#గోబేర్ఫుట్ : నిరసన తెలియజేసే విధానాలు భోదిస్తున్న క్రిస్టీన్ స్టివార్ట్

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

ప్రపంచ గుర్తింపు యొక్క ఫ్యాషన్ మరియు చలన చిత్ర కార్యక్రమాలు మార్పు, తిరుగుబాటు మరియు బలమైన సిద్ధాంతాలకు వేదికగా కూడా ఉన్నాయి; అత్యంత సృజనాత్మక జోడించి ముందుకు అడుగులు వేసేలా ఈ కార్యక్రమాలు దోహదపడుతున్నాయి కూడా. అయితే కొన్ని సంవత్సరాలుగా, ఇటువంటి కార్యక్రమాలు పాప్రాజి (చలనచిత్ర) సంస్కృతిలో భాగమయ్యాయి మరియు వాటి యొక్క సారాంశం మాత్రం షట్టర్బగ్స్ కెమెరాల లోపల క్షీణిస్తున్నాయి.

ప్రతి సంవత్సరం, ఎంతో హైప్ చేయబడుతున్న, ఫాషన్ రియట్స్ ను చూస్తున్నాం. కానీ వీటి గురించి మీరు ఆలోచించినప్పుడు, అసలు ఇక్కడ ప్రధాన పాయింట్ ఏమిటి ? అనే ప్రశ్న తలెత్తుతుంది.

#GoBarefoot: Let Kristen Stewart Teach You How To Protest

PC: Instagram@teamlouboutin

మార్లిన్ డీట్రిచ్, మార్లిన్ మన్రో, ఆడ్రీ హెప్బర్న్, ఫ్రిడా కహ్లో వంటి ఫ్యాషన్ ఐకాన్లు ఫాషన్ రూల్స్ ని బూడిదగా మార్చి, సరికొత్త ఫాషన్ ప్రపంచానికి నాంది పలికేలా, సరికొత్త ఫాషన్ రూల్స్ పుస్తకాలలో పొందుపరచేలా అడుగులు వేస్తున్నారు. నిజానికి అవి తర్వాతి కాలంలో అనేకమంది ఫాషనిస్టాలకు బంగారు పుస్తకాలుగా అభివర్ణించబడ్డాయి కూడా.

ఏది ఏమైనా, ఫ్యాషన్ మరియు చలన చిత్ర కార్యక్రమాలు ఫ్యాషన్ రూపురేఖలను ప్రోత్సహించేవిగా మారాయి అనడంలో తప్పే లేదు. ఇప్పుడు జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కూడా అనేక సంవత్సరాలుగా ఇలాంటి ఫాషన్ పోకడలకు నిలయంగా ప్రజలందరి మనసులో తన స్థానాన్ని సంపాదించింది కూడా. ప్రపంచ వ్యాప్తంగా, వారి అభిమాన నటుల యొక్క అవాంట్ - గార్డే రెడ్ కార్పెట్ ప్రదర్శనలకై ఎదురుచూస్తున్న ప్రజలకు కేన్స్ సరైన వేదిక అనడంలో ఆశ్చర్యమే లేదు.

ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రోత్సవాలలో ఒకటిగా అభివర్ణించబడిన, కేన్స్ చలన చిత్రోత్సవం ప్రస్తుతం జరుపబడుతుంది మరియు దాని ఖచ్చితమైన నిబంధనలలో భాగంగా ఉన్న 'హీల్స్ – ఓన్లీ’ అనే నిబంధన మాత్రం కళాకారులు మరియు అతిథుల యొక్క విమర్శలు మరియు కోపాలను ఎదుర్కొంటూ ఉంది. 2016 లో, నటి జూలియా రాబర్ట్స్ ఈ చలన చిత్రోత్సవంలో ఈ అన్యాయమైన నిబంధనకు నిరసనగా రెడ్ కార్పెట్ మీద పాదరక్షలను విడిచి, బేర్ ఫుట్ తో నడిచి వెళ్లారు.

ఈ సంవత్సరం, 'ట్విలైట్' స్టార్ అయిన క్రిస్టెన్ స్టీవర్ట్ వంతైంది. ఆమె తన క్రిస్టియన్ లౌబౌటిన్ పంప్ పాదరక్షలను విడిచి బేర్ ఫుట్ తో మెట్లెక్కి సంచలనానికి, సరికొత్త వివాదానికి, ఆలోచనలకు కేంద్రబిందువుగా మారారు. గ్లోబ్ చుట్టుపక్కల ఉన్న ట్విట్టరాటి మరియు ఫాషన్ పోలీస్ సంబంధిత ప్రముఖులు, జర్నలిస్ట్లు స్టీవర్ట్ యొక్క ఈ చర్య స్వేచ్చకు సంకేతంగా ప్రశంసలను ఇచ్చారు కూడా.

