For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Men Shoes: అబ్బాయిలూ.. ఈ షూ మీ దగ్గర ఉండి తీరాల్సిందే

చాలా మంది మగవారికి షూల్ చాలా ఇష్టం ఉంటుంది. ఈ షూస్ ను మీ కలెక్షన్స్ లో భాగం చేసుకోండి.

|

Men Shoes: షూ ప్రతి ఒక్కరూ వేసుకుంటారు. చాలా మందికి షూ అంటే పిచ్చి ఉంటుంది. రకరకాల, రంగురంగుల షూ కొంటుంటారు. అయితే మగవారి కలెక్షన్స్ లో ఈ షూ మాత్రం తప్పక ఉండాల్సిందే. ఈ పది రకాల షూ ఏ డ్రెస్ మీదకైనా సరిగ్గా సరిపోతాయి.

1. క్యాప్-టో బాల్మోరల్ ఆక్స్‌ఫర్డ్స్

1. క్యాప్-టో బాల్మోరల్ ఆక్స్‌ఫర్డ్స్

ఆక్స్‌ఫర్డ్ షూ నేడు అత్యంత ప్రజాదరణ పొందిన షూ. అన్ని ఆక్స్‌ఫర్డ్‌లు క్లోజ్డ్ లేసింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంటాయి. ఇది డెర్బీ షూ నుండి ఆక్స్‌ఫర్డ్ షూని వేరు చేస్తుంది. ఇంటర్వ్యూలు, వివాహాలు, బ్లాక్-టై ఈవెంట్‌ల కోసం ఆక్స్ ఫర్డ్ షూ చాలా బాగుంటాయి.

2. స్నీకర్స్

2. స్నీకర్స్

బూట్ల విషయానికి వస్తే ప్రతి ఒక్కరి దగ్గర తప్పనిసరిగా ఉండాల్సిన షూ స్నీకర్స్. స్నీకర్లు దాదాపు ప్రతి ఒక్కరి దగ్గరా ఉంటాయి. లెదర్ లేదా స్వెడ్ అప్పర్‌తో క్లాసిక్ జత లో టాప్ స్నీకర్‌లను ప్రతి ఒక్కరికీ ఉండాల్సిందే.

3. వింగ్-టిప్ బ్రోగ్స్ షూస్

3. వింగ్-టిప్ బ్రోగ్స్ షూస్

ఆక్స్ ఫర్డ్ షూ పైన కళాత్మకంగా రంధ్రాలు చేసినట్లుగా ఉంటుంది వింగ్-టిప్ బ్రోగ్స్ షూస్. ఆక్స్ ఫర్డ్ పాత ఫ్యాషన్ అనుకునే వారు ఈ బ్రోగ్స్ ను ట్రై చేయవచ్చు. చూడటానికి చాలా అందంగా, స్టైలిష్ గా కనిపిస్తాయి.

4. చుక్కా బూట్లు

4. చుక్కా బూట్లు

రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ సైన్యం మొదట ఎడారిలో ధరించింది. అందుకే దీనిని డిసెర్ట్ షూ అని కూడా అంటారు. చుక్కా బూట్లు ఒకే తోలు ముక్క నుండి విలక్షణమైన రెండు-భాగాల శైలిని కలిగి ఉంటాయి. బ్రౌన్ లేదా నేవీ వంటి ముదురు రంగులో స్వెడ్ చుక్కా బూట్‌ ను మీ కలెక్షన్స్ లో భాగం చేసుకోవాల్సిందే.

5. డబుల్-మాంక్ స్ట్రాప్ షూస్

5. డబుల్-మాంక్ స్ట్రాప్ షూస్

మాంక్ స్ట్రాప్ బూట్లు 1900ల ప్రారంభంలో ఇంగ్లాండ్‌లో చాలా పాపులర్ షూస్ గా ఉండేవి. సింగిల్ మాంక్ స్ట్రాప్ కంటే డబుల్ మాంక్ స్ట్రాప్ చూడటానికి సెక్సీగా కనిపిస్తుంది.

6. పెన్నీ లోఫర్స్

6. పెన్నీ లోఫర్స్

లోఫర్స్ ను అభిమానించని వారు చాలా అరుదు అనే చెప్పాలి. దాదాపు ప్రతి ఒక్కరి వద్ద లోఫర్స్ ఉంటాయి. వీటిని క్యాజువల్ వేర్ గా వేసుకోవడానికి చాలా బాగుంటాయి. సెమీ ఫార్మల్ లుక్ కోసం వీటిని ట్రై చేయండి.

7. హోల్-కట్ ఆక్స్‌ఫర్డ్స్

7. హోల్-కట్ ఆక్స్‌ఫర్డ్స్

హోల్-కట్ ఆక్స్‌ఫర్డ్ డ్రెస్ షూ గత కొన్ని సంవత్సరాలుగా బాగా ప్రాచుర్యం పొందింది. ఇది బ్యాక్-సీమ్ లేకుండా ఒక దోషరహిత తోలుతో నిర్మించిన సరళమైన, సొగసైన డిజైన్‌ తో వస్తుంది.

8 చెల్సియా బూట్లు

8 చెల్సియా బూట్లు

చెల్సియా బూట్లను ప్యాడాక్ బూట్స్ అని కూడా అంటారు. చెల్సియా బూట్ల సైడ్స్ ఎలాస్టిక్ తో కొద్దిగా పొడుగ్గా ఉంటాయి. వీటిని ధరించడం చాలా సులభం. చెల్సియా బూట్‌లు అన్ని విభిన్న స్టైల్స్‌లో వస్తాయి. నచ్చిన కలర్ ఎంపిక చేసుకుని కలెక్షన్స్ లో భాగం చేయడమే ఆలస్యం.

9. ఎస్పాడ్రిల్స్

9. ఎస్పాడ్రిల్స్

క్లాత్ లేదా కాగితంతో తయారు చేస్తారు ఈ షూస్ ను. కాళ్లు వెచ్చగా ఉండేందుకు ఎక్కువగా ఉపయోగపడతాయి. ఇంట్లోనూ వీటిని వేసుకోవచ్చు.

All Images credits : Amazon

English summary

Essential Shoes for Men in Telugu

read on to know Essential Shoes for Men in Telugu
Story first published:Saturday, July 30, 2022, 17:21 [IST]
Desktop Bottom Promotion