గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో హొయ‌లొలికించిన‌ హాలీవుడ్ తార‌లు

Posted By: sujeeth kumar
Subscribe to Boldsky

75వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్ర‌దానోత్స‌వం ఇటీవ‌ల కాలిఫోర్నియాలోని బెవ‌ర్లీ హిల్స్‌లో ఉన్న బెవ‌ర్లీ హిల్ట‌న్‌లో అంగ‌రంగ వైభవంగా జ‌రిగింది. ప్ర‌పంచంలోని గ్లామ‌ర్ తారలంతా ఈ వేడుక‌కు విచ్చేసి ప‌లువురిని ఆక‌ర్షించ‌డం విశేషం. ముఖ్యంగా హాలీవుడ్ తారల త‌మదైన స్టైల్‌తో ప్ర‌త్యేక ముద్ర వేశారు.

ఈవెంట్‌లో న‌లుపు రంగు దుస్తులు హైలైట్‌గా నిలిచాయి. ఇందులోనూ వెరైటీ ట్రెండీ స్టైళ్ల‌ను ధ‌రించ‌డం సెల‌బ్రిటీల‌కే సాటిగా నిలిచింది. ఒక్కొక్క‌రూ ఎలా ముస్తాబై హొయ‌లొ పోయిందీ ఇప్పుడు చూద్దాం...

డ‌కోటా జాన్స‌న్‌

డ‌కోటా జాన్స‌న్‌

హాలీవుడ్ సెల‌బ్రిటీల‌లో డ‌కోటా జాన్స‌న్ కు ఎప్పుడూ ముందు స్థాన‌మే ఉంటుంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2018లోనూ ఈ తార న‌లుపు గ‌వునులో త‌ళుక్కున మెరిసింది. గూచీ సంస్థ రూపొందించిన ఈ గౌను సెక్విన్ లేయ‌ర్‌తో, అంద‌మైన క్రిస్ట‌ల్స్ క‌ల‌గలిసి ఉంది. ఆమె డైమండ్ చెవి రింగులు, గాజులు ఆక‌ర్ష‌ణీయంగా, ప్ర‌కాశ‌వంతంగా క‌నిపించాయి.

మార్గ‌ట్ రాబీ

మార్గ‌ట్ రాబీ

గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేదిక‌పై మార్గ‌ట్ రాబీ త‌న‌దైన శైలిలో ప్ర‌త్యేక ముద్ర వేసింది. గూచీ సంస్థ రూపొందించిన క్లాసీ, హాట్ బ్లాక్ క‌ల‌ర్ గౌను లో వెర్రెత్తించింది. పువ్వుల‌తో ఎంబ్రాయిడ‌రీతో సీక్వెన్ ప్రింట్‌తో ఉన్న గౌనుకు లోతైన నెక్‌లైన్ వ‌చ్చి మ‌రింత అందాన్ని తెచ్చింది. మంచి క్లాసీ లుక్‌తో పాటు హాట్‌గాను క‌నిపించేలా చేసింది.

యాంజెలీనా జోలి

యాంజెలీనా జోలి

వెర్సేస్ సంస్థ రూపొందించిన గౌనులో యాంజెలీనా జోలి బాగా క‌నిపించింది. ఆమె ఇంకా బాగా క‌నిపిస్తుంద‌ని ఆశించారు అభిమానులు. అప్ప‌టికి గౌను చివ‌ర్లో వేలాడిన ఫ్రిల్స్ కాస్తంత ఆక‌ర్ష‌ణ‌గా క‌నిపించాయి. గౌనుకు మ్యాచింగ్ ఇయ‌ర్ రింగ్స్ ధ‌రించింది.

హ్యాలీ బెర్రీ

హ్యాలీ బెర్రీ

హ్యాలీ బెర్రీ ప్ర‌ఖ్యాత ఆస్కార్ విజేత‌ల్లో ఒక‌రు. ఆమె స్టైల్ ఐకాన్‌గా ఎదిగిపోతుంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుక‌లోనూ ఆమె జుహేర్ ముర‌ద్ స్ప్రింగ్ క‌లెక్ష‌న్స్ 2018 నుంచి న‌లుపు కాక్‌టెయిల్ దుస్తుల‌ను ఎంచుకొంది. లేస్ బేస్‌తోనూ, బెల్ స్లీవ్స్‌తోనూ గౌను అద‌ర‌గొట్టింది.

నికోల్ కిడ్‌మ‌న్‌

నికోల్ కిడ్‌మ‌న్‌

నికోల్ కిడ్‌మ‌న్ సైతం లేసుల గౌనుతో గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్ర‌దానోత్స‌వంలో త‌ళుక్కుమంది. గివెంచీ సంస్థ రూపొందించిన ఈ గౌను లేసుల‌తో, టుల్లీ మిక్స్‌తో అద్భుతంగా ఉంది. దీంతో పాటు ఆమె అంద‌మైన యాక్సెస‌రీల‌ను ధ‌రించి అంద‌రినీ ఆక‌ర్షించారు.

English summary

Actresses Wearing Trending Styles At The Golden Globe Awards 2018

The 75th Golden Globe Awards took place last night at the Beverly Hilton in Beverly Hills, in California. Celebrities from across the globe attended the glam-filled event, which also included Hollywood actors. While black was the ruling colour of the event, there were also many celebrities who flaunted trendy styles along with their black outfits.
Story first published: Tuesday, January 9, 2018, 15:30 [IST]