2017 దుర్గా పూజ కోసం స్పెషల్ ట్రెండ్స్ మీకోసం!

By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

ప్రతి బెంగాలీ రానున్న పవిత్రమైన దుర్గా పూజ సందర్భంగా అతని / ఆమె వారి శైలిలో కొత్త కొత్త ట్రెండ్స్ తో ఫెస్టివల్ లుక్ తీసుకురావడానికి సిద్ధమవుతున్నారని మేము అనుకుంటున్నాము. బెంగాల్ మరియు ఇతర ప్రాంతాలలోని ప్రజలు అద్భుతమైన, లేటెస్ట్ ట్రెండ్స్ కలెక్షన్స్ ఫై అప్పుడే ద్రుష్టి పెట్టారంటే నమ్మండి.

'పూజో 'షాపింగ్ చేయడానికి వెళ్లాలనుకుంటున్నారా? ఆగండి! అయితే మీ షాపింగ్ ని పూర్తిచేసేముందు మీరు ఈ ముఖ్యమైన విషయం గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే. ఫ్యాషన్ అనేది కేవలం చూడటానికి బాగుండటమే కాదు దానితో పాటు కొత్త స్టైల్, న్యూ లుక్ తో ట్రెండ్ ని సృష్టించడం కూడా. కాబట్టి మీ షాపింగ్ మొదలు పెట్టేముందు, ఈ సంవత్సరం 2017 దుర్గా పూజ సందర్బంగా లేటెస్ట్ ట్రెండింగ్ స్టైల్స్ గురించి మీకు చెప్పడానికి మేము సిద్ధంగా వున్నాము. మరి తెలుసుకోవడానికి మీరు రెడీగా వున్నారా మరెందుకు ఆలస్యం చూసేయండి.

ట్రెడిషనల్ లుక్ ను అందించే శారీ డిజైన్స్: నవరాత్రి స్పెషల్

ప్రథమ స్థానంలో ఉన్నటువంటి కొన్ని స్టైల్స్ గురించి ఇక్కడ మీతో పంచుకోవడం జరిగింది.ఈ సంవత్సరం ట్రెండింగ్ లిస్ట్ లో మొదటి స్థానంలో ఉన్నటువంటి కొన్ని అద్భుతమైన మరియు ప్రత్యేకమైన కలెక్షన్స్ గురించి ఇక్కడ చర్చించడం జరిగింది.

మోటిఫ్ ప్రింట్స్

మోటిఫ్ ప్రింట్స్

మోటిఫ్ అనగా ప్రింటింగ్ ప్రక్రియలో ఒక అవుట్ ఫిట్ యొక్క బాడీ మొత్తం అంతా ఒకే డిజైన్ లేదా పాటర్న్ ని అనుసరించడం. మోటిఫ్ ప్రింట్లు నే బ్లాకు ప్రింట్లు అని కూడా పిలుస్తారు, ఈసారి ఈ దుర్గా పూజ సీజన్ హిట్లలో ఇది కూడా ఒకటి.

మోటిఫ్ ప్రింట్స్ అన్ని దుస్తులు దుకాణాల్లో మరియు ఆన్లైన్ షాపింగ్ హబ్ల్లో అందుబాటులో ఉన్నాయి. శారీస్ కి పాంట్స్ కి రేటు మారుతుంది.

గంచా ప్రింట్స్

గంచా ప్రింట్స్

గంచా ప్రింట్స్ గురించి తెలియని వారందరూ, ఇది బెంగాలీ గృహాల్లో విస్తృతంగా ఉపయోగించే ఏకైక చేనేత వస్త్రం. ఇది చాలా మృదువుగా మరియు సులభంగా, తేలికగా ఉంటుంది.

గంచా దుస్తులు డ్రెస్సెస్ నుండి శారీస్ దాక డిజైనర్ల చే తయారుచేయబడతాయి.ఈ సంవత్సరం, దుర్గా పూజ గాంచా ప్రింట్లు అలంకరించకుండా అసంపూర్ణంగా ఉంటుంది.

