క్యూట్ కపుల్ సమంత-నాగచైతన్య పెళ్ళి తర్వాత ఫస్ట్ ఫోటో లీక్డ్..!

Posted By:
Subscribe to Boldsky

గత నాలుగైదు రోజుల నుండి అక్కినేని, దగ్గుపాటి వారి మోస్ట్ మెమరబుల్ సమంత, నాగచైతన్య పెళ్లి గురించే వార్తలు వైరల్ అయ్యాయి. సమంత నాగచైతన్య వివాహం, గోవాలో చాలా ఆఢంభరంగా జరిగిన విషయం తెలిసిందే . వీరి పెళ్ళిలో పెద్ద పెద్ద సినీ స్టార్స్ ఎవ్వరూ కనబడక పోయినా కళ్యాణం మాత్రం కమనీయంగా జరిగింది అని చెప్పవచ్చు.

పెళ్ళి తర్వాత ఇటు ఎఫ్ బి, ట్విట్టర్లో వీరిద్దరికి మ్యారేజ్ విషెస్ మాత్రం ఈ క్యూట్ కపుల్ ఇంకా అందుకుంటూనే ఉన్నారు. ఈ క్యూట్ కపుల్ పెళ్ళి తర్వాత మొదట పిక్చర్ బయటకు వచ్చింది. ఈ కొత్త పెళ్ళి జంట చూడటానికి చాలా అందంగా ఉన్నారు.

సమంత బ్యూటిఫుల్ రెడ్ కలర్ డ్రెస్ లో పసుపు ఆరని పారాని, మంగళ సూత్రంతో కొత్త పెళ్లి కూతు కళ ఉట్టిపడుతోంది. గోవాలో పెళ్ళి తర్వాత తీసిన మొదటి పిక్చర్ అనిపిస్తుంది. కావాలంటే మీరు కూడా ఒక లుక్కేసుకోండి.

ఈ ఇరువురి కుటుంబాల గోవాలో పెళ్ళి ప్రైవేట్ గా జరిపించినా, హైదరాబాద్ లో రిషెప్షన్ గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అలాగే చైతన్య, సమంత వారివారి కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు.

కళ్యాణ వైభోగమే..హిందూ సంప్రదాయం ప్రకారం గోవాలో సమంత పెళ్లి, స్టన్నింగ్ ఫోటోలు, సమంత నాగచైతన్య పెళ్లి

సమంత-నాగచైతన్య కళ్యాణ వైభోగం...చూతము రారండోయ్...

పెళ్ళి దుస్తుల్లో మురిసిపోయిన సమంత, హ్యాండ్సమ్ లుక్ తో చైతు

Read more about: fashion samantha marriage
English summary

Samantha Ruth Prabhu and Naga Chaitanya’s first photo as a married couple is here

Samantha Ruth Prabhu and Naga Chaitanya’s first photo as a married couple is here, Read to know more about