For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Modern lehenga: ప్రస్తుతం ఈ లెహెంగాలదే క్రేజ్ అంతా..

ఎన్నిరకాల లెహంగాస్ ఉంటాయో మీరెప్పుడైనా వెతికారా.. అయితే ఆ జాబితా చాంతాడంత ఉంటుంది కదా. అయితే అందులో కొన్ని లెహంగాలు కాలం చెల్లిపోతే, మరికొన్ని ఎప్పటికీ ట్రెండీగానే కనిపిస్తాయి.

|

Modern lehenga: ఎన్నిరకాల లెహంగాస్ ఉంటాయో మీరెప్పుడైనా వెతికారా.. అయితే ఆ జాబితా చాంతాడంత ఉంటుంది కదా. అయితే అందులో కొన్ని లెహంగాలు కాలం చెల్లిపోతే, మరికొన్ని ఎప్పటికీ ట్రెండీగానే కనిపిస్తాయి. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న లెహంగాలు ఏవి, వాటి స్టైల్ మీకు నప్పుతుందా.. లేదా.. వాటి ఎంబ్రాయిడరీలు, లెహంగా స్టైల్స్, ఏ శుభకార్యానికి ఎలాంటి బాగుంటాయో ఇప్పుడు చెప్పుకుందాం.

Modern lehenga designs in telugu

వివాహాలు, పండుగలు లేదా పార్టీల కోసం లెహంగాలను చాలా మంది ఎంచుకుంటారు. వాటి సొగసు, స్టైల్, హుందాతనం ఎవరినీ అయినా ఇట్టే ఆకట్టుకుంటుంది. లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, ఎత్తుగా ఉన్నా, పొట్టిగా ఉన్నా.. ఎలాంటి శరీరాకృతి అయినా లెహెంగాలు చక్కగా సరిపోతాయి.

1. అనార్కలి లెహంగా

1. అనార్కలి లెహంగా

అనార్కలీ లెహంగా ఎప్పటికీ పాత పడని స్టైల్. అనార్కలీ లెహంగా నిజంగా క్లాసీగా ఉంటుంది. అనార్కలీ లెహంగాల్లోనూ విభిన్న రకాలు ఉంటాయి. మిగతా లెహంగాల్లోకెల్లా అనార్కలీ లెహంగా లేదా అంబ్రెల్లా లెహంగా ఉత్తమంగా ఉంటుంది. వివాహాలు, పండుగల కోసం ప్రింటెడ్, పాస్టెల్స్, సాలిడ్స్, ఎంబ్రాయిడరీ అనార్కలి లెహంగాలను ఎంచుకోవచ్చు. కాలర్ నెక్, స్ట్రాప్ బ్లౌజ్, స్వీట్‌హార్ట్ నెక్, డీప్ నెక్, వి-నెక్, ఫుల్ స్లీవ్‌లు లేదా క్వార్టర్ స్లీవ్ బ్లౌజ్‌లను ఎంచుకోవచ్చు.

2. పెప్లమ్ స్టైల్- లేటెస్ట్ స్టైల్ లెహెంగా

2. పెప్లమ్ స్టైల్- లేటెస్ట్ స్టైల్ లెహెంగా

పెప్లమ్ లెహెంగాలో పెద్ద ఎత్నిక్ ఫ్యాషన్ మూమెంట్ ఉంది. మీరు వధువు అయితే, మీరు ట్రెండీగా కనిపించాలనుకుంటే పెప్లమ్ స్టైల్ లెహంగా సరైన ఎంపిక. ఈ స్టైల్ లెహంగా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. స్కూప్ నెక్, స్టాండ్ కాలర్, వి-నెక్, హై-నెక్, రఫుల్ స్లీవ్‌లు, స్లిటెడ్ స్లీవ్‌లు, ఫుల్ స్లీవ్‌లు లేదా క్వార్టర్ స్లీవ్‌లు దీనిపై బాగుంటాయి.

