దుర్గాపూజ స్పెషల్ ; ఈ ఏడాది షూ ట్రెండ్స్

By: DEEPTHI T A S
Subscribe to Boldsky

దుర్గాపూజ అంటే కేవలం అందంగా కన్పించటానికే కాదు ; సౌకర్యవంతంగా ఉండటానికి కూడా. బెంగాలీలకి “పూజో” అంటే మండపాలలో ఉత్సవాలు, కొత్త వస్త్రాలు, వాటితో పాటు కొత్త చెప్పులు కూడా. కొత్త చెప్పులు గీరుకుపోవటాలు, పుళ్ళు అవటాలు కూడా తెస్తాయి.

చింతిస్తున్నారా? అవసరం లేదు.మీరు పెద్ద ఖర్చులేకుండా ట్రెండీగా ఆకర్షణీయంగా కన్పించవచ్చు. చెప్పులు కరుస్తాయని ఆందోళన లేకుండా దుర్గాపూజలో ఆకర్షణీయంగా కన్పించటానికి మీకోసం అద్భుత ట్రెండ్స్ అందిస్తున్నాం.

తెల్లని స్నీకర్స్

తెల్లని స్నీకర్స్

గతంలో ఎన్నోసార్లు చెప్పినట్లు తెల్ల స్నీకర్లు గ్రహాన్ని ఏలుతున్నాయి. ఈ ఏడాది అన్నిటికన్నా ప్రాచుర్యం పొందిన స్టైల్ ట్రెండ్ ఇవి.పండగ సమయంలో ఒక్కరోజన్నా మీరు ఇవి తప్పక ధరించి బయటకి వెళ్ళాలి. ఇవి కూల్ గా కన్పించటమేకాక, చాలా సౌకర్యవంతంగా ఉంటాయి.

అదేకాక, ఇవి అమ్మాయిలకి మాత్రమేకాదు, అబ్బాయిలకి కూడా అందంగా కన్పిస్తాయి. వీటిని ఒక జత ఉంచుకోవటం మీకెప్పుడూ లాభిస్తుంది.

బ్లింగ్ షూలు

బ్లింగ్ షూలు

జాకెట్లు కానీ షూలు కానీ బ్లింగ్ కొత్త ఫ్యాషన్. ఈ బ్లింగ్ షూలు సరికొత్త ఆకర్షణ మరియు వీటిని మగవాళ్ళు, ఆడవాళ్ళు ఇద్దరూ ధరించవచ్చు. ఇద్దరికీ ఉపయోగపడే ఈ లక్షణం వలన, లక్షలాది మందికి నచ్చుతున్నాయి. ప్రత్యేకంగా పండగప్పుడు ఈ ట్రెండ్ ను మిస్ చేయకండి.

సాక్ బూట్లు

సాక్ బూట్లు

పాశ్చాత్య సంస్కృతి నుంచి వచ్చిన మరొక ట్రెండ్ హీల్స్ తో కూడిన సాక్స్ లేదా సాక్ బూట్లను సూపర్ మోడర్ కెండాల్ జెన్నర్ ధరించి భారత్ లో కొత్త ట్రెండ్ గా మార్చేసారు.

పండగ సమయంలో,వీటిని ధరించి ధైర్యంగా, హీరోయిక్ గా కన్పించండి.

పండగ సమయంలో,వీటిని ధరించి ధైర్యంగా, హీరోయిక్ గా కన్పించండి.

ఇంద్రధనస్సు రంగుల సాండల్స్ ముఖ్యంగా భారతదేశంలో, ఫ్యాషన్ అంటే రంగురంగులన్నీ కలిసిరావటం. ప్రత్యేకంగా పండగలప్పుడు, ఈ ఇంద్రధనస్సు రంగుల సాండల్స్ ట్రెండ్ ఎప్పటికీ వృథాగా పోదు. ఇలాంటి సాండల్స్ ప్రత్యేకత ఏంటంటే వీటిని సాంప్రదాయ, ఆధునిక వెస్ట్రన్ దుస్తులు రెండింటితో ధరించవచ్చు. బాలీవుడ్ తారలందరూ ఈ ట్రెండ్ ను పాటిస్తూ మెరిసిపోతున్నారు ; మీకెందుకు ఆలస్యం?

కిట్టెన్ హీల్స్

కిట్టెన్ హీల్స్

హీల్స్ అంటే అంత నచ్చని వ్యక్తి కూడా సౌకర్యంగా వేసుకోగలిగినవి సన్నని హీల్స్ అయిన కిట్టెన్ హీల్స్. హీల్స్ అంటే ఇష్టమున్నవారు మండప ఉత్సవాలలో, పాదాలపై అంత ఒత్తిడిలేకుండా వేసుకోవచ్చు. కానీ మా సలహా ఏంటంటే వీటిని వేసుకుని నగరమంతా ఉన్న మండపాలకి తిరగకండి. బెంగాలీలు అది కూడా చేయగలరని మాకు తెలుసు.

గ్లేడియేటర్లు

గ్లేడియేటర్లు

గ్లేడియేటర్లు మళ్ళీ ట్రెండ్ లోకి వచ్చి ఫ్యాషన్ ప్రపంచాన్ని ఏలుతున్నాయి. పండగలప్పుడు ఇవి వేసుకోవడం మంచి ఆలోచన ఎందుకంటే అవి సౌకర్యంగానే కాదు, మిమ్మల్ని సెక్సీగా కన్పించేలా చేస్తాయి. మా సలహా ప్రకారం, పొడుగ్గా ఉన్న అమ్మాయిలందరూ వీటిని వేసుకుంటే మీ కాళ్ళను పొట్టిగా కన్పించేలా చేస్తాయి. అదే పొట్టిగా ఉన్నవారు వేసుకుంటే నష్టమే.

English summary

Durga Puja Shoe Trends, Durga Puja Style Tips 2017, This Year Durga Puja Fashion, What To Wear This Durga Puja, Durga Puja Fashion Trends 2017, Durga Puja 2017, Shoe Trends 2017,దుర్గా పూజ షూ ట్రెండ్స్, దుర్గా పూజ స్టైల్ చిట్కాలు 2017

Wear the trending shoes with comfort during this Durga Puja. Have a look.
Story first published: Friday, September 15, 2017, 12:20 [IST]
Subscribe Newsletter