Just In
- 11 hrs ago
కడుపులో పిండం ఆరోగ్యకరమైన అభివృద్ధికి విటమిన్ A ఆహారాలు చాలా అవసరం !! లేదంటే తల్లి బిడ్డకు అంధత్వం..
- 12 hrs ago
ఈ సమయంలో గ్రీన్ టీ తాగడం వల్ల మీకు చాలా ప్రమాదాలు వస్తాయి ... చూడండి మరియు త్రాగండి ...!
- 13 hrs ago
కుంభరాశిలోకి శుక్రుడి సంచారంతో, ఈ రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు...!
- 14 hrs ago
మగువలలో అందంతో పాటు అవి ఉంటేనే మగాళ్లు ఈజీగా అట్రాక్ట్ అవుతారట...!
Don't Miss
- News
పాకిస్తాన్‌కు ఎఫ్ఏటీఎఫ్ షాక్... మళ్లీ గ్రే జాబితాలోనే... కొత్త డెడ్ లైన్ ఎప్పటివరకంటే...
- Finance
Gold price@రూ.46,150: రూ.10,000 కంటే ఎక్కువ తగ్గిన పసిడి ధరలు
- Movies
‘మోసగాళ్లు’ సీక్రెట్స్ .. స్టోరీ, ట్విస్ట్‌లు, బడ్జెట్ అన్నీ చెప్పేసిన మంచు విష్ణు!
- Sports
India vs England: చెలరేగిన స్పిన్నర్లు.. భారత్ ఘన విజయం!
- Automobiles
50,000వ ఎమ్‌జి హెక్టర్ విడుదల; దీనిని తయారు చేసిన వారంతా మహిళలే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పబ్ జీ ఫ్యాషన్ దుస్తులను మీరు ట్రై చెయ్యండి.. ట్రెండీగా కనిపించండి..
ఈరోజుల్లో యువత ఫ్యాషన్ పై ఎంతగా ఆసక్తి చూపుతున్నారో అందరికీ తెలిసిందే. రోజురోజుకు మార్కెట్లో ట్రెండీ ఫ్యాషన్ దుస్తులు అందరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి. మనం కొత్త ఫ్యాషన్ ను ఫాలో అయ్యేందుకు సినిమాలను, స్టోర్ట్స్ స్టార్లను చూసి ఫాలో అవుతుంటాం. వారు వేసుకునే కొన్ని విభిన్నమైన దుస్తులు ప్రస్తుతం ట్రెండింగ్ గా మారుతున్నాయి. ఇక మరో కొత్త దాని నుండి కూడా ఫ్యాషన్ ప్రేరణను పొందొచ్చు. అదేంటంటే పబ్ జీ. అదేంటి పబ్ జీ అంటే గేమ్ కదా? దీనికి ఫ్యాషన్ కు లింకేంటి అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీని పూర్తిగా చూడండి.. లేటెస్ట్ ఫ్యాషన్ దుస్తులు ధరించి ట్రెండింగ్ గా మారండి..
ప్రస్తుతం ఉన్న నాగరిక ప్రపంచంలో ఫ్యాషన్ అనేది ఏ మూల నుండి అయినా పుట్టుకురావచ్చు. అలాగే పబ్ జీ మూలాల్లో కూడా ఫ్యాషన్ ఒకటిగా ఉంటుందని ఇప్పటికే కొంతమంది గ్రహించింటారు. అయితే అలాంటి ఫ్యాషన్ అండ్ స్టైలిష్ దుస్తులు కొన్ని అసాధారణంగా ఉన్నాయి. అవి ఏంటో.. అందులో ప్రత్యేకతలున్న ఫ్యాషన్ దుస్తులను ఒకసారి పరిశీలిద్దాం.

2) పింక్ ర్యాప్..
చాలా మంది యంగ్ లేడీస్ కీ పింక్ కలర్ అంటే బాగా ఇష్టం. పూర్తి స్లీవ్ నాచ్ - లాపెడ్ మిడ్ బ్లష్ పింక్ డ్రెస్ లో యానిమేటెడ్ లేడీ ఫోటో కనిపిస్తోంది కదా. ఆమె పింక్ ర్యాప్ డ్రెస్ లో రెండు సైడ్ పాకెట్స్ కూడా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఆమె దుస్తులు చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాయి. అందుకే ఈ ఫొటోలో మాదిరిగా మీరు రెడీ అవ్వాలనుకుంటున్నారా అయితే ఓసారి ట్రై చెయ్యండి. ట్రెండింగ్ గా కనిపించండి.

