బ్రైడల్ మ్యాగజైన్ లేటెస్ట్ ఇష్యూలో ఎథెరల్ లుక్స్ ని స్టన్నింగ్ గా క్యారీ చేసిన సోనమ్ కపూర్

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

బజార్ బ్రైడ్ ఇండీస్ లేటెస్ట్ ఇష్యూలో కవర్ గర్ల్ గా దర్శనమిచ్చింది సోనమ్ కపూర్. ఈ బాలీవుడ్ బ్యూటీ మనోహరమైన బ్రైడల్ అవతార్ లో స్టన్నింగ్ గా కనిపించి మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తోంది.

రాయల్ 'బహు రాణి' నుంచి 'నోబుల్ ప్రిన్సెస్' వరకు సోనమ్ కొన్ని ఎమేజింగ్ బ్రైడల్ అవుట్ ఫిట్స్ ను చక్కగా క్యారీ చేసింది. వీటిలో సోనమ్ హొయలుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ లుక్స్ కి ఎవరైనా ఫిదా అయిపోక తప్పదు. అబ్బాయిలు తమకు కాబోయే భార్య ఈ విధంగా ఉండాలని ఒక స్టాండర్డ్ ని ఫిక్స్ చేసుకోవడం ఖాయం. ఆ విధంగా బ్రైడల్ స్టైల్ ని క్యారీ చేసింది ఈ బాలీవుడ్ సుందరాంగి.

సోనమ్ క్యారీ చేసిన ఈ లుక్స్ గురించి కాస్తంత చర్చించుకుందాం...

లేడీ ఇన్ ది రెడ్

లేడీ ఇన్ ది రెడ్

సూపర్ జార్జియస్ రాల్ఫ్ & రస్సో రెడ్ ఫర్రీ గవున్ ను ధరించి సోనమ్ మన మతులను పోగొట్టింది. తన జీవితంలోని ముఖ్యమైన ఘట్టానికి రెడీ అన్నట్టు ప్రిన్సెస్ అవతారంలో సొగసులద్దింది ఈ బ్యూటీ. తన లుక్ కి మ్యాచ్ అయ్యే యాక్ససరీస్ ను ధరించింది. సిల్వర్ చోకర్, బ్రేస్లెట్ మరియు థిన్ హెయిర్ బ్యాండ్ ను ధరించి తన అవుట్ ఫిట్ అందాన్ని మరింత రెట్టింపు చేసుకుంది.

రాజమాత అవతార్

రాజమాత అవతార్

రాజమాత అవతారంలో గాంభీర్యాన్ని ప్రదర్శించింది సోనమ్. రాజమాతలో కనిపించే రాజసాన్ని యథాతథంగా దించింది. ఈ లుక్ లో సోనమ్ బీజ్ అనామికా ఖన్నా శారిని దానిపై ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ చేయబడిన ఎల్లో బ్లవుజ్ ని ధరించింది. ఈ మ్యాగజైన్ కవర్ లుక్ గా కూడా ఈ లుక్ నే ఎంచుకున్నారు.

బ్లాక్ ని ఏదీ బీట్ చేయలేదు

బ్లాక్ ని ఏదీ బీట్ చేయలేదు

డార్క్ నెస్ ని ప్రతిబింబించే రంగుగా బ్లాక్ ని పరిగణించినా ఈ కలర్ అనేది మహిళ యొక్క శృంగార కోణాన్ని వర్ణిస్తుంది. బ్లాక్ అనేది ఒక క్లాసిక్ కలర్. ఈ కలర్ డ్రెస్ ను ధరించిన వారు అద్భుతంగా కనిపిస్తారు. అయితే, సహజంగానే మనోహరి అయినా సోనమ్ కపూర్ ఈ కలర్ ను ధరిస్తే ఆ అద్భుతాన్ని వర్ణించడానికి మాటలు చాలవు.

ఈ లుక్ లో సోనమ్ రాల్ఫ్&రస్సో కౌచర్ వారి బ్లాక్ ఫర్ గౌన్ ని ధరించింది. ఈ అటైర్ లో సోనమ్ అద్భుతంగా కనిపించింది. ఈ అవుట్ ఫిట్ కు ముత్యాల నెక్లెస్ ను మ్యాచ్ చేసింది.

చక్కని వధువు

చక్కని వధువు

సోనమ్ వంటి ఇటువంటి లుక్ తో దర్శనమిచ్చే ఏ వధువైనా మరింత అందంగా కనిపిస్తుందని అనడంలో అతిశయోక్తి లేదు. అనామికా ఖన్నా వెడ్డింగ్ లెహంగాపై వయొలెట్ వెల్వెట్ బ్లౌజ్ ని ధరించిన సోనమ్ ప్రింటెడ్ లెహంగా స్కర్ట్ పై గోల్డెన్ దుపట్టాను మేచ్ చేసి స్వర్గంగా నుంచి దిగివచ్చిన ఈ సుందరి అనేంత అందంగా మెరిసింది. వీటికి తోడు స్టన్నింగ్ జ్యువలరీని కూడా మ్యాచ్ చేసి తన లుక్ ను మరింత పెంచింది.

డిజైనర్స్ తో

డిజైనర్స్ తో

రాల్ఫ్ & రస్సో వారి ఎంసెంబుల్ ను ధరించి వారి డిజైనర్స్ తో ఫోటో దిగింది సోనమ్.

ఈ షూట్ మా అభిప్రాయం ప్రకారం సోనమ్ కపూర్ కి చెందిన అద్భుతమైన మ్యాగజైన్ షూట్. అతిలోకసుందరిలా కనిపించి మెరిసింది ఈ బాలీవుడ్ బ్యూటీ.

ఈ షూట్ లుక్స్ మీకు నచ్చాయా? మాకు వెంటనే తెలియచేయండి!

English summary

Sonam Kapoor Featured In Bazaar Bride

Sonam Kapoor Featured In Bazaar Bride, Sonam Kapoor beats us all with her stunning looks for Bazaar Bride India's latest issue. Have a look.
Story first published: Monday, February 19, 2018, 16:00 [IST]