Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
మరో కొత్త యాంగిల్ లో సాహో భామ శ్రద్ధాకపూర్..
శ్రద్ధా అందమైన వస్త్రధారణలో క్రాప్ టాప్ మరియు ప్యాంటు ధరించింది. ఈ దుస్తులు స్నేహితులతో కలిసి చిన్న చిన్న పార్టీలకు వెళ్లేందుకు సౌకర్యవంతగా ఉంటుందనిపించింది.
సాహోలో ప్రభాస్ సరసన నటించిన బాలీవుడ్ అందాల భామ శ్రద్ధా కపూర్ మరో కొత్త అవతారం ఎత్తింది. తాజాగా తనలోని మరో యాంగిల్ ను బయటపెట్టింది. ఆ యాంగిల్ లో అచ్చం స్వప్నసుందరిలా కనిపిస్తూ కుర్రకారుకు మత్తెక్కిస్తుంది. ఇంతకీ ఆమె కొత్త యాంగిల్ లో కనిపించడానికి కారణమేంటో తెలుసా.. తను ఓ కొత్త కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికవ్వడమే.

సాహో భామ శ్రద్ధాకపూర్ గ్లోబల్ బ్యూటీ బ్రాండ్ ది బాడీ షాపుకు కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికవ్వడంతో ఆ బ్రాండ్ యొక్క మొట్టమొదటి టివిసిని కూడా ఆమె ప్రారంభించారు. ఇందుకోసం ఆమె ధరించిన చెవిరింగులు చమత్కారంగా కనిపించాయి. అంతేకాదు ఆమె ధరించిన గ్రీన్ అండ్ వైట్ కలర్ డ్రెస్సులోనూ ఆ భామ మెరుస్తూ కనిపించింది. ఇక ఆమె వేషధారణను ఒకసారి పరిశీలించి డీకోడ్ చేద్దాం.
శ్రద్ధా అందమైన వస్త్రధారణలో క్రాప్ టాప్ మరియు ప్యాంటు ధరించింది. ఈ దుస్తులు స్నేహితులతో కలిసి చిన్న చిన్న పార్టీలకు వెళ్లేందుకు సౌకర్యవంతగా ఉంటుందనిపించింది. లక్ష్మీ లెహర్ చేత రూపొందించబడిన ఈ డ్రస్సులో డీప్ - నెక్ లైన్ క్రాప్ టాప్ మధ్య మాంచి గ్యాప్ మరియు ముడి వేసిన ఉన్న దుస్తులతో అందాన్ని మరింత పెంచుకున్నట్లు అనిపించింది. అంతేకాదు మ్యాచింగ్ డ్రస్సుకు కనబడి కనబడనట్టుండే నడుముకు ఈ డ్రస్ యాడ్ చేసింది. స్టైలిష్ దివా స్ట్రక్చర్డ్ వైట్ జాకెట్ మరియు పారదర్శక న్యూడ్-టోన్డ్ హీల్స్ తో తన రూపాన్ని రూపవంతంగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంది.

ఇక ఆమె వేసుకున్న చమత్కారమైన చెవిరింగులు అందరినీ ఆకర్షిస్తున్నాయి. అవి చాలా శక్తివంతంగా కనిపిస్తున్నాయి. పింక్ ఫ్లోరల్ టాసెల్ చెవిపోగులు బాన్స్రి అనే లేబుల్ నుంచి వచ్చాయి. ఆమె కనుబొమ్మలను నిశితంగా పరిశీలిస్తే చాలా సున్నితంగా కనిపించింది. ఇంకా తన పెదాలకు పింక్ లిప్ షేడ్ మరియు కాంటౌర్డ్ చీక్స్ తో బేసిక్ మేకప్ తో ఆమె ఎంతో సినిమాల్లో కన్నా ఇక్కడ చాలా సింపుల్ గా కనిపించింది. తన అందమైన గ్రీన్ డ్రెస్ లో డైసీ లాగా తాజాగా నిగనిగలాడుతూ కనిపించింది. ఇది స్పాన్సర్డ్ గిన్నిస్ కుటుంబానికి చెందిన ఐరీష్ పూర్వీకుల ఇంటిలా అనిపిస్తుంది. మాన్షన్ గ్లోబల్ ఈ డిజైన్ దుస్తులకు ఆలోచన చేశారు. మీరు కూడా చమత్కారవంతమైన, సౌకర్యవంతమైన దుస్తుల కోసం వెతుకుతున్నట్లయితే ఇవి ఆదర్శవంతంగా అనిపిస్తాయి. ఇంతకీ మీరు శ్రద్ధా కపూర్ గ్రీన్ కలర్ డ్రస్ ను ఇష్టపడ్డారు? లేదా అనే విషయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు.



Click it and Unblock the Notifications