For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బుట్ట బొమ్మ ఫ్యాషన్ లుక్స్ చూస్తే అమ్మో అనాల్సిందే...!

|

టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు అన్ని సినిమాల్లోనూ అద్భుతంగా రాణిస్తున్న బుట్టబొమ్మ పూజా హెగ్డే తెలుగులో ఒక లైలా కోసం సినిమాతో పరిచయం అయ్యింది. ఆ తర్వాత తెలుగులోని అగ్ర హీరోలందరితోనూ కలిసి నటించింది. ఈ అందాల భామ ఇటీవలే అల్లు అర్జున్ తో కలిసి 'అల వైకుంఠపురంలో'

కూడా అందరినీ తెగ అలరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ అందాల ముద్దు గుమ్మ సినిమా స్క్రీన్ పై రియల్ లైఫ్ లోనూ తనదైన ఫ్యాషన్ దుస్తులతో అందరినీ తెగ ఆకట్టుకుంటోంది. కాలేజీ లేడీస్ కు ఎంతగానో ఇష్టమైన లేటెస్ట్ దుస్తులను తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసుకున్న వాటిపై మీరూ ఓ లుక్కేయండి...

మిక్స్ అండ్ మ్యాచ్..

మిక్స్ అండ్ మ్యాచ్..

కాలేజీ అమ్మాయిలలో చాలా మందికి ఇష్టమైన ఫ్యాషన్ దుస్తులలో ఇది కూడా ఒకటి. అందుకే ఇలాంటి తరహా దుస్తులను ఎక్కువగా ధరించేందుకు వివిధ ట్రెండ్స్ తో కలిపిన వాటిని వేసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఇలాంటి వాటినే బుట్ట బొమ్మ పూజా కూడా ఫాలో అయ్యింది. ఈ డ్రెస్సుతో తను వేసుకున్న షూ అందరినీ తెగ ఆకట్టుకుంటోంది.

పింక్ డ్రెస్ లో...

పింక్ డ్రెస్ లో...

చాలా మంది అమ్మాయిలకు ఇష్టమైన పింక్ డ్రెస్ లో పూజా హెగ్డే ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి. అచ్చం ఆకాశంలో తారలా మెరిసిపోతూ.. తన నవ్వుతో కుర్రకారు మతి పోగొడుతోంది.

సింపుల్ గా..

సింపుల్ గా..

ఈ అమ్మడు ఫ్యాషన్ అంటే బోలెడంత మేకప్.. ఒంటి నిండి నగలు.. వంటి వాటికి కాస్త దూరంగా ఉన్నట్టే కనబడుతోంది. ఎందుకంటే ఈ చిత్రంలో వైట్ అండ్ బ్లాక్ డ్రెస్ లో చాలా సింపుల్ గా మెరిసిపోయింది. అలా తన మ్యాచింగ్ తో తన లుక్ ని చాలా సింపుల్ గా పూర్తి చేసింది.

భలే అందంగా..

భలే అందంగా..

ఒక్కోసారి మన డ్రెస్ చాలా సింపుల్ గా ఉన్నా సరే.. చాలా మంది అందంగా మరియు స్టైలిష్ గా మెరిసిపోయేలా చేస్తుంది. ఈ లెహంగా కూడా అలాంటి కోవకే చెందింది. ఇక్కడ బ్లాక్ కలర్ డ్రస్ కు మ్యాచింగ్ అయ్యే గ్రీన్ అండ్ సిల్వర్ ఇయర్ రింగ్స్ బుట్ట బొమ్మ అందాన్ని మరింత పెంచాయి.

ఇలాంటి డ్రస్సులు..

ఇలాంటి డ్రస్సులు..

పూజా హెగ్గే వేసుకున్నటువంటి ఎల్లో కలర్ తరహా డ్రస్సులు ప్రస్తుతం మార్కెట్లో విరివిగానే లభ్యమవుతున్నాయి. వీటిని ధరించి ఫ్యాషనబుల్ గా మెరిసిపోవడం అంత కష్టమేమీ కాదు. మీరు కూడా ఈ బుట్ట బొమ్మ లాగా ఇలాంటి డ్రెస్ కు సెట్ అయ్యే హెయిర్ స్టైల్ ఉంటే చాలు.. కరెక్టే కదా?

లెహంగాల వైపు.. అమ్మాయిల చూపు..

లెహంగాల వైపు.. అమ్మాయిల చూపు..

ఈ మధ్యన ఏ కార్యక్రమం జరిగినా.. అమ్మాయిలు ఎక్కువగా లెహంగాల వైపు చూపు తిప్పుకుంటున్నారు. అయితే ఇవి హెవీగా ఉంటాయన్న కారణంగా చాలా మంది వీటికి దూరంగా ఉండే వారు కూడా ఉన్నారండోయ్. అయితే మీరు పూజాను ఫాలో అయితే మీకు ఇలా అనిపించదు. అదెలాగో చూడండి.

హెవీ లుక్ భయం అక్కర్లేదు..

హెవీ లుక్ భయం అక్కర్లేదు..

గ్రీన్ అండ్ గోల్డ్ బ్లాక్ లెహంగాతో తన కురులను సర్దుకుంటూ పూజా హెగ్డే ఎంత అందంగా ఉందో.. పైగా ఇలాంటివి చాలా సౌకర్యవంతంగా కూడా ఉంటాయి. ఇలాంటివి హెవీ లుక్ ఉంటుందనే భయం కూడా అవసరం లేదు.

లుక్ చాలా ప్రత్యేకంగా..

లుక్ చాలా ప్రత్యేకంగా..

చాలా మంది పార్టీలు సాయంకాలం లేదా రాత్రి వేళల్లో నిర్వహిస్తుంటారు. ఇలాంటి వాటికి వెళ్లేటప్పుడు మన లుక్ ప్రత్యేకంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా పార్టీలంటే చాలా కొన్ని గంటల ముందే రెడీ అవుతుంటారు. అలాంటి వారందరిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మీరే నిలబడాలంటే ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పూజాను చూడండి.. చీకట్లో మెరిసే పసుపు బొమ్మలా.. ఎంత స్టైలిష్ గా కనబడుతుందో...

చీరలోనూ చక్కని చుక్కలా..

చీరలోనూ చక్కని చుక్కలా..

ఫ్యాషన్ లో ఎన్ని ట్రెండ్ లు మారినా.. ఎన్ని దుస్తులు మారినా.. సాంప్రదాయ చీరకు ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అయితే దీన్ని కూడా ఫ్యాషనబుల్ గా ట్రై చేసింది. ఇటీవల ఈ చీరతోనే వైజాగ్ సక్సెస్ మీట్ లోనూ పాల్గొంది. ఈ చీరకు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ధరించి, తలలో తెల్లని మల్లెపూలు.. నుదుటన బొట్టు పెట్టుకుని అచ్చం అందమైన బుట్టబొమ్మాలనే తయారైంది. అంతేకాదు అక్కడ చక్కని చుక్కలా తెలుగు పాట కూడా పాడి అందరినీ అలరించింది. చూడటానికి సింపుల్ గా ఉన్న ఈ చీరలు ప్రస్తుతం మార్కెట్లో చాలానే అందుబాటులో ఉన్నాయి.

All Image credites to Instahegde pooja

English summary

Latest Pooja Hegde Looks and Outfits

Here are the latest pooja hegde looks and outfits. Take a look
Story first published: Monday, February 10, 2020, 17:34 [IST]