For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

"క‌ల్ హో న హో" కు 14ఏళ్లు... అచ్చెరువొందే 10 ఫ్యాష‌న్లు!

క‌ల్ హో న‌హో సినిమా నుంచి కొన్ని ట్రెండింగ్ స్టైళ్ల‌ను బోల్డ్ స్కై త‌ర‌ఫు నుంచి సేక‌రించి అందిస్తున్నాం. సినిమాలో ఎన్ఆర్ఐలు ఎలా న‌డుచుకుంటారు వారు వేసుకునే యాక్స‌స‌రీల‌పై బాగా దృష్టిపెట్టి డిజైన‌ర్ మ‌

By Sujeeth Kumar
|

క‌ల్ హో న హో ... 90ల‌లో ఉన్న కిడ్స్ ఈ బాలీవుడ్ సినిమా అందించిన మ‌ధుర జ్ఞాప‌కాల‌ను మ‌ర్చిపోలేరు. ఈ సినిమాను ఒక్క‌సారి కాదు ఎన్నో సార్లు చూసి ఉంటారు. మొన్నీ మ‌ధ్యే ఈ సినిమా 14ఏళ్లు పూర్తి చేసుకుంది.

షారుక్ ఖాన్ ఇచ్చిన సిగ్నేచ‌ర్ పోజులు, అద్భుత‌మైన స్టోరీ లైన్ ఒక్కో దృశ్యం ర‌మ‌ణీయం. అప్ప‌టి స‌మ‌యంలో ఉన్న ష్యాష‌న్ల‌కు ఈ సినిమా అద్దం ప‌ట్టింది. అప్ప‌టి స్టైల్ స్టేట్‌మెంట్ ఎలా ఉండాలో తెలియాలంటే రెండు ద‌శాబ్దాలు వెన‌క్కి వెళ్లాలి లేదా ఈ సినిమాను మ‌రొక్క‌సారి చూసితీరాలి.

styles from kal ho naa ho

క‌ల్ హో న‌హో సినిమా నుంచి కొన్ని ట్రెండింగ్ స్టైళ్ల‌ను బోల్డ్ స్కై త‌ర‌ఫు నుంచి సేక‌రించి అందిస్తున్నాం. సినిమాలో ఎన్ఆర్ఐలు ఎలా న‌డుచుకుంటారు వారు వేసుకునే యాక్స‌స‌రీల‌పై బాగా దృష్టిపెట్టి డిజైన‌ర్ మ‌నీష్ మ‌ల్హోత్రా అద్భుత‌మైన ఫ్యాష‌న్‌ను ప‌రిచ‌యం చేశాడు.

1. ఒక భుజానికే ....

1. ఒక భుజానికే ....

ఫ్యాష‌న్ దుస్తుల్లో భాగంగా కేవ‌లం టీ ష‌ర్ట్ లేదా పై దుస్తుల‌కు ఒకే భుజానికి ప‌ట్టీ ఉంటుంది. ఇది ఇప్ప‌టి ట్రెండ్ అని భావిస్తే మీరు పొర‌బ‌డిన‌ట్టే. ఒక పాట‌లో ప్రీతి జింతా ఇలాంటి దుస్తులే వేసుకొంది. నీలం రంగులో డిజైన్ చేసిన ఈ డ్రెస్ మ‌నీష్ మ‌ల్హోత్రాకు అప్పట్లో బాగా పేరు తీసుకొచ్చింది. ప్రీతి జింతా ఈ ఫ్యాష‌న్‌ను రెండు దశాబ్దాల కింద‌టే పాటించిందన్న‌మాట‌.

2. క్యాజువ‌ల్ గోల్స్‌

2. క్యాజువ‌ల్ గోల్స్‌

టీనేజ‌ర్ల నుంచి పెద్ద‌వయ‌సువారి దాకా షారుక్ ఖాన్ వేసుకున్న క్యాజువ‌ల్ గోల్స్‌కు ఫిదా అయిపోయారు. వ‌దులుగా, సాదాసీదా రంగుల్లో ఉన్న ఈ టీ ష‌ర్టుల‌కు అప్ప‌ట్లో ప‌డిపోనివారు లేరు. షారుక్ ఖాన్ మూడ్‌కు త‌గ్గ‌ట్టుగా కూడా ఇవి ఉండేవి. ఇది సినిమాకే హైలైట్‌గా నిలిచింది.

3. ఎంబ్రాయిడ‌రీ కుర్తాలు

3. ఎంబ్రాయిడ‌రీ కుర్తాలు

మ‌గ‌వారి స్టైల్ విష‌యాన్ని అప్ప‌ట్లో కాస్త చిన్న చూపు చూసేవారు. ఐతే డైరెక్ట‌ర్ క‌ర‌ణ్ జోహార్‌ది మ‌రో పంథా. ఎంబ్రాయిడ‌రీల‌ను కేవ‌లం అతివ‌ల‌కే ప‌రిమితం చేయ‌లేదు. మ‌నీష్ మ‌ల్హోత్రా మంచి మంచి డిజైన్ల‌ను రూపొందించాడు. ఎన్నో సంద‌ర్భాల్లో షారుఖ్‌, సైఫ్‌లు ఈ కుర్తాల్లో మురిపించారు.

4. రొమాన్స్ స‌న్నివేశాల్లో రంగుల దుస్తుల్లో...

4. రొమాన్స్ స‌న్నివేశాల్లో రంగుల దుస్తుల్లో...

