సంగీత్ వేడుకలలో దేవతలా కనిపించిన సోనం కపూర్

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

సోనం కపూర్ పెళ్లి వేడుకలు: అసలు సోనం ఎలా ముస్తాబయిందో తెలుసా?

పెళ్లివేడుకలలో బాగంగా మిలియన్ డాలర్ పెళ్లికూతురు అంటే ఇలానే ఉంటుందేమో అన్న అనుమానం వచ్చేలా, అబుజాని మరియు సందీప్ ఖోస్లా వంటి పేరొందిన డిజైనర్లు రూపొందించిన దుస్తులలో ఔరా అనిపించేలా తయారయిన సోనంకపూర్, పెళ్లివేడుక మొత్తం తనలోనే కనిపించేలా ముస్తాబయింది అనడంలో ఆశ్చర్యమే లేదు.

ఈ అబ్బురపరచే లెహంగా ను తయారు చేయడానికి డిజైనర్లకు 18 నెలల సమయం పట్టింది అంటేనే అర్ధం చేసుకోవచ్చు, ఈ దుస్తుల రూపకల్పనలో కూడా ఎంత జాగ్రత్తను తీసుకున్నారో అని. బంగారు తాపడంతో, వెండి జర్దాజి, జరి, సీక్విన్స్, ముత్యాలు మరియు స్వరోవ్స్కీ స్ఫటికాలలో అలంకరించబడి ఊహాతీతముగా తయారు చేయబడి ఆకర్షణీయంగా డిజైన్ చేయబడి ఉన్నది.

Sonam Looked Divine In Her Sangeet Ceremony

ఇక ఆభరణాల విషయానికి వస్తే స్టేట్మెంట్ చోకర్, జుంకీలు, బ్రేస్లేట్, పాపిటి బిళ్ళ (మాంగ్ టిక్కా) వంటి ఆభరణాల విషయంలో సోనం తల్లి స్వయంగా భాద్యతను తీసుకుని ప్రత్యేకంగా చేయించింది.

వేడుక సందర్భంగా సోనం కపూర్ మొగ్రా గజ్రాస్ తో అలంకరించిన బన్(జుట్టు ముడి)తో, తెలుపు, బంగారం ఈ పెళ్లి వేడుకకు నేపధ్య రంగులుగా మారాయి. ముఖ్యంగా చెవికి ధరించిన జుంకీలు, మెడలోని హారం, బ్రేస్లేట్ మరియు పాపిటి బిళ్ళ వేడుకకే వేడుకను తెచ్చిన అనుభూతిని ఇచ్చింది.

Sonam Looked Divine In Her Sangeet Ceremony

స్వగృహంలో మెహెoదీ కార్యక్రమం తర్వాత జరిగిన వేడుకలలో భాగంగా ఈసంబరాలు అత్యంత విలాసవంతమైన సన్టెక్, సిగ్నేచర్ ఐలాండ్, బాంద్రాకాంప్లెక్స్ లో జరిగాయి.

కపూర్ కుటుంబ సభ్యులతో పాటు సోనమ్ యొక్క సన్నిహితులైన స్వరభాస్కర్, మసాబా గుప్తా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరియు కునాల్ రావల్ వంటి ప్రముఖులు ఈవేడుకలలో పాలుపంచుకున్నారు.

English summary

Sonam Looked Divine In Her Sangeet Ceremony

Sonam's Sangeet lehenga took 18 months to complete! Find out all the work that went behind making this attire a masterpiece creation.
Story first published: Wednesday, May 9, 2018, 11:30 [IST]