షారుఖ్‌ నుంచి కృతిసనన్‌ వరకు: దాబూ రత్నాని 2018 క్యాలెండర్‌లో ఎవరు ఏం ధరించారో తెలుసా!

By: KrishnaDivYa P
Subscribe to Boldsky
who wore what for dabboo ratnani's calendar 2018

అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న దాబూ రత్నాని 2018 వార్షిక క్యాలెండర్‌ విడులైంది. బాలీవుడ్‌లో పెద్ద స్టార్ల నుంచి అరంగేట్రం చేసిన తారలు ఇందులో తళుక్కుమన్నారు.ఈ మధ్యనే ఓ పెద్ద వేడుక జరిపి క్యాలెండర్‌ ఆవిష్కరణ జరిపారు. అందులో మీ అభిమాన తారల ముఖచిత్రాలు ఎలా ఉన్నాయో చూస్తారా!

షారుఖ్‌ ఖాన్‌:

షారుఖ్‌ ఖాన్‌:

దాబూ క్యాలెండర్‌లో బాలీవుడ్‌ బాద్షా షారుఖ్‌ ఎప్పుడూ ఉంటాడు. ఈ సారీ అతడు నల్లటి సూట్‌లో మత్తెక్కించే నల్లటి కళ్లతో అదరొట్టాడు. తన ‘అశోక' సినిమాలోని మత్తెక్కించే కళ్లతో పోలిస్తే ఇందులో ఇంకా హాట్‌గా కనిపించాడు. షారుఖ్‌ లుక్స్‌ను చూస్తే ఎవ్వరైనా ప్రేమలో పడిపోవాల్సిందే. మీరేమంటారు!

ఆలియా భట్‌

ఆలియా భట్‌

మీకో విషయం తెలుసా! దాబూ క్యాలెండర్‌-2018లో సొట్టబుగ్గల సుందరి ఆలియా భట్‌ టాప్‌లెస్‌గా కనిపించింది. గతంలోనూ ఆమె ఇలాంగే బోల్డ్‌గా కనిపించిన సంగతి తెలిసిందే. టాప్‌లెస్‌ లుక్స్‌తో అందమైన చేతివేళ్లకు లంబాడీల మాదిరిగా పెద్ద పెద్ద ఉంగరాలు ధరించింది. షూటింగ్‌ టీజర్‌లో బాత్‌రోబ్‌తో కనిపిస్తున్నట్టు ఆలియా పరోక్షంగా సూచన కూడా చేసింది.

ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌

ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌

తన కళ్లతోనే అందరికీ కట్టిపడేస్తుంది ఐశ్యర్యరాయ్‌ బచ్చన్‌. ఆమె అందం అలాంటిది మరి! సెక్విన్‌ క్రిస్టల్స్‌ పొదిన గౌన్‌తో ఆమె దాబూ క్యాలెండర్‌ షూట్‌లో పాల్గొంది. మెరిసిపోయే నలుపు, మైదాకు రంగులో సెక్విన్‌ మెటాలిక్‌ గౌన్‌లో ఐశ్యర్య మనల్ని స్టన్‌ చేసేలా కనిపిస్తుంది.

సోనాక్షిసిన్హా

సోనాక్షిసిన్హా

సెక్విన్‌ రాయల్‌ బ్లూ పార్టీ దుస్తులో హాట్‌హాట్‌గా కనిపించింది సోనాక్షి సిన్హా. మెడలో మెరుపుతీగలను పోలిన నగ, చేతికి బ్రేస్‌లెట్‌.. పైగా సెక్విన్‌ డ్రెస్‌. ఇంకేముంది! అంతకుమించి ఉంగరాల జట్టు.. ఎవరైనా ఆమెను చూస్తే మైమైరిచిపోవడమే అన్నట్టు క్యాలెండర్‌లో సందడి చేసింది. సోనాక్షి డ్రెస్‌ చూస్తే తర్వాత జరిగే పార్టీలో మీరూ అదే కావాలంటారు తెలుసా!

