For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

“మెట్ గాలా 2018” కార్యక్రమంలో దీపికా గార్జియస్, మరి ప్రియాంకా?

|

బాలీవుడ్ ఇండస్ట్రీ లోనే సూపర్ స్టార్స్ అయిన ఇద్దరికి, ప్రెస్టీజియస్ “మెట్ గలా 2018” తన వార్షిక ఫాషన్ ఈవెంట్లో రెడ్ కార్పెట్ పరచింది. అవాంట్ - గార్డె దుస్తులలో మెరిసిన ఈ అందాల తారలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది నేషన్ గా మారారు.

వీరిలో ప్రియాంకా చోప్రా ముదురు ఎరుపు రంగు, వెల్వెటీ, రాల్ఫ్ లారెన్ పొడవాటి గౌన్ ధరించి, గోల్డెన్ హెడ్ స్కాఫ్ కలిగి, నాటకీయత జోడించిన కేశాలంకరణ మరియు మేకప్ తో యువరాణి వలె కనిపించింది.

ఇక దీపికా విషయానికి వస్తే, ప్రబల్ గురుంగ్ ఎరుపు దుస్తులలో, తొడల పైభాగాన చీలిక (స్లిట్) తో పొడవాటి టెయిల్ కలిగిన గౌన్ ధరించి, భిన్నమైన చెవి రింగుతో, సొగసైన జుట్టుతో ఎంతో అందంగా దర్శనమిచ్చింది.

Met Gala 2018: DP Looks Gorgeous But PC Has The Edge

అంతర్జాతీయ ప్రమాణాలతో ఫాషన్ ప్రపంచానికి సరికొత్త అర్ధాన్నిచ్చే ఈ “మెట్ గలా” ఈవెంట్ లో మన దేశం నుండి అడుగు పెట్టిన ఈ ఇద్దరు తారలకు సాహో చెప్పాల్సిందే.

ప్రియాంకా చోప్రా దుస్తులు మరియు ఆమె మత్తెక్కించే చూపులు ప్రస్తుత కార్యక్రమ నేపధ్యానికి సరిగ్గా సరిపోయేలా జస్టిఫికేషన్ ఇచ్చాయి అనడంలో ఆశ్చర్యమే లేదు.

తద్వారా మెట్ గలా లో వెలుగులు జిమ్మిన ప్రియాంకా, చేతిలో ఉంచిన శిలువ కలిగిన చైన్ కార్యక్రమ నేపధ్యమైన “ హెవేన్లీ బాడీస్ : ఫాషన్ అండ్ కాథలిక్ ఇమాజినేషన్ ” కు సరిగ్గా సరిపోయేలా కాథలిక్ చాయలు ప్రతిబింబించేలా కనపడి కనువిందు చేసింది.

ఇక దీపికా విషయానికి వస్తే, దీపిక క్లాసీగా, స్టైలిష్ గా కార్యక్రమ నేపద్యానికి భిన్నంగా కాథలిక్ చాయలే కనపడకుండా అందర్నీ ఆశ్చర్య పరచింది. ముఖ్యంగా దీపికా సొగసైన జుట్టు చూపరుల కళ్ళను తిప్పుకోనీయకుండా చేసింది.

గత సంవత్సరం వలె నేపద్యానికి విరుద్దంగా ప్రబల్ గురుంగ్ గౌన్ ధరించిన దీపిక కాథలిక్ చాయలు కనపడకుండా ప్రయత్నించడం తప్పేమీ కాదు. ఈ దుస్తులలో కూడా దీపికా మెరిసి పోయిందనే చెప్పాలి. అందానికి అందమే మెరుగులు దిద్దితే ఇలాగే ఉంటుంది మరి.

Met Gala 2018: DP Looks Gorgeous But PC Has The Edge

అంతేకాక, ఈ ఇద్దరి పట్ల “ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ పోలీస్ ” నుండి ఏ రకమైన స్పందన వస్తుంది అనే విషయాన్ని తెలుసుకోవడo మరింత ఆసక్తి రేపే అంశంగా ఉంటుంది. ప్రియాంకా చోప్రా ఎల్లప్పుడూ అంతర్జాతీయ రెడ్ కార్పెట్ కు మరింత ఆకర్షణను తెచ్చేలా ఉంటుంది. మరియు ఆమె మునుపటి “మెట్ గలా” లుక్ కూడా అంతర్జాతీయంగా చాలా ప్రశంసలను అందుకుంది.

కానీ, దీపిక 2017 లో కనిపించిన లుక్ కూడా దేశంలో మిశ్రమ అభిప్రాయాలను పొందగా, అంతర్జాతీయంగా మీడియా మాత్రం దీపికా గురించి కాస్త గట్టిగానే మాట్లాడింది. తన సహజ శైలిని కోల్పోకుండా, ఎల్లప్పుడూ వ్యక్తిగత అభిప్రాయాలకు విలువిచ్చే దీపికా పడుకునే రెండవసారి కూడా “మెట్ గలా” లో “ హెవేన్లీ బాడీస్ : ఫాషన్ అండ్ కాథలిక్ ఇమాజినేషన్” కు కాస్త విరుద్ధంగానే కనపడింది.

చివరగా చెప్పేదేంటంటే, కలలో కూడా అడుగు పెట్టలేని “ మెట్ గలా 2018” కార్యక్రమానికి మన దేశం నుండి ఇద్దరు సెలెబ్రిటీస్ పాల్గొనడం చాలా గొప్ప విషయమనే చెప్పాలి. మరియు ఇక్కడ ప్రియాంకా రెండవ సంవత్సరం కూడా అంతర్జాతీయ మీడియా ప్రశంసలను అందుకుంది. బాలీవుడ్ లోనే కాకుండా హాలీవుడ్ లో కూడా తమకంటూ ముద్రని కలిగి ఉన్న వీరు ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం సహచరులకు ప్రేరణ కలిగించే అంశమనే చెప్పాలి.

వీరిద్దరూ మనకు ఎల్లప్పుడూ టాప్ బెస్ట్ గానే ఉంటారు. ఈ “మెట్ గలా 2018” లో వీరిరువురి గురించిన మీ అభిప్రాయం ఏమిటి ? మరియు మీకు వీరిలో ఎవరు హాట్ గా కనిపించారు ? కామెంట్ బాక్స్ లో తెలుపండి ?

English summary

Met Gala 2018: DP Looks Gorgeous But PC Has The Edge

PeeCee's outfit and her dramatic look for the event aptly fitted the theme and it looked as if she is the personification of the current Met Gala theme. Deepika however, couldn't push boundaries and stuck to the conventional form of classy and stylish. It is high time Deepika ditched her sleek hair do! PC did it this year as well.
Story first published: Tuesday, May 8, 2018, 16:30 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more