3. జాకెట్ స్టైల్ లెహెంగా

3. జాకెట్ స్టైల్ లెహెంగా

భారతీయ వివాహాల విషయానికి వస్తే, వివిధ రకాలైన లెహంగా చోలీల కంటే బ్రహ్మాండమైనది ఏదీ లేదు. సొగసైన ఇంకా చిక్ లెహంగాలు అత్యంత అద్భుతమైన శైలి. లెహంగాలలో జాకెట్ స్టైల్ లెహెంగా అత్యుత్తమ రకాల్లో ఒకటి. ఏ శుభకార్యమైనా జాకెట్ స్టైల్ బ్లౌజ్‌తో ఈ లెహెంగాను ప్రయత్నించవచ్చు. స్లీవ్‌లు లేకుండా స్ట్రాప్ బ్లౌజ్, బస్టియర్ బ్లౌజ్, బోట్ నెక్, స్వీట్‌హార్ట్ నెక్ లేదా వి-నెక్‌లను ప్రయత్నించవచ్చు.

4. లేయర్డ్ లెహంగా

4. లేయర్డ్ లెహంగా

లేయర్డ్ లేదా రఫిల్డ్ లెహంగాలు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయి. సాధారణ లెహంగా చోలీకి భిన్నంగా ఉంటుంది లేయర్డ్ లెహంగా. ఇది వెస్ట్రన్ గౌను, ఇండియన్ లెహంగాను కలిపి చేసినట్లుగా ఉంటుంది. ఆఫ్ షోల్డర్, రఫ్ఫ్డ్ స్లీవ్‌లు, ఫుల్ స్లీవ్‌లు, రఫిల్డ్ నెక్ లేదా ప్లీటెడ్ బ్లౌజ్ సరైన కాంబినేషన్.

5. బ్రైడల్ లెహంగా- పెళ్లి కోసం క్లాసిక్ రకాల లెహంగాలు

5. బ్రైడల్ లెహంగా- పెళ్లి కోసం క్లాసిక్ రకాల లెహంగాలు

బ్రైడల్ లెహంగాల ట్రెండ్ ఎప్పటికీ ఉంటుంది. ఆధునిక కాలంలో కూడా వధువులు సాంప్రదాయ దుస్తులలో నిజంగా క్లాసిక్‌గా ఉండాలని కోరుకుంటారు. ఈ భారీ లెహంగాపై డబుల్ దుపట్టా ధరించడం ఇప్పుడు నయా ట్రెండ్. డీప్ నెక్, వి-నెక్, హై నెక్ మరియు స్వీట్‌హార్ట్ డిజైన్ నెక్ వంటి సరికొత్త నెక్ డిజైన్‌లు.

6. కుర్తీ స్టైల్ లెహంగా

6. కుర్తీ స్టైల్ లెహంగా

ఈ రోజుల్లో కుర్తి శైలి చాలా వినూత్నమైన మరియు బహుముఖ శైలి. దీని కోసం మీరు లెహంగాతో కుర్తీని ప్రయత్నించవచ్చు. వాటిలో ఒకటి డిజైన్‌లో భారీగా ఉండాలి. మీరు సింపుల్ కుర్తీని ధరిస్తే తప్పనిసరిగా అలంకరించబడిన లెహంగాతో వెళ్లాలి.

7. అసిమెట్రిక్ లెహంగా

7. అసిమెట్రిక్ లెహంగా

అసిమెట్రిక్ లెహంగాను మోడర్న్ తరహా లెహంగా అని అంటున్నారు. ఇది ఖచ్చితమైన ఇండో-వెస్ట్రన్ రూపాన్ని ఇస్తుంది. పెళ్లి వేడుకలు, రిసెప్షన్ లాంటి శుభకార్యాలకు ఇది సూపర్బ్ గా ఉంటుంది. బ్లౌజ్ ఆఫ్ షోల్డర్, కోల్డ్ షోల్డర్, రఫ్ల్డ్, హాల్టర్ లేదా స్ట్రాప్ ప్యాటర్న్‌లో ఉండాలి.

English summary

Modern lehenga designs in telugu

read on to know Modern lehenga designs in telugu..
Story first published:Wednesday, August 3, 2022, 15:46 [IST]
Desktop Bottom Promotion