రింది వ్యాఖ్యల విభాగంలో మీ అభిప్రాయాలను తెలుపండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఫాషన్ సంబంధిత వివరాలకై బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Rakulpreet’s Red Carpet Gown At Filmfare Awards Is Perfection

    Rakulpreet’s Red Carpet Gown At Filmfare Awards Is Perfection,Rakulpreet was a vision at the 65th Jio Filmfare Awards. A very popular actress of the South Indian film industry, Rakulpreet's fashion game is always brilliant and this time she was at the top of her game. The actress had the mercury rising as she graced th
    Story first published: Wednesday, June 20, 2018, 19:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more