క్యూట్ లేదా సెక్సీ: కంగనా కేన్స్ 2018 లుక్ లో మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షించిన లుక్ ఏది

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

కేన్స్ 2018లో బిజీ షెడ్యూల్స్ మధ్యలో కంగనాకు తన టీమ్ తో లంచ్ కి అలాగే షాపింగ్ కి వెళ్లేందుకు కాస్త విరామం దొరికినట్టుంది. రెడ్ కార్పెట్ పైనే కాదు సాధారణ సమయంలో కూడా కంగనా తన స్టన్నింగ్ లుక్స్ తో తన అభిమానుల హృదయాలను కొల్లగొడుతోంది. క్యాజువల్ అవుట్ ఫిట్స్ తో కంగనా ఎమేజింగ్ గా కనిపిస్తోంది.

అవును, జిమ్ సర్బ్ లా కంగనా కూడా ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఫన్ ని ఇష్టపడుతోంది. మధ్యాహ్న సమయానికి, రెడ్ కార్పెట్ పై సెన్సేషన్ సృష్టించిన తన అవుట్ ఫిట్స్ ను తొలగించి ట్రూసార్డీ అనే ఇటాలియన్ లేబుల్ కి చెందిన టూ సెక్సీ సెపరేట్స్ ను ధరించింది.

"క్వీన్" భామ ఫ్రెంచ్ రివెరా లెన్స్ వద్ద గ్రీన్ ట్రౌజర్స్ తో సందడి చేసింది. రివీలింగ్ బికినీ టాప్ ను ధరించి దాని పైన ఎలిగంట్ జాకెట్ ను మ్యాచ్ చేసింది. వైట్ పంప్స్, బ్లాక్ సన్ గ్లాసెస్, గోతిక్ లిప్ స్టిక్ షేడ్ తో పాటు రెట్రో హెయిర్ స్టైల్ తో కంగనా లుక్స్ ఆసక్తికరంగా అదే సమయంలో ప్రయోగాత్మకంగా ఉన్నాయి.

Sexy Or Cute: Which Kangana’s Cannes 2018 Off The Red Carpet Look Woos You More?

అయితే, తనలోని సరదా కోణాన్ని కూడా కంగనా బయటపెట్టింది. ఎలీసబెట్ట ఫ్రాంచీ డ్రెస్ లో కంగనా ఫ్యాషన్ కి మరో అర్థంలా కనిపించింది. 60 మరియు 70 ల సమయంలో ఫ్యాషన్ లో ఒక ప్రముఖ స్థానాన్ని పొందిన ఈ డ్రెస్ లో కంగనా మెరిసిపోయింది.

క్యాట్, డాగ్, బర్డ్ వంటి కొన్ని మోటిఫ్స్ కలిగిన స్కై బ్లూ అట్టైర్ లో కంగనా ఆకర్షణీయంగా కనిపించింది. టాడ్స్ లేటెస్ట్ బ్రైట్ ఎల్లో ఫింగర్ పర్స్ ని క్యారీ చేసి ఎల్లో ఆరెంజ్ షేడ్స్ ని ఎంతో ఈజ్ తో మెయింటైన్ చేయగలిగింది. అలాగే, ఆమె పోనీటెయిల్ కూడా ఆమె డ్రెస్ కి బాగా మ్యాచ్ అయింది.

దాదాపు రెండు గంటల సమయంలోనే కంగనా మనకు తనలోని రెండు రకాల ఫ్యాషన్ కోణాలను ప్రదర్శించింది. కంగనా లుక్ లో మిమ్మల్ని ఏ లుక్ అమితంగా ఆకర్షించింది. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ సెక్షన్ ద్వారా మాకు తెలపండి.

English summary

Sexy Or Cute: Which Kangana’s Cannes 2018 Off The Red Carpet Look Woos You More?

Kangana is finding out time to go lunching and shopping with her team at Cannes. In the afternoon, she unleashed her badass avatar by donning super sexy separates from the Italian label, Trussardi. And later in the day, she took a U-turn, looking cute in her Elisabetta Franchi dress. Which look of hers did you like more- Sassy or Playful?