For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Monochrome: మోనోక్రోమ్ లుక్ అదిరిపోద్ది.. స్టైల్ కు స్టైల్.. టైం, మనీ సేవ్

|

Monochrome: మహిళలు, యువతులు తమ లుక్ చక్కగా కనిపించేందుకు ఎక్కువ ప్రాధాన్యమే ఇస్తారు. అందంగా, హుందాగా కనిపించేందుకు ప్రయత్నిస్తారు. అలంకరణపై ప్రత్యేకంగా దృష్టి పెడతారు మహిళలు. అందుకే డ్రెస్సింగ్ పై ఎక్కువ సమయం వెచ్చిస్తారు. ఇలా ప్రతీ సారి ఎక్కువ సమయం ఇవ్వలేని పరిస్థితులు ఎదురు కావొచ్చు. ఒక్కోసారి రెడీ కావడానికి చాలా తక్కువ సమయం మాత్రమే ఉండవచ్చు. అలాంటప్పుడు హుందాగా, అందంగా కనిపించడానికి మోనోక్రోమ్ ప్రయత్నించి చూడండి. స్టైల్ కు స్టైల్ గా ఉంటుంది. తక్కువ సమయంలోనే చక్కగా రెడీ కావొచ్చు.

మోనోక్రోమ్ అంటే ఏంటి?

మోనోక్రోమ్ అంటే ఏంటి?

మోనోక్రోమ్ "ఒక రంగు"ని సూచిస్తుంది. మోనోక్రోమటిక్ దుస్తులను సరిగ్గా చేసినప్పుడు. ప్యాటర్న్డ్ డ్రెస్ లేదా స్ట్రైకింగ్ బ్లేజర్ లాగా క్లాసీగా మరియు ఆకర్షణీయంగా ఉంటుంది. వార్డ్‌ రోబ్ ‌ను మోనోక్రోమాటిక్‌ గా ఉంచడం వల్ల దుస్తులను ఎంచుకోవడం సులభంగా ఉంటుంది. మరియు మన ఫ్యాషన్ సెన్స్‌పై ఎటువంటి రాజీ లేకుండా అందంగా కూడా కనిపిస్తుంది.

ఎవరికైనా సరిపోతుందా?

నటి దీపికా పదుకొనే నుండి జాక్వెలిన్ ఫెర్నాడెజ్ వరకు, చాలా మంది ప్రముఖులు ఇప్పుడు మోనోక్రోమ్ డ్రెస్ లపై మక్కువ పెంచుకుంటున్నారు. ఒంటికి సరిపోయే రంగును ఎంచుకోవడమే ఇందులో పెద్ద టాస్క్. ఆ ఒక్కటి అయిపోయిందంటే.. మిగతాదంతా చకచక జరిగిపోతుంది. ఈ ఔట్ ఫిట్ ఎవరికైనా చక్కగా నప్పుతుంది. పై నుండి కింది వరకు ఒకే రంగు దుస్తులు వేసుకోవడం ఇప్పుడు నయా ట్రెండ్ గా మారింది. మీరూ ఓ సారి ట్రై చేసి చూడండి.

మోనోక్రోమ్ ట్రై చేయాలనిపిస్తే, వీటి గురించి తెలుసుకోండి. మోనోక్రోమ్ కే జై అంటారు.

మోనోక్రోమ్ ట్రై చేయాలనిపిస్తే, వీటి గురించి తెలుసుకోండి. మోనోక్రోమ్ కే జై అంటారు.

1. ఎవరికైనా చక్కగా సరిపోతుంది

మోనోక్రోమటిక్ దుస్తులను లేదా ఒకే రంగు దుస్తులను ధరించడం అంటే తల నుండి కాలి వరకు ఎరుపు లేదా నలుపు రంగు దుస్తులు ధరించడం కాదు. మోనోక్రోమటిక్ లుక్ అందం అనేది ఒకే రంగులో ఉండే షేడ్స్ లేదా విభిన్న టోన్‌లను ధరించడంలో ఉంటుంది. కాబట్టి, మీ కళ్ళు, స్కిన్ టోన్ లేదా వెంట్రుకలను బట్టి మీకు సరి పోయే ఒక మంచి రంగు ఉంటుంది. దానిని ఎంచుకుని మంచి ఔట్ ఫిట్ తో మెరిసిపోండి. పైభాగంలోని షేడ్స్ కు సరిపోయే బాటమ్, అలాగే అదే రంగులో కనిపించే యాక్సెసరీలను జత చేయవచ్చు.