సన్నీ లియోన్‌

సన్నీ లియోన్‌

బాలీవుడ్‌ బ్యూటీ, ఒకప్పటి శృంగార తార సన్నీలియోన్‌ ఫ్లోర్‌క్లీనర్‌ లుక్‌లో సందడి చేసింది. ఇది ఇబ్బందికరమే అయినా ఆమె తన చూపులతో నలుపు రంగు బ్యాక్‌లెస్‌ దుస్తులో గరంగరంగా కనిపించింది. మోకాళ్ల వరకు ధరించిన షూస్‌ ఆమె అందాన్ని మరింత పెంచాయి. షూట్‌ ప్రాపర్టిలుగా ఫ్లోర్‌ మాప్‌ను, బకెట్‌ను ఉపయోగించింది. ఆహ్లాదాన్ని పంచేలా ఆమె జుత్తు ఉండటం విశేషం.

విద్యాబాలన్‌

విద్యాబాలన్‌

‘ఊ లా.. లా ' సుందరి విద్యాబాలన్‌ దాబూ క్యాలెండర్‌లో కాస్త ఘాటుగానే కనిపించింది. మెడ కింద వరకు ఉన్న నలుపు రంగు డ్రెస్‌లో కాస్త ఉద్రేకపరిచేలాగా

ఉంది. ఆమె సెక్సీ లుక్‌కు తోడు ఆమె చూసే చూపులు లాలాజలం తెప్పించక మానవు!

మానుషీ చిల్లర్‌

మానుషీ చిల్లర్‌

మొన్ననే ప్రపంచ సుందరిగా ఎంపికైన మానుషీ చిల్లర్‌ సెక్విన్‌ డ్రెస్‌లోనే సందడి చేసింది. క్యాలెండర్‌ ఆవిష్కరణకు వచ్చిన ఆమె ఫాలుంగీ, షేన్‌ పికాక్‌ సెక్విన్‌ డ్రెస్‌లో హాజరైంది. మెడ కింద వరకు రంగురంగుల్లో ఉన్న ఆమె చిరుగుల డ్రెస్‌ కాస్త హాట్‌నెస్‌ను పెంచింది. దుస్తులకు నప్పే హైలెంగ్త్ బూట్లు ధరించింది.

పరిణీతి చోప్రా

పరిణీతి చోప్రా

క్యాలెండర్‌ షూట్‌ ఫైనల్‌ ఔట్‌పుట్‌లో పరిణీతి చాలా చాలా హాట్‌గా కనిపించింది. ఊరించే ఆమె చిత్రాలు అందరినీ ఆకర్షిస్తాయి. నలుపురంగు జాకెట్‌లో పాదాల ఎత్తుకు సరిపోయే బూట్లతో వింటేజ్‌ కార్‌ను ఉపయోగించి ఎంతో అందంగా కనువిందు చేసింది. పరిణీతి షూటింగ్‌లోనూ అలాగే ఉందట!

కాజోల్‌

కాజోల్‌

ఈ ఏడాది దాబూ క్యాలెండర్‌లో కాజోల్‌ కనిపించింది. ఎప్పుడూ ఉండేదాని కన్నా ఇంకా అందంగా కనిపించింది. కాజోల్‌ కోసం దాబూ ఒక బాత్‌టబ్‌ను ఉపయోగించాడు. ఐతే చాలా విభిన్నంగా ఉంటుంది. అంతకుముందు బాత్‌టబ్‌ను దాబూ పరిణీతి కోసం ఉపయోగించడం విశేషం. మరీ హాట్‌గా కాదు గానీ కాజోల్‌ తన సోయగాలను చక్కగా ఆరబోసింది. రాయల్‌ బ్లూ గౌన్‌లో వజ్రాలు పొదిగిన నెక్లెస్‌తో కమనీయంగా కనిపించింది.

