ప్రతి స్త్రీ వార్డ్ రోబ్ లో ఉండే జీన్స్ లో రకాలు

By: LAKSHMI BAI PRAHARAJU
Subscribe to Boldsky

జీన్స్ ఫాషన్ ప్రపంచంలో ఉత్తమ ఆవిష్కరణ, దాని పరిణామం వల్ల, ఇది మనిషి వార్డ్ రోబ్ లో ఒకభాగం అయిపొయింది. లింగబేధం లేకుండా, ప్రతి వ్యక్తి ఆమె/అతని వార్డ్ రోబ్ లో కనీసం ఒక జత జీన్స్ ఉంటుంది.

స్త్రీలకూ కూడా, ఇది అవసరమైన వస్తువయింది, మీరందరికీ కూడా కనీసం ఒక జత అయినా ఇది తప్పక ఉంది ఉంటుంది.

types of jeans every woman should have

నేడు, ప్రతి ఒక్కరూ కావాలనుకునే కొన్ని జీన్స్ ప్రాధమిక రూపాల జాబితాను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి...

స్ట్రెయిట్ కట్ జీన్స్

స్ట్రెయిట్ కట్ జీన్స్

మనందరికీ ఉండే సాదా జీన్సే స్ట్రెయిట్ కట్ జీన్స్. ఈ రకమైన జీన్స్ ఎటువంటి నమూనా లేదా డిజైన్ లేకుండా నేరుగా నిలువు కట్ తో ఉంటుంది. ఇది ప్రతి అమ్మాయి లేదా అబ్బాయి పొందే సాధారణ జీన్స్. శైలి అనేది మీ ఎంపిక మీద ఆధారపడి ఉంటుంది.

స్ట్రెయిట్ కట్ జీన్స్, సిగరెట్ జీన్స్ అని పిలువబడే అధునాతన రకం. ఈ రకమైన జీన్స్ స్ట్రెయిట్ కట్ జీన్స్ ని పోలి ఉంటుంది, కానీ మరింత సన్నగా, సొగసుతో ఉంటుంది.

స్కిన్నీ జీన్స్

స్కిన్నీ జీన్స్

స్కిన్నీ జీన్స్ అనేది ప్రతి ఒక్క అమ్మాయికి తప్పక ఉండేది. ఈ స్కిన్నీ జీన్స్ చాలా బిగుతుగా ఉండి, అవయవాలను పట్టినట్టు ఉంది, మీ ఆకృతి బిగుతుగా కనిపించేట్టు చేస్తాయి. స్కినీ జీన్స్ లో అమ్మాయిలూ చాలా అందంగా కనిపిస్తారు, చర్మానికి సరిపోయే ఈ జీన్స్ వేసుకుని అందంగా కనిపించే అబ్బాయిలు కూడా ఉన్నారు, ఉదాహరణకు, రన్వీర్ సింగ్.

బాయ్ ఫ్రెండ్ జీన్స్

బాయ్ ఫ్రెండ్ జీన్స్

బాయ్ ఫ్రెండ్ జీన్స్ ఒకరకమైన జీన్స్, ఇవి ఇరుకుగా సరిపోయే (స్ట్రెయిట్ కట్) లేదా స్కిన్నీ జీన్స్ కంటే కొంచెం వదులుగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్ జీన్స్ అబ్బాయిల వదులుగా ఉండే శైలి స్టేట్మెంట్ నుండి దాని పేరును పొందింది. అమ్మాయిలూ వారి బాయ్ ఫ్రెండ్స్ దుస్తులను ధరించి బాగీ స్టైల్ స్టేట్మెంట్ ని కలిగి ఉంటారు, అందుకే ఆపేరు వచ్చింది.

బూట్-కట్ జీన్స్

బూట్-కట్ జీన్స్

70 లలో ప్రసిద్ది చెందిన ఈ బూట్-కట్ జీన్స్ పాతకాలం నుండి ఎల్లప్పుడూ ఇష్టమైనదే. జిమి హెండ్రిక్స్ తోసహా కూడా అమెరికన్ పాప్ స్టార్ వరకు ఈ బూట్ కట్ జీన్స్ మంచి జనాదరణ పొందాయి. ఈ శైలి జీన్స్ పాదాల వద్ద పెప్లమ్ ప్రభావంతో ఉంటుంది. పొడవును బూట్లు కవర్ చేయడం వల్ల, దీనిపేరు బూట్ కట్ గా ఏర్పడింది.

ఫ్లేర్డ్ జీన్స్

ఫ్లేర్డ్ జీన్స్

ఫ్లేర్డ్ జీన్స్ వింటేజ్ సబ్ డివిజన్ కు సరిపోయే మరో ప్రసిద్ధ రకం జీన్స్. ఈ శైలి జీన్స్ కూడా ఈరోజుల్లో ఒక ట్రెండ్ గా ఉంది, ప్రపంచంలోని స్త్రీలు వీటిని ఇష్టపడుతున్నారు. వారు క్రాప్ టాప్స్, బ్రలేట్స్ తో చాలా అందంగా కనిపిస్తున్నారు. ఈ జీన్స్ తో సాధరణ టాప్స్ కూడా వేసుకోవచ్చు.

English summary

Types Of Jeans Every Woman Should Have

Jeans is the best invention in fashion and since its evolution, it has been a favourite part of a person's wardrobe. Irrespective of gender, every person possesses at least one pair of jeans in his/her wardrobe. For women too, this is a necessary possession and we are sure that you all have at least a pair of what we've mentioned.
Story first published: Monday, January 15, 2018, 16:00 [IST]
Subscribe Newsletter