సరికొత్త ఫాషన్ కి దారి చూపుతున్న జస్టిన్ బీబర్, మొటిమలు కూడా ఫాషన్ గా మారే అవకాశాలు ఉన్నాయా?!

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky
Justin Bieber Breaks All Fashion Trends, Says Pimples Are In!

ప్రపంచoలో అత్యధికులు నునుపైన మరియు సమస్యలులేని అందమైన చర్మాన్ని కోరుకుంటారు. అది సహజo. కానీ జస్టీన్ బీబర్ సృష్టిస్తున్న ఈ సరికొత్త ట్రెండ్ మొటిమలను కూడా ఫాషన్ లో భాగంగా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

జస్టిన్ బీబర్ ను అనుకరించే అనేకమంది అభిమానులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. ఈనేపద్యంలో ఇన్స్టాగ్రాంలో జస్టిన్ బీబర్ ఒక ఫోటోను అందరితో పంచుకున్నాడు. తన మొటిమలను చూపిస్తూ"pimples are in" అని పోస్ట్ చేశాడు. నిజానికి యాక్నే పాజిటివిటీ అనే ఒక సామాజిక ఉద్యమానికి ఊతమిచ్చేలా ఈ పోస్ట్ చేశాడు. ఇది మొటిమలతో భాధపడుతున్న అనేకమందికి ఊరట కలిగేలా చేయగలదు అని అనేకమంది నెటిజన్ల అభిప్రాయం.

గ్లోడెన్ గ్లోబ్స్ రెడ్ కార్పెట్ మీద ఇదివరకే కెండల్ జెన్నీర్ అనే మోడల్, మొటిమలతో దర్శనమిచ్చింది. దీనిపై ఒక ట్విట్టర్ యూసర్" జెన్నర్ చేసిన ఈప్రయత్నం, అనేకమంది ఆడవారికి ఆదర్శంగా ఉండాలి " అని అర్ధం వచ్చేలా ట్వీట్ చేయగా, ఈ కామెంట్ ని సపోర్ట్ చేస్తూ జెన్నర్, never let that sh*t [sic] stop you! అని రిప్లై ఇచ్చింది. అనగా మొటిమల కారణంగా ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు అని తన శైలిలో సమాధానం ఇచ్చింది. తర్వాత అందరూ జెన్నర్ ని ప్రశంసలతో ముంచెత్తారు.

అలాగే ఒక మలేషియన్ డిజైనర్ మోటోగువో కూడా తన మోడల్స్ తో మొటిమలతో నే రాంప్ వాక్ చేయించారు. ప్రజలు ఈవిషయాన్ని అంత సీరియస్ గా తీసుకోలేదు. కానీ జస్టిన్ లాంటి వ్యక్తి ఊతమిస్తే, ఖచ్చితంగా సఫలీకృతమయ్యే అవకాశాలు ఉన్నాయి.

English summary

Justin Bieber Breaks All Fashion Trends, Says Pimples Are In!

Well, the time has probably come when you should unsubscribe to people's notion about smooth skin and beauty. Because pop-sensation Justin Bieber is doing just that.He recently shared a story on Instagram, showing off his pimples and wrote "Pimples are in." This was in support of the #acnepositivity movement that is gaining momentum on Instagram,
Story first published: Wednesday, March 28, 2018, 19:00 [IST]