For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Saree wearing: చీర ఎలా కడితే బాగుంటుంది? ఇలా ప్రయత్నించి చూడండి

|

Saree wearing: ఆడవాళ్ల డ్రెస్సింగ్ లో చాలా రకాల స్టైల్స్ వస్తుంటాయి. చాలా మంది వాటిని ఫాలో అవుతుంటారు. ఎప్పటికప్పుడు ట్రెండీగా అందంగా కనిపించాలని మహిళలు ప్రయత్నిస్తుంటారు. ఎన్ని డ్రెస్సులు వచ్చినా.. ఎన్ని స్టైల్స్ వచ్చినా.. చీరకు ఉన్న స్థానం మాత్రం చెదిరిపోదు. ఎన్ని వెస్టర్న్ ఫ్యాషన్ వేర్స్ వచ్చినా.. చీరకు ఉన్న ఆదరణ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇక మీదట కూడా తగ్గదు అని ఫ్యాషన్ నిపుణులు చెబుతున్నారు.

చీర కట్టుకున్న ఆడవాళ్లు చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు. భారతీయ సంప్రదాయాన్ని అద్దం పట్టే అలంకరణ చీర మాత్రమే. చాలా మంది మహిళల అందం చీర కట్టులో రెట్టింపు అవుతుంది. అయితే చీర కట్టుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు, మెలకువలు పాటిస్తే ఆ కట్టు మరింత అందంగా ఉంటుంది.

చీర ఎలా కట్టుకోవాలి:

చీర కట్టు అనేది నైపుణ్యంతో కూడుకున్న పని. ఇది అలవాటు ప్రకారం వచ్చే ఓ కళ. చీర కట్టుకునే సమయంలో ఆ కట్టును శ్రద్ధగా చేస్తే కట్టు అందంగా ఉంటుంది. కొంగు, కుచ్చిళ్లు చీర కట్టులో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. సారీ కట్టుకోవడం అనుకున్నంత సులభం మాత్రం కాదు. అలా అని కష్టం కూడా కాదు. ఏ స్త్రీ అయినా తనను మరింత అందంగా కనిపించేలా చేస్తుంది చీర. చీర కట్టుకోవడం ఒకెత్తు అయితే.. దానిని క్యారీ చేయడం మరో ఎత్తు. రోజంతా చీర కట్టు చెదిరిపోకుండా అలాగే చూసుకోవడం అంత తేలిక కాదు. చీర కట్టును కళగా చూసినప్పుడు అందులో ప్రయోగాలు చేయవచ్చు. దానిపై మక్కువ పెంచుకున్నప్పుడు దానిని సరిగ్గా క్యారీ చేయవచ్చు.

చీర కట్టు గురించి ఇక్కడ కొన్ని స్టైల్స్ చూద్దాం.
కొన్ని చీర కట్టు స్టైల్స్:

బెంగాలీ శైలి

బెంగాలీ శైలి

సంజయ్ లీలా బన్సాలీ తీసిన దేవదాస్ తర్వాత బెంగాలీ స్టైల్ చీర కట్టు గురించి దేశం మొత్తానికి తెలిసింది. బాలీవుడ్ లోని అందమైన బాంగ్ నటీమణుల వల్ల ఈ స్టైల్ మరింత ప్రాచుర్యం పొందింది. ఈ బెంగాలీ స్టైల్ చీర కట్టు చాలా సొగసుగా ఉంటుంద. ఈ రకంగా చీర కడితే.. కట్టుకున్న మహిళ అందాన్ని రెట్టింపు చేసి చూపిస్తుంది. హుందాగా కనిపించడంతో పాటు ఆకర్షణగా కూడా ఉంటుంది ఈ స్టైల్. ఈ శైలిని ఎక్కువగా రాజ కుటుంబాలకు చెందిన బెంగాలీ మహిళలు కట్టుకునేవారు. ఈ శైలిలో రెండు చుట్టిన పల్లులు ఉంటాయి. ఈ స్టైల్ ను ఎక్కువగా వైట్, రెడ్ కలర్ అంచుల చీరలు లేదా "లాల్ పెరే షాదా చీర"తో ధరిస్తారు.