బాలీవుడ్‌లో ల‌వ్ స్టోరీలను మ‌ల‌చ‌డంలో క‌ర‌ణ్ జోహార్‌కు త‌న‌దైన ప్ర‌త్యేక శైలి ఉంది. ప్రేమ‌, రొమాన్స్‌ల‌ను తెర‌పైన అద్భుతంగా ఎలా ఆవిష్క‌రించాలో ఆయ‌న‌కు బాగా తెలుసు. మ‌నీష్ మ‌ల్హోత్రా స‌హాయంతో ప్రీతి జింతాకు, సైఫ్‌కు రంగు రంగుల ఫ్యాష‌న్ దుస్తుల‌ను ధ‌రింప‌జేసి ఇదిగో ఇలాంటి రొమాంటిక్ స‌న్నివేశాల్లో న‌టింప‌జేశారు.

5. వేర్వేరు షేడ్స్‌లో...

5. వేర్వేరు షేడ్స్‌లో...

క‌ల‌ర్ ఒక‌టే... షేడ్స్ మాత్రం భిన్న ర‌కాలు. ఇలాంటి డిజైన్ చేయ‌డం చాలా రిస్కీ. అయినా మ‌నీష్ మ‌ల్హోత్రా ధైర్యంగా ఇలాంటి ప్ర‌యోగం చేసి స‌ఫ‌ల‌మ‌య్యాడు. ప్రీతి జింతా పింక్ క‌ల‌ర్‌లో వివిధ షేడ్స్‌లో వేసుకున్న డ్రెస్ హైలైట్గా నిలిచింది.

 6. వెడ‌ల్పాటి క‌ళ్ల‌జోళ్లు

6. వెడ‌ల్పాటి క‌ళ్ల‌జోళ్లు

ఈ సినిమాను చూసిన‌వారు చ‌ష్మిష్ నైనా ను ఎలా మ‌ర్చిపోగ‌లుగుతారు. ప్రీతి జింతా వేసుకున్న ఈ వెడ‌ల్పాటి క‌ళ్ల‌జోడు అప్ప‌ట్లో ఫ్యాష‌న్‌గా నిలిచింది. 90కిడ్స్ లో కొంద‌రు దాన్ని ఇప్ప‌టికీ ఫాలో అవుతున్నారు .

7. ధ‌గ‌ధ‌గ‌ల ఆభ‌ర‌ణాలు

7. ధ‌గ‌ధ‌గ‌ల ఆభ‌ర‌ణాలు

ఎన్.ఆర్‌.ఐల ప్ర‌ధానాంశంగా క‌థ సాగుతుంది కాబ‌ట్టి ఎక్కువ‌గా ఆభ‌ర‌ణాలు ధ‌రించిన‌ట్టుగా సినిమాలో చూపించ‌లేదు. ఐతే రెండు సంద‌ర్భాల్లో ఇలా చేయాల్సి వ‌చ్చింది. ప్రీతి జింతా మెహందీ ఫంక్ష‌న్‌లో, మ‌రో సారి ఆమె పెళ్లిలో ధ‌గ‌ధ‌గ‌లాడే ఆభ‌ర‌ణాల‌తో ఆమె మెరిసిపోయింది. రెండు సంద‌ర్భాల్లో వేటిక‌వే ప్ర‌త్య‌క‌మైన యాక్స‌స‌రీలు ధ‌రించ‌డం విశేషం.

8. ట్రెంచ్ ష్ర‌గ్స్‌

8. ట్రెంచ్ ష్ర‌గ్స్‌

మీరు 90ల‌లో పుట్టిన వారైతే ట్రెంచ్ ష్ర‌గ్స్ అప్ప‌ట్లో ఫ్యాష‌న్ ప్రపంచాన్ని ఎలా ఏలాయో తెలుస్తుంది. ప్రీతి జింతా కొన్ని అద్భుత‌మైన ట్రెంచ్ ష్ర‌గ్స్‌ను సినిమాలో వేసుకొని అల‌రించింది.

9. ఫ‌ర్ తో చేసిన జాకెట్లు

9. ఫ‌ర్ తో చేసిన జాకెట్లు

ఫ‌ర్ జాకెట్లా ... తాత‌ల కాలం నాటి ష్యాష‌న్ అని అంటారు ఇప్పుడెవ‌రైనా దాని ప్ర‌స్తావ‌న తీసుకొస్తే. కానీ ఈ సినిమా విడుద‌లైన‌ప్పుడు ఫ‌ర్ జాకెట్లు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. ఆ సినిమా చూసిన దాదాపు ప్ర‌తి అమ్మాయి ఇలాంటి జాకెట్ ఒక్క‌టైనా కొని ఉంటుందని మేము భావిస్తున్నాం.

10. ట్రెంచ్ బ్లేజ‌ర్లు

10. ట్రెంచ్ బ్లేజ‌ర్లు

ట్రెంచ్ బ్లేజ‌ర్లు ఇప్పుడు చాలా పాత‌బ‌డిపోయిన ఫ్యాష‌న్‌. కానీ ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ వాటిని ధ‌రించి వ‌స్తుంటే అమ్మాయిల గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తేవంటే న‌మ్ముతారా.. అప్ప‌ట్లో ఈ డ్రెస్ ఫ్యాష‌న్‌ చూసిన‌వారికి నోట‌మాట రాలేదంటే న‌మ్మండి.

English summary

Styles From Kal Ho Naa Ho| 14 Years Of Kal Ho Naa Ho

Depression is a serious mental ailment which can have fatal consequences if not treated in time. The treatment for depression involves boosting the serotonin hormone levels in the brain. Following a healthy diet pattern, exercising regularly, deviating the mind into something more productive, etc., are some of the effective ways to treat depression naturally..
Story first published:Friday, December 1, 2017, 12:30 [IST]
Desktop Bottom Promotion