హృతిక్‌ రోషన్‌

హృతిక్‌ రోషన్‌

దాబూ క్యాలెండర్‌లో ప్రతిసారీ కనిపించే మోడల్‌ హృతిక్‌రోషన్‌. ఈ సారి హృతిక్‌ ఫర్ఫెక్షన్‌తో అతికినట్టు కనిపించాడు. మోనోక్రమో హాఫ్‌సూట్‌లో సరికొత్త కేశాలంకరణలో ట్రిమ్‌ చేసుకున్న గడ్డంతో చాలా చాఆ స్టైలిష్‌గా కనిపించాడు.

ఆమిర్‌ఖాన్‌

ఆమిర్‌ఖాన్‌

బాలీవుడ్‌ మిస్టర్‌ ఫర్ఫెక్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ ఈ సారి సాధారణ మోనోక్రోమ్‌ టీతో పెరిగిన గడ్డంతో కనువిందు చేశాడు. అతడిచ్చిన పోజ్‌ కూడా చాలా హాట్‌గా అసాధారణంగా ఉంది. అతడెంత ఫర్ఫెక్టో ఈ సారి క్యాలెండర్‌ లుక్‌లో మరోసారి ప్రదర్శించి ‘జలక్‌' అనిపించాడు.

కృతి సనన్‌

కృతి సనన్‌

ఈ సారి దాబూ క్యాలెండర్‌లో పొడుగుకాళ్ల సుందరి కృతి సనన్‌నే హైలైట్‌ అనిపించేలా ఉంది. కొన్ని చిత్రాల ముందు నిలబడి ఆమె ఇచ్చిన పోజు ఎంత కసిగా ఉంటుందో చెప్పలేం! ఎబ్రాయిడరీ డ్రెస్‌ వేసుకున్న కృతి టాప్‌లెస్‌లో స్థనద్వయానికి కౌబాయ్‌ హ్యాట్‌తో అడ్డుపెట్టుకొని అందరినీ ఉద్రేకరపరిచేలా కనిపించింది. లెథర్‌ బ్రేస్‌లెట్లతో పాటు కింద లేత నీలిరంగు జీన్స్‌ వేసుకుంది.

అమితాబ్‌ బచ్చన్‌

అమితాబ్‌ బచ్చన్‌

బిగ్‌బీ అమితాబ్‌ దాబూ క్యాలెండర్‌లో చాలా బాగున్నారు. వంకాయ రంగు టుక్సెడో సూట్‌తో నీలిరంగు రిఫ్లెక్టర్లతో తెలుపు రంగు బూట్లు ధరించి కనిపించారు. అమితాబ్‌ కోసం సైకిల్‌ను ప్రాపర్టిగా ఉపయోగించారు. అక్కడ తన గంభీర వదనంతో ఉన్న బిగ్‌ బీ పీకూ సినిమాలోని సైకిల్‌ సన్నివేశాన్ని గుర్తుకు తెస్తారు!

టైగర్‌ ష్రాప్‌

టైగర్‌ ష్రాప్‌

అటు అందం ఇటు దేహసౌందర్యం ఉన్న హీరో టైగర్‌ష్రాప్‌. తెలుపు రంగు స్నీకర్స్‌ ధరించి తెలుపు రంగు ట్రౌజర్స్‌లో చొక్కా లేకుండానే కనిపించాడు. ఈ షూటింగ్‌లో దాబూ చెట్టును ప్రాపర్టీగా ఉపయోగించాడు. చెట్లు కింద వేలాడుతున్న కనిపించిన టైగర్‌ ముచ్చటగొలిపాడు.

సిద్ధార్థ్‌ మల్హోత్రా

సిద్ధార్థ్‌ మల్హోత్రా

పుట్టినరోజు తర్వాత సిద్ధార్థ్‌ చాలా హుషారెక్కినట్టు కనిపించాడు. ఒక జత ఏవియెటర్స్‌తో నీలిరంగు, తెలుపు రంగు సూట్‌ను ధరించి వాతావరణాన్ని కాస్త గరంగా మార్చాడు. ఈత కొలను వద్ద తనదైన స్టైల్లో జుకాజీపై కూర్చుని కనిపించాడు.