3) లెథల్ బటర్ ఫ్లై సెట్..
సీతాకోకచిలుక అంటే స్కూల్ డేస్ నుండే అందరూ బాగా ఇష్టపడతారు. పైన ఉన్న యానిమేటెడ్ ఫొటోను ఒక్కసారి పరిశీలిస్తే కాలర్ ఫుల్ స్లీవ్ బటన్డ్ టక్-ఇన్ షర్ట్ మరియు మినీ స్కర్ట్ ఉన్నాయి. షర్ట్ స్లీవ్ లపై బ్లాక్ కలర్ ఆకట్టుకుంటుంది. ఈ దుస్తులలో ఆసక్తికరం ఏమిటంటే ఇది ఎత్తైన తైస్ వరకు బ్లాక్ షూస్ రూపంతో అందరినీ తెగ ఆకట్టుకుంటోంది.

4) ట్రెడిషనల్ డ్యాన్సర్ సెట్..
డ్యాన్స్ ప్రియుల కోసం పబ్ జీ నుండి ప్రేరణ పొందిన ట్రెడిషనల్ డ్రెస్ ఒకటి ఈ మధ్యన యాప్ లో తెగ సందడి చేస్తోంది. ఈ ఫొటోలోని మహిళ వైట్ లేస్ అంచు, నెక్ లైన్ సగం గ్రీన్ బ్రాలెట్ ను ధరించడంతో కాంబినేషన్ కరెక్ట్ గా సెట్ అయ్యింది. ఈ డ్రెస్ కు తగ్గట్టు జ్యువెలరీ కూడా బాగానే సెట్ చేశారు.

5) ఆవో దాయ్..
ఈ పదం ప్రాథమికంగా వియత్నాం నుండి వచ్చింది. ఈ ఫొటోలో ఉన్న మహిళ ఆ డ్రెస్ నే ధరించింది. ఈ డ్రెస్ చాలా సింపుల్ గా కనిపిస్తోంది. ఇది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో కనిపిస్తోంది. వివాహం లేదా ఏదైనా ఇతర శుభకార్యాలకు, పండుగలకు ఈ డ్రెస్ చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది. సో ఈ దసరా పండుగకు మీరు ట్రై చేసి చూడండి.

6) సాధారణ రోజుల్లోనూ వేసుకునే డ్రెస్..
ఈ ఫొటోలో ఉండే డ్రెస్ అయితే సాధారణ రోజుల్లో మీరు ధరించవచ్చు. దీన్ని ప్రతిరోజూ కూడా వేసుకోవచ్చు. ఈ ఫొటోలోని మహిళ మూడు-నాలుగు స్లీవ్ రౌండ్ కాలర్, పింక్-వైట్ హారిజంటల్ స్ట్రిస్ట్ టీషర్ట్ ను ధరించింది. దీనికి చిన్న డెనిమ్ బ్లూ కలర్ ను కూడా యాడ్ చేసింది. బ్లాక్ షూస్ కూడా ఆమె రూపాన్ని మరింత మెరుగుపరిచాయి. మీకు ఒకవేళ బ్లాక్ షూ నచ్చకపోతే వైట్ షూస్ అయినా ట్రై చేయొచ్చు.

7) బ్లింగ్ సెట్
మీరు వీకెండ్ కానీ లేదా ఇతర డిస్కో పార్టీల కోసం రాకింగ్ డ్రెస్ కోసం చూస్తున్నట్లయితే మీరు ఈ దుస్తులను ట్రై చేయ్యొచ్చు. ఈ ఫొటోలోని మహిళ పఫ్-స్లీవ్ క్రాప్ గోల్డెన్ బెలూన్ కోట్ తో యాడ్ చేసి ఉన్న ఆఫ్-వైట్ కలర్ బ్రాలెన్ స్పోర్ట్ చేసింది. గోల్డ్ కోట్ వెనుక భాగంలో ఓ టోపీ కూడా ఉంది. గోల్డ్ కలర్ షూస్ కూడా చాలా వైరెటీగా ఉన్నాయి. ఇవి మీరు ట్రై చేస్తే అందరిలోనూ మీరే ప్రత్యేకంగా కనిపిస్తారు.

8) స్మూత్ హిట్ మ్యాన్ సెట్..
మీరు ఏదైనా అధికారిక సమావేశాలు లేదా సాధారణ సమావేశాల కోసం ప్యాంటు, షూటును సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీకు ఎల్లప్పుడూ మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఒకే సమయంలో ప్రొఫెషనల్ మరియు అధునాతనంగా కనిపిస్తారు. ఈ ఫొటోలో వైట్ ప్యాంట్ సూట్లో, తన వైట్ బ్లేజర్ ను వాసికోట్ తో జత చేశారు. ఇదేకాకుండా మీరు డిఫరెంట్ కలర్స్ ట్రై చేయొచ్చు. ఇవన్నీ పబ్ జీ ప్రేరేపిత డ్రెస్సులే. ఇవన్నీ మీరు మీ లైఫ్ లో ట్రై చేయొచ్చు. ఈ పబ్ జీ డ్రెస్సులపై మీరేమి అనుకుంటున్నారో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్స్ విభాగంలో మాకు తెలపగలరు.