Latest Updates
-
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్గా చేసుకునే పంచకజ్జాయ.! -
మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి -
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.! -
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా.. -
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! -
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు! -
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్!
మళ్లీ మోడ్రన్ అమ్మాయిలా మారిపోయిన జబర్దస్త్ యాంకర్ అనసూయ..
అనసూయ మరోసారి మెరుపుతీగలా మెరిసిపోవడమే కాక అందంగా నవ్వుతూ మరింత క్యూట్ గా కనిపించింది.

అనసూయ భరద్వాజ్ అనే కన్నా జబర్దస్ అనసూయ అంటేనే అందరూ గుర్తుపడతారు. ఇష్టపడతారు. అంతలా పాపులర్ అయిన అనసూయ సందర్భానుసారంగా బంగారు బొమ్మలా ధగధగ లాడుతూ మెరిసిపోతుంటుంది. ఫ్యాషన్ విషయంలోనూ అనసూయ అందరికంటే ఒక అడుగు ముందే ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్ ను ఫాలో అవుతుంది. అందరికంటే అనసూయ బెస్ట్ అనిపించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది.
అనసూయ భరద్వాజ్ 34 ఏళ్ల వయసులోనూ తన వాక్చాతుర్యం, పట్టుదల, నిర్ణయాలు మరియు ప్రతిభతో బుల్లితెరపైనే కాకుండా వెండి తెరపైనా ఓ వెలుగు వెలుగుతోంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన అనసూయ ఇప్పటికీ ఈ తరం హీరోయిన్లకు గట్టి పోటీనిస్తుంది. ఫ్యాషన్ విషయంలో అయితే మరీ 20 ఏళ్లలోపు అమ్మాయిలా కనిపించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తుంది. కానీ అనసూయాపైనా అందరి హీరోయిన్లకు వచ్చే రుమార్స్ వచ్చాయి. అవి ఎంత వరకు నిజం అన్నది తేలాల్సి ఉంది.

1) అనసూయ ఒకసారి పూర్తి మోడ్రన్ అమ్మాయిలాగా కనిపిస్తుంది. మరోసారి తెలుగింటి ఆడపిల్లలా అందమైన చీర కట్టు, బొట్టుతో పాత తరం అందగత్తెలను గుర్తు చేస్తుంది. తాజాగా ఈ టాలీవుడ్ అందాల భామ ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో జీన్స్ ప్యాంట్, టీషర్ట్ వేసుకొని రకరకాల ఫోజులిచ్చింది.

2) ఆమె డ్రస్ ను ఒకసారి పరిశీలిద్దాం. బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ ధరించిన అనసూయ టాప్ ను స్కై బ్లూ కలర్ టీషర్ట్ తో కవర్ చేసింది. అసలే చాలా హైట్ గా కనిపించే అనసూయ ఈ ఫొటోలో హై హీల్స్ చెప్పులను ధరించి మరింత ఎత్తు కనబడే ప్రయత్నం చేసింది.
మొత్తానికి ఈ డ్రస్సులో అనసూయ మరోసారి మెరుపుతీగలా మెరిసిపోవడమే కాక అందంగా నవ్వుతూ మరింత క్యూట్ గా కనిపించింది.
ఈ ఫొటోకు లైవ్ టు లాఫ్.. లాఫ్ టు లైవ్ అని ట్యాగ్ లైనును కూడా జత చేసింది. ఇక ఈ ఫొటోను చూసిన అనసూయ అభిమానులు ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

4) కొందరు నెటిజన్లు నైస్, బ్యూటిఫుల్ అని కామెంట్స్ చేస్తుంటే..ఇంకొందరు వెరైటీగా అత్తయ్య అని, లాఫింగ్ స్టార్ అని, లవ్ లీ బేబీ అని కామెంట్స్ చేస్తున్నారు.

5) మిగిలిన వారు వెరైటీ స్టిక్కర్లతో కామెంట్స్ చేస్తే ఒక్క నెటిజన్ మాత్రం భిన్నంగా స్పందించారు. అనసూయను జంగిల్ బిల్లి (అడవి పిల్లి)తో పోల్చాడు. ఎక్కడో మైదానంలో పచ్చని చెట్ల మధ్య ఈ ఫొటోను షేర్ చేయడంతో అతను అలా కామెంట్ పెట్టి ఉంటాడని అందరూ అంటున్నారు.

6) చివరిగా ఆమె చెవి రింగులను చూస్తే మతిపోతుంది. ఆమె చెవి రింగులను చమత్కారంగా, పెద్దని గుండ్రంగా చెవి రింగులను ధరించింది. ఇవి కూడా అనసూయ అందాన్ని పెంచడంలో మరింత దోహదపడ్డాయి.కాలేజీ విద్యార్థినులు ఎక్కువగా ఇష్టపడే ఈ ఫ్యాషన్ డ్రస్ ను అనసూయ ఎంత స్టైలిష్గా మార్చేసిందో ఈ ఫొటోలలో చూడండి.

7) ఏది ఏమైనా అనసూయ ఫ్యాషన్ ట్రెండింగ్ లో ముందంజలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఆమె అచ్చం ర్యాంప్ పై ఎలాంటి ఫోజులిస్తారో ఇక్కడ కూడా అదే ఫోజులిచ్చి కుర్రకారును మరోసారి ఉత్సాహపరిచింది.

8) అమ్మాయిలంతా ఎంతగానో ఇష్టపడే జీన్స్ కు టీషర్ట్ కాంబినేషన్ మంచిదని మీకు తెలుసా? బ్లూ జీన్స్ కు ఎప్పుడూ బ్లాకే కాదు అప్పుడప్పుడు అనసూయ ధరించిన స్కై బ్లూ కలర్ టాప్ ని చేసి ధరించి, మంచి హెయిర్ స్టైల్, బిగ్ ఇయర్ రింగ్స్ తో పూర్తి మోడ్రన్ గా ఎలా మెరిసిపోవాలో అనసూయను చూసి నేర్చుకోండి.



Click it and Unblock the Notifications
