ఆస్కార్ అవార్డ్స్ 2018: జెన్నిఫర్ లారెన్స్ చేతిలో వైన్ గ్లాస్ పట్టుకుని.. గౌన్ పైకెత్తి ఏం చేసిందంటే

Written By:
Subscribe to Boldsky

ప్రపంచంలో అతి పెద్ద సినీ పండుగ అంటు అందరికీ గుర్తుకొచ్చేంది ఆస్కార్ అవార్డుల పండుగ. సినీ ఇండస్ట్రీలోని హీరో, హీరోయిన్స్ తో పాటు ప్రతీ టెక్నీషియన్ జీవితంలో ఒక్కసారైనా ఆస్కార్ అందుకోవాలని పరితపిస్తారు.

అంగరంగ వైభవంగా

అంగరంగ వైభవంగా

ప్రతి ఏడాది ఎంతో ఘనంగా జరిగే ఆస్కార్ పండుగ ఈ సారి లాస్ ఏంజెల్స్ లో ఉన్న డాల్బీ థియేటర్ లో అంగరంగ వైభవంగా జరుగుతోంది. 90వ ఆస్కార్ అవార్డుల వేడుకకి ప్రముఖ అమెరికన్‌ టెలివిజన్‌ హోస్ట్ జిమ్మీ కెమ్మెల్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

చాలా హైలెట్స్

చాలా హైలెట్స్

అయితే ఆస్కార్ 2018 అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో చాలా హైలెట్స్ ఉంటాయి. అందులో భాగంగానే ఒక హైలెట్ ఆస్కార్ అవార్డ్స్ లో చోటుచేసుకుంది.

చేతిలో వైన్ గ్లాస్ పట్టుకుని

చేతిలో వైన్ గ్లాస్ పట్టుకుని

చేతిలో వైన్ గ్లాస్ పట్టుకుని తాను వేసుకున్న డ్రెస్ ను కాస్త పైకి సర్దుకుని కుర్చీలను దాటుతూ వీలైతే కుర్చీలను జంప్ చేయడానికి కూడా రెడీ అయిన ఆ అమ్మడు అందరినీ ఆకర్షించింది.

హృదయాలను కొల్లగొట్టింది

హృదయాలను కొల్లగొట్టింది

జెన్నిఫర్ లారెన్స్ అందరి హృదయాలను కొల్లగొట్టింది. కాస్త నలుపు గోల్డ్ డియోర్ రంగులో ఉండే గౌను ధరించి ఆస్కార్ వేడుకలో ఆమె ప్రవేశించిన తీరు అందరినీ మైమరిపించింది.

సీట్లను జంప్ చేసుకుంటూ

సీట్లను జంప్ చేసుకుంటూ

తన సీట్లో వెళ్లి కూర్చొనేందుకు ఏకంగా సీట్లను జంప్ చేసుకుంటూ వచ్చింది. ఆ సమయంలో అక్కడున్న కెమెరా కళ్లు మొత్తం ఆమె అందాన్ని క్యాప్చర్ చేయడానికి తహతహలాడాయి.

ఆమెను చూస్తూ ఉండిపోయారు

ఆమెను చూస్తూ ఉండిపోయారు

ఒక చేతిలో వైన్ గ్లాస్ మరో చేతిలో తన పొడవాటి గౌన్ ను పట్టుకుని ఆమె కుర్చీలు దాటుతుంటే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి వచ్చిన వారంతా ఆమెను చూస్తూ ఉండిపోయారు.

మనస్సును కొల్లగొట్టింది

మనస్సును కొల్లగొట్టింది

ప్యాసింజర్స్ మూవీలో హీరోయిన్ గా నటించిన ఈ అమ్మడు ఆస్కార్ వేడుకలకు నామినేట్ కాలేదు కానీ తన అందచందాలతో వేడుకకు వచ్చిన వారి మనస్సును మాత్రం కొల్లగొట్టింది.

ఆనందంలో మునిగితేలింది

ఆనందంలో మునిగితేలింది

మొత్తానికి ఇక ఆమె తన సీటు దగ్గరకు చేరుకోగానే రెండు చేతులను అలా చాచి హే... అంటూ ఆనందంలో మునిగితేలింది. మొత్తానికి జెన్నిఫర్ లారెన్స్ వేడుకలో హైలెట్ గా నలిచింది.

English summary

jennifer lawrence hams it up at the oscars 2018

jennifer lawrence hams it up at the oscars 2018..Oscar 2018 Best Moment: Wine Glass In Hand, J Law Climbs Over Chairs