ఎల్ ఎఫ్ డబ్యూ ఎస్ ఆర్’18; తాప్సీ పన్ను డిజైనర్ రీతూ కుమార్ దుస్తులలో ర్యాంప్ పై యాటిట్యూడ్ తో

Posted By: Deepthi
Subscribe to Boldsky

లాక్మే ఫ్యాషన్ వీక్ సమ్మర్/రిసార్ట్ 2018 లో ప్రసిద్ధ డిజైనర్ రీతూ కుమార్ కార్యక్రమంలో భాగంగా తాప్సీ పన్ను సెలబ్రిటీ షో స్టాపర్ గా ర్యాంప్ పై నడిచారు.

ఈ అందమైన నటి డిజైనర్ సృష్టించిన నల్లని బొహీమియన్ బట్టల్లో మరింత అందంగా కన్పించారు. లేసులున్న నల్లటి బ్లౌజ్,ప్రింటెడ్ డ్రస్ మరియు నల్లని షార్టులతో మొత్తంగా అద్భుతంగా కన్పించారు. తన హుందాతనంతో తాప్సి ఎటువంటి దుస్తులలోనైనా అలవోకగా ఇమిడిపోగలరు, ఈ సారి కూడా ఈ అసమాన దుస్తుల్లో ర్యాంప్ పై తళుక్కున మెరిసారు.

Taapsee Pannu For Ritu Kumar At The Lakme Fashion Week 2018

తాప్సి నల్లని బెల్ట్ మరియు మడమ పొడవున్న ప్లాట్ ఫారం బూట్లు ఆ డ్రస్ తో పాటు ధరించారు. ఈ లుక్ కు మరింత వన్నె తేవడానికి, ఈ నటి సన్నని నెక్లెస్ మరియు వెడల్పాటి చోకర్ ను పెట్టుకున్నారు. ఇంత బాగా తయారయిన లుక్ ని కేవలం అందంగా ఉంది అనటం చాలా తక్కువ అవుతుంది.

హుందాతనం ఉట్టిపడే ఈమె ర్యాంప్ పై ఫర్ఫెక్షన్ తో కార్యక్రమాన్ని పూర్తిచేసారు. ఆమె అద్భుత కలెక్షన్ ను ప్రదర్శించిన ఇతర మోడల్స్ మరియు డిజైనర్ తో కలిసి ర్యాంప్ పై నడిచారు.

Taapsee Pannu For Ritu Kumar At The Lakme Fashion Week 2018

మీకు ఆమె ఈ లుక్ నచ్చిందా? కామెంట్ సెక్షన్ లో మాకు తెలియచేయండి.

Taapsee Pannu For Ritu Kumar At The Lakme Fashion Week 2018
Taapsee Pannu For Ritu Kumar At The Lakme Fashion Week 2018
Taapsee Pannu For Ritu Kumar At The Lakme Fashion Week 2018

English summary

Taapsee Pannu For Ritu Kumar At The Lakme Fashion Week 2018

ఈ అందమైన నటి డిజైనర్ సృష్టించిన నల్లని బొహీమియన్ బట్టల్లో మరింత అందంగా కన్పించారు. లేసులున్న నల్లటి బ్లౌజ్,ప్రింటెడ్ డ్రస్ మరియు నల్లని షార్టులతో మొత్తంగా అద్భుతంగా కన్పించారు. తన హుందాతనంతో తాప్సి ఎటువంటి దుస్తులలోనైనా అలవోకగా ఇమిడిపోగలరు, ఈ సారి కూడా ఈ అసమాన దుస్తుల్లో ర్యాంప్ పై తళుక్కున మెరిసారు.
Story first published: Friday, February 2, 2018, 13:00 [IST]