ఎంబ్రాయిడరీ టస్సార్

ఎంబ్రాయిడరీ టస్సార్

టస్సార్ అనేది సాంప్రదాయిక పట్టు వస్త్రం, ఇది బెంగాల్లో మరియు భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో తయారుచేయబడుతుంది మరియు కొన్ని యుగాల నుండి ఆ ప్రాంతం నుండి శారీస్ బయటకొస్తున్నాయి. ఈ సంవత్సరం, సాధారణ కస్సోర్ పట్టు చీరలు కొంచం భిన్నంగా ట్రెండ్ అవుతున్నాయి. ఎంబ్రాయిడరీ టస్సోర్ సిల్క్ ఈ 'పూజో' కి మంచి ట్రెండీ లుక్ నిస్తాయి మరియు అన్ని వయస్సుల వారు వీటిని ధరించవచ్చు.

బాటిక్ ప్రింట్స్

బాటిక్ ప్రింట్స్

బాటిక్ ప్రింట్స్ బెంగాల్ మరో సాంప్రదాయిక చేనేత వస్త్రం, బాటిక్ ప్రింట్లు టై-అండ్-డై ప్రింట్లు రూపంలో ఉంటాయి మరియు శారీ, కుర్తాస్ లేదా జాకెట్లు వంటి మహిళల దుస్తులతో పాటు ఇది కుర్తాస్ మరియు చొక్కాల వంటి పురుషుల దుస్తులు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. వీరు ఎప్పుడూ ఫ్యాషన్ రంగంలో తమకంటూ ప్రత్యేక స్థానంలో వుంటూ కొత్త ట్రెండ్స్ తో ప్రజలను ఆకట్టుకొంటూ వుంటాయి. ఇవి ముఖ్యంగా 'పుజో'లో ఎక్కువగా ట్రెండ్ అవుతూ కనిపిస్తాయి.

కాంట్రాస్ట్ జాకెట్లు

కాంట్రాస్ట్ జాకెట్లు

శారీకి సరిపడే జాకెట్లతో గత సంవత్సరం ప్రాముఖ్యం చెందింది. ఈ స్టైల్ ఇప్పుడు ఎక్కడా కనిపించదు. ఇప్పుడు కొత్తగా కాంట్రాస్ట్ జాకెట్లు ట్రెండ్స్ లో కి వస్తున్నట్లు అంచనా. చీరలకు వేర్వేరు రంగుల జాకెట్లు వాడటం ఈ సంవత్సరం స్టైల్ లో వుంది మరియు ఇవి మళ్ళీ తిరిగి రావడాన్ని మనందరం ఇష్టపడుతున్నాము.మీరు వివిధ రకాల నైరూప్య ప్రింట్లు యొక్క స్టాక్ ని ఉంచవచ్చు మరియు మీరు వీటిని ఏ చీరతో నైనా మ్యాచ్ చేయవచ్చు. మీరు తీసుకున్నదాని బట్టి మీ లుక్ ఆధారపడి ఉంటుంది.

ఆఫ్ఘన్ జ్యువెలరీ

ఆఫ్ఘన్ జ్యువెలరీ

ఇంతసేపు మనం వస్త్రాల గురించి మాట్లాడుకున్నాం.ఈ సంవత్సరం అత్యంత సుందరమైన ఆభరణాల గురించి మాట్లాడటానికి ఇదే సరైన సమయం. ఈ సంవత్సరం ఆఫ్ఘన్ జ్యువెలరీతో దుర్గా పూజ రాకింగ్ చేస్తుందని మేము విశ్వసిస్తున్నాము. వీటిని చీరలు,కుర్టాలతో మ్యాచ్ చేసుకోవచ్చు మరియు వేరు చేయవచ్చు. ఇంకా వాటిలో కొన్ని మీ దగ్గర లేవనుకుంటా?

ఎందుకు ఆలస్యం వెంటనే కోనేయండి!

English summary

Durga Puja 2017 Will Be All About These Trends

This year, Durga Puja will be all about these trends. Have a look.
Story first published: Friday, September 8, 2017, 8:00 [IST]
Subscribe Newsletter