పెళ్ళైన తరువాత బికినీ ధరించిన సమంత-తనపై విమర్శలకు ఘాటైన సమాధానమిచ్చిన అక్కినేని కొత్తకోడలు

Posted By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky
Samantha Prabhu Akkikeni Trolled For Wearing Bikini

సమంత ప్రభు అక్కినేని ఇటీవలే తన ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ లో తన రీసెంట్ వెకేషన్ కు సంబంధించి ఒక బోల్డ్ ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటో పోస్ట్ చేసినప్పటినుంచి ఆమె విమర్శల పాలవుతోంది. నెటిజెన్ల ఆమెను టార్గెట్ చేసి ఆమెను విమర్శల వర్షంలో ముంచెత్తుతున్నారు. పేరున్న కుటుంబానికి కోడలుగా వెళ్లిన తరువాత కూడా ఇటువంటి పిక్చర్స్ ని పోస్ట్ చేయడమేంటని ఆమెను నిలదీయడం ప్రారంభించారు.

దేశం నలుమూలల నుండి ప్రజలు ఆమెను సోషల్ మీడియా వేదికగా నిలదీయడం ప్రారంభించారు. కొంతమంది ఘాటైన కామెంట్స్ తో ఆమెను నిలదీస్తే మరికొంత మంది డీసెంట్ కామెంట్స్ తో ఆమె వైఖరిని ప్రశ్నించారు. బికినీ లుక్ ని విపరీతంగా విమర్శించారు.

Samantha Prabhu Akkikeni Trolled For Wearing Bikini

ఈ పిక్చర్ లో సమంత ఒక సెక్సీ స్విమ్ సూట్ ను ధరించి బీచ్ రిసార్ట్ లో రిలాక్స్ అవుతున్నట్టు కనిపించింది. అయితే, ఈ పిక్చర్ వలనే ఆమె విమర్శలపాలవుతోంది. నెటిజెన్ల టార్గెట్ అయింది. ఆమెను సపోర్ట్ చేసేవారు ఆమె వ్యక్తిగత జీవితం గురించి కామెంట్స్ చేయనవసరం లేదని ఒకవైపు ట్రాలర్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నా ఆమెను విమర్శిస్తున్నవారి ట్రోల్ కామెంట్స్ అనేవి పెరుగుతూనే ఉన్నాయి.

అయితే, ఈ విమర్శలు సమంత దృష్టికి కూడా చేరాయి. ఆమె వీటిని ఎదుర్కోవడానికి ముందడుగు వేసింది. ఒక కోట్ ఉన్న పిక్చర్ ని పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ కి ఒక క్యాప్షన్ ని జత చేసింది. "ఇప్పుడు నేను ఈ కోట్ ని పెట్టాను. ఎందుకంటే ఇంతకు ముందు పోస్ట్ అనేది సరైన విధంగా చేరలేదు. నా రూల్స్ నేను రాసుకుంటాను. మీ రూల్స్ మీకు రాసుకోండి. నాకు కాదు" అనే క్యాప్షన్ ని జతచేసింది.

సమంత టాలీవుడ్ లో నంబర్ వన్ హీరోయిన్. ఆమె పెళ్లి తరువాత కూడా నటనను కొనసాగిస్తోంది. అయితే, ఆమె కాంట్రవర్షియల్ పోస్ట్ లోని క్యాప్షన్ ని ఒకసారి పరిశీలిద్దాము. "ఇది నాకు కోరిక కాదు. ఇది నాకు అవసరం. బాగా బాగా బాగా అలసిపోయాను. ఇది వెకేషన్ టైం? డ్రీమర్," అని పోస్ట్ చేసి తన బిజీ షెడ్యూల్స్ నుంచి కాస్త విరామం పొందాలని భావించింది. ఒక బీచ్ లో హ్యామాక్ లో సేదతీరుతూ తీసిన ఫోటోని పోస్ట్ చేసి ఆమె శ్రమను గుర్తిస్తారని ఆమె భావించింది. అయితే, ట్రాలర్స్ ఆమె వస్త్రధారణ గురించి ఆమెను నిలదీయడం ప్రారంభించారు.

అయితే, సమంత ఇంతకు ముందు సినిమాలలో కూడా హాట్ హాట్ సన్నివేశాలలో కనిపించింది. అప్పటికి, ఆమెకు ఎటువంటి విమర్శలు ఎదురవలేదు. ఎందుకంటే, అప్పటికి సమంతకింకా పెళ్ళికాలేదు. ఇప్పుడు, సమంత అక్కినేని వారింటికి కోడలు. ఇప్పుడు, సమంతకు సంబంధించిన ప్రతి విషయమనేది కూడా హాట్ టాపిక్ గా మారుతోంది.

ట్రాలర్స్ సోషల్ మీడియాను వేదికగా మార్చుకుని సమంతను విపరీతంగా నిలదీయడంలో బిజీగా ఉన్నారు. ఇంతకు ముందు సమంత పోస్ట్ లను ఒక సారి గమనిస్తే ఇదివరకటి సమంత హాట్ లుక్స్ ను మీరు గమనించవచ్చు. ఆ లుక్స్ అప్పట్లో ట్రాల్స్ బారిన పడలేదు. కారణమేంటంటే, అప్పటికి సమంత వివాహిత కాదు.

Samantha Prabhu Akkikeni Trolled For Wearing Bikini
Samantha Prabhu Akkikeni Trolled For Wearing Bikini
Samantha Prabhu Akkikeni Trolled For Wearing Bikini
Samantha Prabhu Akkikeni Trolled For Wearing Bikini

English summary

Samantha Prabhu Akkikeni Trolled For Wearing Bikini

Samantha Prabhu Akkikeni shared a sexy picture of hers on her Instagram profile from her recent vacation, where people started shaming her and showered her with some moral policing on the basis of her 'over-exposed' look, despite being married into a reputed family.
Story first published: Monday, February 12, 2018, 14:30 [IST]