వోగ్ లేటెస్ట్ ఫోటోషూట్ కోసం ఫారెల్ విలియమ్స్ తో తళుక్కుమన్న ఐశ్వర్యా రాయ్ బచ్చన్

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

వోగ్ ఇండియా లేటెస్ట్ ఫోటో షూట్ లో ఐశ్వర్యా రాయ్ బచ్చన్ మరియు ఫారెల్ విలియమ్స్ తళుక్కుమన్నారు. వీరిద్దరూ అత్యంత సుందరంగా ఉన్నారు. ఒక షోల్డర్ పై గిగాంటిక్ ఫ్రిల్స్ కలిగిన బ్లష్ బ్లూ బాడీ కాన్ డ్రెస్ లో ఐశ్వర్య ముగ్ధ మనోహరంగా కనిపించింది. ఈ మధ్యనే రణ్వీర్ సింగ్ తో ముంబైలో హొలీ పండుగను జరుపుకున్న ఫారెల్ ఆ ఇంపాక్ట్ కనిపించేలా కలర్ ఫుల్ స్వెట్స్ లో మెరిసిపోయాడు. ఈ పిక్చర్ లో ఐశ్వర్య, ఫారెల్ జంట కనులవిందుగా ఉంది. ఐశ్వర్య నడుంపై ఫారెల్ చేయి వేయగా ఐశ్వర్య ఫారెల్ స్వెట్ షర్ట్ హుడీను ముచ్చటగా లాగుతుంది.

ఇంకొక పిక్చర్ లో వీరిద్దరూ, బ్లడ్ రెడ్ కలర్ దుస్తులను ధరించారు. ఫారెల్ భుజంపై ఐశ్వర్య చేయి వేసిన ఈ స్టిల్ అభిమానులను ఆకట్టుకుంటోంది. మరొక పిక్చర్ లో వీరిద్దరూ సోలోగా స్టిల్స్ ఇచ్చారు. బ్లూ జాకెట్ లో ఐశ్వర్య మెరిస్తే ఫారెల్ బర్గండీ షర్ట్ లో మెరిశాడు.

Bollywood Beauty Queen Aiswaya Rai Looks Like 16 in Recent Vogue Photoshoot!,

ఫ్యాషన్ స్టేట్మెంట్ కి ప్రతీకగా ఐశ్వర్య నిలుస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. రెడ్ కార్పెట్ కావచ్చు లేదా అవార్డు షో లేదా మరేదైనా ఈవెంట్ కావచ్చు, సందర్భమేదైనా ఐశ్వర్య ప్రత్యేకంగా కనిపిస్తుంది. వోగ్ ఇండియాతో మాట్లాడుతూ "రెడ్ కార్పెట్ ఈవెంట్స్ అనేవి పబ్లిక్ లైఫ్ లో భాగం. ఇది మాకు సుపరిచితమైన అంశం. వాటికి అనుగుణంగా తయారవుతాను. కేన్స్ లో కాస్మటిక్ బ్రాండ్ ను రిప్రెసెంట్ చేస్తాను, ఆ ఎట్మాస్ఫియర్ అనేది క్రియేటివిటీను బయటికి రప్పిస్తుంది. ఫ్యాషన్ ని ఒక ఆర్ట్ లా ఎంజాయ్ చేయాలి. క్రియేటివ్ టీమ్ తో కలిసి ఫ్యాషన్ లో మెరుపును రానివ్వాలి. పర్పుల్ లిప్స్ సమయంలో కూడా అదే జరిగింది. మేము క్రియేటివిటీని ఆస్వాదించాము. ట్రెండ్ కోసం కాదు.

Bollywood Beauty Queen Aiswaya Rai Looks Like 16 in Recent Vogue Photoshoot!

ఇప్పుడు ఫ్యాషన్ స్ప్రెడ్స్ తో పాటు బ్యూటీ ట్రెండ్స్ ను గమనిస్తే కలర్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. క్లాసిక్ తో పాటు ట్రెడిషనల్ ఛాయిస్ లకు నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. అందుకే, ఆ సమయంలో నేను టాకింగ్ పాయింట్ అయ్యాను. అంతమాత్రాన, నేను డిఫెరెంట్ థింగ్స్ ని ప్రయత్నించడం మానను. " అని చెప్పుకొచ్చింది అందాల భామ.

Bollywood Beauty Queen Aiswaya Rai Looks Like 16 in Recent Vogue Photoshoot!

మరోవైపు, ఈ భామ ఫన్నే ఖాన్ చిత్రంతో బిజీగా ఉంది. ఈ సినిమాలో తన రోల్ గురించి మాట్లాడుతూ, " ఫన్నే ఖాన్ లో నా రోల్ కి ప్రాధాన్యం ఉంది. ఈ రోల్ గురించి నేను ఇంప్రెస్ అయ్యాను. కథలో ఈ రోల్ కున్న ప్రాధాన్యత నన్ను ఆకట్టుకుంది. "రాత్ ఆర్ దిన్" యొక్క రీమేక్ కోసం నన్ను అప్రోచ్ అయ్యారు. అలాగే "వో కౌన్ థీ" సినిమా కోసం కూడా నన్ను అప్రోచ్ అయ్యారు. వివరాలు త్వరలోనే మీకు తెలుస్తాయి" అని చెప్పుకొచ్చింది.

Bollywood Beauty Queen Aiswaya Rai Looks Like 16 in Recent Vogue Photoshoot!
Bollywood Beauty Queen Aiswaya Rai Looks Like 16 in Recent Vogue Photoshoot!
Bollywood Beauty Queen Aiswaya Rai Looks Like 16 in Recent Vogue Photoshoot!
Bollywood Beauty Queen Aiswaya Rai Looks Like 16 in Recent Vogue Photoshoot!
Bollywood Beauty Queen Aiswaya Rai Looks Like 16 in Recent Vogue Photoshoot!
Bollywood Beauty Queen Aiswaya Rai Looks Like 16 in Recent Vogue Photoshoot!

Pictures Courtesy - Vogue/Twitter

https://www.filmibeat.com/bollywood/news/2018/aishwarya-rai-bachchan-trolled-vogue-photoshoot-photoshop-fail-fans-ask-where-is-her-leg/articlecontent-pf246228-272806.html

English summary

Bollywood Beauty Queen Aiswaya Rai Looks Like 16 in Recent Vogue Photoshoot!

Bollywood Beauty Queen Aiswaya Rai Looks Like 16 in Recent Vogue Photoshoot!,