శ్రద్ధా కపూర్‌

శ్రద్ధా కపూర్‌

దాబూ క్యాలెండర్‌ టాప్‌ లెస్‌లో శ్రద్ధా హాట్‌హాట్‌గా కనిపించింది. స్ట్రాప్‌లెస్‌ నీలిరంగు టాప్‌లో, డెనిమ్‌ షార్ట్స్‌లో షూటింగ్‌లో కనిపించింది. మోతిఫ్‌ పైస్లె ముద్రిం

చిన టాప్‌లో చాలా అందంగా ఉంది. ఇక తుది చిత్రంలో అది మరింత రెట్టింపైంది.

వరుణ్‌ ధావన్‌

వరుణ్‌ ధావన్‌

జీన్స్‌లో చొక్కా ధరించకుండా వరుణ్ ధావన్‌ సందడి చేశాడు. చొక్కా లేకపోవడంతో సూపర్‌ డ్యాషింగ్‌గా కనిపించి అవాక్కయ్యేలా చేశాడు. ఎంతబాగున్నాడో అని ఆశ్చర్యపరుస్తాడు. చొక్కా ధరించకపోవడానికి అతడు సల్మాన్‌ నుంచి ఎప్పుడూ ప్రేరణ పొందుతాడు మరి!

ప్రియాంక చోప్రా

ప్రియాంక చోప్రా

హాలీవుడ్‌లో రాక్‌ చేస్తున్న బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా డాబూ షూటింగ్‌కు రాకుండా ఉండలేదు. ఆమె ఎప్పుడూ శృంగారతారగా ఎంపికైతున్న సంగతి తెలిసిందే. అంత హాట్‌ హాట్‌ భామ క్యాలెండర్‌లో ఎంతబాగుందో తెలుసా! నలుపు రంగు తోలు జాకెట్‌లో సెక్సీ డీప్‌ రౌండ్‌ నెక్‌ బ్లాక్‌ టాప్‌తో ఉద్రేకపరిచేలా సందడి చేసింది.

అభిషేక్‌ బచ్చన్‌

అభిషేక్‌ బచ్చన్‌

దాబూ క్యాలెండర్‌ ఫేవరెట్‌లో అభిషేక్‌ ఒకరు. తెలుపు రంగు ట్రౌజర్‌, టీతో నీలి రంగు జాకెట్‌ వేసుకొని పరుపు మీద నుంచి దూకుతున్న సీన్‌లో అబ్బో! చాలా బాగున్నాడు. ప్రింటెడ్‌ స్నీకర్స్‌లో అతడు కనిపించిన వైనం చాలా బాగుంది. ఇక అతడి వస్త్రధారణను అందరూ ప్రత్యేకంగా గమనిస్తారు.

జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌

జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌

డాబ్‌ క్యాలెండర్‌ షూటింగ్‌ను జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌ చాలా బాగా ఎంజాయ్‌ చేస్తుంది. నలుపు రంగు వర్కౌట్‌ సూట్‌లో ఓ పోల్‌ చుట్టూ తిరుగుతున్నట్టు జిమ్నాస్టిక్‌ స్టైల్లో కనిపించింది. క్యాలెండర్‌ పిక్‌లో ఆమె ఫర్‌ఫెక్ట్‌గా కనిపించింది.

English summary

who wore what for dabbo ratnani's calendar 2018

Dabboo Ratnani's Calendar 2018 is out and here are the final looks. From the biggest Bollywood stars to the newbies in the industry, many of them got featured in Dabboo's most-awaited annual calendar. While the release event took place last night, here are the final calendar looks from the shoot. Let's explore the style books these stars had carried.
Story first published: Saturday, January 20, 2018, 14:00 [IST]
Subscribe Newsletter