స్టెవార్ట్ ఎప్పుడూ 'హీల్స్ - ఓన్లీ' విధానానికి వ్యతిరేకంగా తన భావాలను వ్యక్తపరుస్తూ ఉంటుంది. తద్వారా రెడ్ కార్పెట్ మీద తన భావాన్ని ఇలా ప్రదర్శించింది. బ్లాక్లాన్స్మన్ ప్రీమియర్ చిత్రం ప్రదర్శనలో భాగంగా విచ్చేసిన ఈ నటి చిత్ర ప్రారంభోత్సవానికి ముందుగానే, "ఈ చర్యలను , నిబంధనలను తక్షణమే మార్చాలి, మీరు నన్ను అడగడం కాదు, నిబంధనలు మార్చమని వాళ్లకు తెలియజేయండి” అని తన స్వరాన్ని వినిపించారు.

మహిళలకు ప్రపంచంలో ఎక్కడ కూడా స్వేచ్చ లేదని ఇలాంటి నిబంధనల వలనే ప్రపంచానికి తెలుస్తాయి. కానీ ఈ నిబంధనలు మా స్వేచ్చకు భంగం కలిగించేలా ఉండకూడదు అని అనేకమంది తమ గద్గద స్వరాలను వినిపిస్తూనే ఉన్నారు. సునీతా కృష్ణన్, మలాలా వంటి వారు తమ తమ చర్యల ద్వారా సాంఘిక చైతన్యాన్ని తీసుకువచ్చే దిశలో పావులు కదుపుతున్నా కూడా, అనేకమంది ఇంకా ఆడవారిని అవహేళన చేస్తూ నిబంధనలు విధిస్తూ పంజరంలో చిలుకల లా చేస్తున్నారు. పంజరంలో చిలుకలు అందంగానే ఉంటాయి, కానీ అవి స్వేచ్చగా విహరిస్తేనే మరింత అందంగా ఉంటాయి. ఆ స్వేచ్చకు సంకెళ్ళు వేస్తే మా గొంతులు ఇలాగే మోగుతాయి అంటూ కొందరు మహిళలు ముందుకు అడుగులు వేస్తున్నారు. ఏ రంగం చూసినా అవమానాలు చీత్కారాలు, వెర్రి చూపులు వెకిలి చేష్టల మద్యనే మహిళలు ఇంకనూ జీవనాన్ని అత్యంత దుర్భరంగా కొనసాగిస్తున్నారంటే, దీనికి కారణం ఏమిటి? ఆఖరికి ప్రపంచానికి సుపరిచితులైన వారికి కూడా ఇలాంటి నిబంధనలు ఉన్నాయి అంటే, సామాన్యుల గతేమిటి అన్న ప్రశ్నకు, స్టీవార్ట్ ఇచ్చిన సమాధానం అనేకమందికి చెంప పెట్టుగా తోచింది. క్రిస్టిన్ స్టీవార్ట్ చేసిన ఈ చర్యకు, ప్రపంచం మొత్తం ప్రశంసల జల్లు కురిపిస్తూ ఉంది అంటేనే అర్ధమవుతుంది, ఇంకా ఎందరు ఇలాంటి నిబంధనలకు బలవుతున్నారో అని. ఏది ఏమైనా స్టీవార్ట్ తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం మాకు సబబుగానే తోచింది.

ఇది సరైన నిరసన అని మీరు అనుకుoటున్నారా ? అయితే క్రింద వ్యాఖ్యల విభాగంలో మాకు చెప్పండి. మీకు ఈ వ్యాసం నచ్చినట్లయితే, మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి ఆసక్తికర అప్డేట్స్ కోసం మా పేజీని తరచుగా సందర్శిస్తూ ఉండండి.

English summary

#GoBarefoot: Let Kristen Stewart Teach You How To Protest

'Twilight' fame Kristen Stewart rippled a wave of controversies, as she pulled off her Christian Louboutin pumps and climbed up the stairs barefoot. Fashion police around the globe hailed this move by Stewart as she brought back meaning to a much-talked-about event. Stewart has been a vocal critic of the 'Heels Only' policy for women at red carpets.
Story first published: Wednesday, May 16, 2018, 14:30 [IST]