శ్రీదేవి అందానికి కారణం అదేనట

Written By:
Subscribe to Boldsky

భౌతికంగా మన నుంచి శాశ్వతంగా దూరమైనా మన మనస్సుల్లో ఆమెపై చెరగని ప్రేమ గూడు కట్టుకుని ఉంది. అయితే శ్రీదేవి తనకు సంబంధించి కొన్ని విషయాలు ఆమె బతికున్నప్పుడు చెప్పారు. అందులో కొన్ని చూద్దామా.

అన్నం తక్కువ తినడమే

అన్నం తక్కువ తినడమే

తన సౌందర్య రహస్యం తాను అన్నం తక్కువ తినడమేనట. వేపుడు కూరలు, మసాలా జోలికి అస్సలు వెళ్లేది కాదట. కూల్ డ్రింక్స్ అస్సలు తాగేది కాదట. ఇవి పాటిస్తే అందరూ అందంగా ఉంటారని కూడా శ్రీదేవి చెప్పింది.

ఇవన్నీ ఇష్టం

ఇవన్నీ ఇష్టం

శ్రీదేవి హైదరాబాదుకు వస్తే సందడే సందడి..తాజ్‌బంజారా, పార్క్‌హయత్‌లో బస..టైముంటేట్యాంక్‌బండ్‌పై షికారు..ఉలవచారు రెస్టారెంట్‌లోఆకుకూర పప్పు..టమోటాచారు..అవర్‌ప్లేస్‌ హోటల్‌లోభోజనం.. ఇలా గడిపేవారు.. సీసీఎల్‌ మ్యాచ్‌లు ఉన్నపుడు స్టేడియంలో హుషారుగా కనిపించేవారు.

ఉలవచారు ఫుడ్

ఉలవచారు ఫుడ్

శ్రీదేవి హైదరాబాద్ లో ఉంటే ఒక్కసారైనా ఫిల్మ్‌నగర్‌లోని ఉలవచారు రెస్టారెంట్‌ ఫుడ్‌ని ప్రిఫర్‌ చేసేవారట. అక్కడ దొరికే ఆకు కూర పప్పు, పప్పుచారు, టమోటా చారు అంటే ఆమెకు బాగా ఇష్టం అట. అడిగి మరీ వండించుకుని పార్సిల్‌ తీసికెళ్లేవారట.

చికెన్, మటన్ అంటే ఇష్టం

చికెన్, మటన్ అంటే ఇష్టం

శ్రీదేవికి చికెన్, మటన్‌తో పాటు దక్షిణాది వంటకాలంటే బాగా ఇష్టం అట. తన భర్త, పిల్లలతో హైదరబాద్ కు వచ్చినప్పుడు కొన్ని హోటల్స్ లో శ్రీదేవి ప్రత్యేకంగా వాటిని వడించుకుని తినేదట.

శ్రీదేవి సినిమాలను చూస్తున్నప్పుడు

శ్రీదేవి సినిమాలను చూస్తున్నప్పుడు

తన పిల్లలు తన సినిమాలు చూస్తుంటే ముందు ఆ ఛానల్‌ మార్చండి అని శ్రీదేవి చెప్పేదట. ఎందుకంటే ఆమెకు ఆ పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేయట. ఈ సినిమా తానెప్పుడు చేశాను అనిపించేదట.

చీమలు కుడుతున్నా

చీమలు కుడుతున్నా

ఇక పదహారేళ్ల వయసు మూవీలో సిరిమల్లె పువ్వా పాటను ఓ తోటలో చిత్రీకరించారట. ఓ చోట శ్రీదేశి హావభావాలు ఎంతో చల్లని వాతావరణం ఆస్వాదిస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ సరిగ్గా ఆ సమయంలోనే శ్రీదేవిని చీమలు కుట్టేస్తున్నాయట. ఆ బాధను కనిపించకుండా భలే నటించానే అని శ్రీదేవి కూడా అనుకునేదట.

English summary

sridevi’s beauty secrets revealed

sridevi’s beauty secrets revealed
Story first published: Monday, February 26, 2018, 10:21 [IST]