మహారాష్ట్ర స్టైల్

మహారాష్ట్ర స్టైల్

చీర కట్టుకునే ఈ స్టైల్‌ను బాలీవుడ్ ఎక్కువగా పాపులర్ చేసింది. ఈ స్టైల్ లో చీర కడితే చాలా సంప్రదాయబద్ధంగా ఉంటుంది. అందాన్ని పెంచే చీర కట్టులో ఇది కూడా ఒక పద్ధతి. ఈ చీరలు కింది భాగంలో ధోతీ ఆకారంలో ఉంటాయి. పల్లు వెడల్పు తక్కువగా ఉండి, ఎడమ భుజానికి చుట్టినట్లుగా ఉంటుంది.

జలకన్య స్టైల్

జలకన్య స్టైల్

ఈ స్టైల్ చాలా ప్రత్యేకమైంది. చీర సాంప్రదాయమైన శైలిలా కనిపించినా... ఈ పద్ధతిలో చీర కడితే చాలా ట్రెండీగా ఉంటుంది. మత్స్యకన్య స్టైల్ లో చీర కడితే ప్రతి ఒక్కరి చూపు వారిపైనే ఉంటుంది. చీరలోనూ హాట్ గా కనిపించాలనుకుంటే ఈ స్టైల్ ప్రయత్నించవచ్చు. అందం, హాట్ నెస్ కలబోతగా ఈ చీర కట్టు ఉంటుంది. పైన మామూలు చీర శైలిలాగే ఉంటుంది. పల్లును తక్కువ వెడల్పుగా చేయాలి. అలాగే కింద ఎక్కువ వెడల్పుగా చీరను మలచాలి. జలకన్యకు కింద వెడల్పుగా ఉన్నట్లుగా చీర కట్టుకోవాలి. ఇది కొద్దిగా కష్టమైన శైలి అయినప్పటికీ... ఒకటీ రెండు సార్లు కడితే కట్టు చక్కగా కుదురుతుంది.

సీతాకోకచిలుక శైలి

సీతాకోకచిలుక శైలి

శిల్పా శెట్టి తన చీర పల్లును పట్టుకునే విలక్షణమైన విధానాన్ని మీరు గమనించారా లేదా ప్రియాంక చోప్రా 'దేశీ గర్ల్' లుక్ మీకు గుర్తుందా? దానినే బటర్ ఫ్లై స్టైల్ అంటారు. తెలుగులో సీతాకోక చిలుక శైలి అని చెబుతుంటారు. లైట్ వెయిట్ చీరతో ఈ స్టైల్ చక్కగా సెట్ అవుతుంది. ఇందు కోసం పల్లును సన్నగా ఉండేలా చూసుకోవాలి. ఈ మధ్య చాలా సినిమాల్లోని పాటల్లో ఈ తరహా చీర కట్టుతో హీరోయిన్లు కనిపించే ఉంటారు.

ముంతాజ్ స్టైల్

ముంతాజ్ స్టైల్

ముంతాజ్ స్టైలింగ్‌ కు ఎప్పుడూ ఫిదా కావాల్సిందే. ఆమె ఒక ఐకానిక్ లేడీ. అలాగే ఆమె ధరించే స్టైల్స్ ఇప్పటికీ, ఎప్పటికీ ట్రెండీగానే ఉంటాయి. బ్రహ్మచారి చిత్రంలోని "అజ్ కల్ తేరే మేరే ప్యార్ కే చర్చే" పాట కోసం ఆమె ధరించి చీర స్టైలే.. ముంతాజ్ స్టైల్. ఈ సినిమాలో పాట కోసం ముంతాజ్ ఆరెంజ్ కలర్ సారీ ఎంచుకుంది. ఆ చీర కట్టు కొద్దిగా కష్టమేనని చెప్పాలి. ఇందులో పల్లును మరీ సన్నగా కాకుండా కొద్దిగా వెడల్పుగా ఉంచాలి. తర్వాత చీరను చుట్టుకునే సమయంలో కొద్దిగా నైపుణ్యం ప్రదర్శించాలి.

English summary

different ways to drape a saree in Telugu

read on to know different ways to drape a saree in Telugu
Story first published: Tuesday, July 19, 2022, 16:00 [IST]
Desktop Bottom Promotion