2. సమయాన్ని శ్రమను తగ్గిస్తుంది

తమ బిజీ వర్క్ షెడ్యూల్ కారణంగా ఎప్పుడూ హడావిడిగా ఉండే వ్యక్తులు మరియు ఎలాంటి స్టైల్‌తో సెటిల్ అవ్వడానికి ఇష్ట పడని వ్యక్తులు ఈ మోనోక్రోమ్ ల దుస్తులను ఎంచుకోవచ్చు. మోనోక్రోమటిక్ స్టైల్స్ 1950, 60ల కాలం నుండి ఫ్యాషన్‌ రంగంలో ఉన్నాయి. ఇటీవలి కాలంలో సరి కొత్తగా ఫ్యాషన్ రంగాన్ని పలకరిస్తున్నాయి. మోనోక్రోమటిక్ వార్డ్‌ రోబ్ ఉత్తమమైనది. ఎందుకంటే ఇది దుస్తులను చాలా సరళంగా ఉంచుతుంది. ఇది సమయం మరియు శ్రమను తగ్గిస్తుంది. వివిధ రంగులు, ప్రింట్‌ ల దుస్తులను కొనుగోలు చేయవలసిన అవసరాన్ని తగ్గించడం ద్వారా షాపింగ్‌ ను సులభతరం చేస్తుంది.

3. డబ్బు ఆదా అవుతుంది

మోనోక్రోమ్‌ లు అధిక ఫ్యాషన్ స్టైలింగ్ ట్రిక్‌ గా పరిగణిస్తారు. మోనోక్రోమ్ ‌లు మీ ప్రస్తుత దుస్తులలో కొత్త వస్తువులను సులభంగా చేర్చగల ప్రయోజనాన్ని కలిగి ఉంటాయి. మోనోక్రోమ్ లు వేసుకుని చిన్న పాటి మార్పులు చేస్తే కొత్తగా కనిపిస్తాయి ఈ దుస్తులు. బూడిద వంటి ప్రాథమిక రంగు కూడా అనేక టోన్‌ లను కలిగి ఉంటుంది. ఇవన్నీ కలిసి బాగా పని చేస్తాయి. అందువల్ల చిన్న చిన్న వస్తువులు కొనడం ఎందుకులే అనుకునే వారు ఇలా ప్రయత్నించి చూడండి. మీ లుక్ అదిరిపోతుంది. ఈ స్టైల్ చక్కగా నప్పుతుంది.

4. స్టైల్‌ విషయంలో రాజీ అవసరంలేదు

4. స్టైల్‌ విషయంలో రాజీ అవసరంలేదు

మోనోక్రోమటిక్ ఔట్ ఫిట్‌ లు ఈ రోజుల్లో ట్రెండింగ్‌ లో ఉన్నాయి. డిజైనర్లు తమ సొంత కొత్త మోనోక్రోమ్‌ల కలెక్షన్‌ లతో ముందుకు వస్తున్నారు. ఇందులో ఎటు వంటి సందేహం లేదు. సిల్హౌట్ లు, మోనోక్రోమ్ హ్యాండ్ బ్యాగ్ ల నుండి జీన్స్ వరకు, షూల నుండి బ్లేజర్ల వరకు అద్భుతమైన షేడ్స్ అలాగే వెరైటీలు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ఈ మోనోక్రోమ్ లుక్ నిత్య నూతనమైనవి. ప్రస్తుతం మోనోక్రోమ్ ట్రెండ్ నడుస్తోంది. ట్రెండ్ ఉన్నా లేకపోయినా మోనోక్రోమ్ ఎప్పుడైనా వేసుకోవచ్చు.

5. మోనోక్రోమ్ వేసుకుంటే అందరి కళ్లు మీపైనే

మోనోక్రోమ్ లుక్ కోసం స్టైల్ కలిగి ఉండాలి. శరీరాకృతి ఎలా ఉన్నా ఈ మోనోక్రోమ్ లు సూపర్ గా సెట్ అవుతాయి. మోనోక్రోమ్ లో ప్రయోగాలకూ అవకాశం ఉంటుంది. నల్లని స్కర్ట్ వేసుకుంటే దాని మీదకు బూడిద లేదా నలుపు స్కర్ట్‌తో లేదా ముదురు ఆకుపచ్చ స్కర్ట్‌తో లేత ఆకుపచ్చ రంగుతో ఉన్న బాటమ్, యాక్ససరీస్ వేసుకుంటే లక్ బాగుంటుంది. విభిన్న టోన్‌లతో ప్రయోగాలు చేసుకోవచ్చు. ఇలా చేస్తే ఏ కలర్ ఎంత బాగా సూట్ అవుతుందో కరెక్టుగా తెలుస్తుంది.

English summary

Reasons Why You Should Sometimes Go Monochrome in Telugu

read on to know Reasons Why You Should Sometimes Go Monochrome in Telugu
Story first published: Wednesday, July 20, 2022, 16:00 [IST]
Desktop Bottom Promotion