For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మూడు విభిన్నమైన రంగుల్లో, అదిరిపోయే ఫీచర్స్ తో వచ్చిన ఒప్పో F9 ప్రో

By Chaitanya
|

ఇప్పుడు ప్రతి ఒక్కరికీ స్మార్ట్ ఫోన్ అత్యవసరమైన ప్రధాన వస్తువులలో ఒకటిగా ఉంది. సంభాషణలకు, భావ వ్యక్తీకరణలకు ప్రధాన మాధ్యమంగా, ప్రపంచంతో పాటు తమను తాము నిరంతరం అప్డేట్ చేసుకునేందుకు స్మార్ట్ ఫోన్ ఎంతగానో దోహదం చేస్తుంది. ఫోన్ కేవలం వేగవంతమైన సంభాషణల కోసమే కాదు.. ఇది ప్రధాన వ్యాపార సాధనంగా కూడా మారింది. కమ్యూనికేషన్ పరంగా మాత్రమే కాకుండా, సృజనాత్మక ఆలోచనలను, వృత్తి పరమైన అంశాలను, అభిరుచులను, వ్యక్తిత్వాన్ని నలుగురితో పంచుకోవడానికి సామాజిక మాధ్యమంతో అనుసందానించిన పరికరమే స్మార్ట్ ఫోన్.

ఈ మిలీనియంలో మనకు మనమే స్పెషల్. స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఒక గాడ్జెట్ గా మాత్రమే కాకుండా, జీవనశైలిని ప్రస్పుటించే ఒక స్టేటస్ సింబల్ గా మారింది. స్వీయ గుర్తింపును పెంపొందించడానికి ఉపయోగపడే ప్రధానమైన ఫ్యాషన్ ఉపకరణం స్మార్ట్ ఫోన్. ఒకవేళ మీరు కూడా స్మార్ట్ ఫోన్ ను పలు రకాలుగా ఉపయోగిస్తుంటే మీరు కచ్చితంగా మార్కెట్లోకి వచ్చే ఫోన్లపై అవగాహన కలిగి ఉంటారు. ఫ్యాషన్, లైఫ్ స్టైల్ పరంగా ఈ మొబైల్ మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపునిస్తుంది.

OPPO F9 Pro

స్మార్ట్ ఫోన్ వృత్తిపరంగా, విశ్రాంతిపరంగా రెండింటికీ సరైన సహచర్యాన్ని ఇవ్వగలదు. ఇది కట్టింగ్ - ఎండ్ టెక్నాలజీని కలిగి, వినూత్నమైన ఫ్యాషన్ కోణాన్ని ప్రతిబింబిస్తూ, ఒక అద్భుతమైన మేలుకలయికగా కనిపిస్తూ ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే "ఒప్పో F9 ప్రో" ని సూపర్ - గ్లాం ఫోన్ అని చెప్పవచ్చు. పునఃరూపకల్పన చేసిన వాటర్ డ్రాప్ స్క్రీన్ కలిగి, VOOC ఫ్లాష్ చార్జింగ్ టెక్నాలజీతో, హుడ్ కింద భాగాన ప్రత్యేకమైన శ్రేణుల షేడ్స్ తో తీర్చిదిద్దినట్లు కనిపించే బాడీ ఫ్రేంతో భిన్నంగా కనిపిస్తుంది ఒప్పో ఎఫ్ 9 ప్రో. మీ అభిరుచులకు అనుగుణంగా, మీకు కావాల్సిన ప్రతి ఒక్క అంశం ఇందులో ఉంటుంది అనడం అతిశయోక్తి కాదు.

భిన్నమైన బాడీ ఫ్రేం:

ఇప్పటికే ఒప్పో F7 అసాధారణ భిన్నమైన లుక్ కలిగి అబ్బురపరచింది. అంతేకాకుండా "సెల్ఫీ ఎక్స్పర్ట్" అనే ప్రత్యేక పేరు కూడా ఉంది. ఇప్పుడు దాని శ్రేణిలో భాగంగా,. సక్సెసర్ గా ఒప్పో F9 ప్రో ఈ ఆగస్టు 21 న ప్రారంభించింది. ఒప్పో F9 ప్రో విభిన్నమైన అంశాలు గత రెండు వారాలుగా ట్విట్టర్లో చక్కర్లు కొడుతున్నప్పటికీ, ఇక్కడ పూర్తి వివరాలను అందించే క్రమంలో ఈ ఆర్టికల్ మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము.

ఒప్పో F9 ప్రో మూడు వేర్వేరు వైవిధ్య రంగులతో వస్తుంది - స్టార్రీ పర్పుల్, సన్రైస్ రెడ్ మరియు ట్విలైట్ బ్లూ రంగులలో రానుంది. ఈ మూడు ఎంపికలలోనూ భిన్నమైన ఇంజినీరింగ్ గ్రేడియంట్ లుక్ కలిగి, లైట్ మరియు కోణం మీద ఆధారపడి రంగులను ప్రసరించేలా తయారు చేశారు.

ప్రత్యేకమైన డిజైన్ :

ఒప్పో F9 ప్రో డిజైన్, దాని ప్రధానమైన సెల్లింగ్ పాయింట్లలో ఒకటిగా ఉంది. ఇప్పటి వరకూ ఏ ఇతర మొబైల్లో చూడనటువంటి భిన్నమైన లుక్ తో కనిపిస్తూ విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ముఖ్యంగా వెనుక భాగంలో, ప్రధానంగా మధ్య ఫ్రేమ్లో ఇది భిన్నమైన ఇంజినీరింగ్ గ్రేడియంట్ బాడీ రూపకల్పనను కలిగి ఉంటుంది. క్రమంగా ఇది మరింత ఆకర్షణీయంగా, చూపరుల దృష్టిని మరల్చుకోనీయని విధంగా కనిపిస్తూ అలరిస్తుంది. గాజు, మెటల్ కలిగిన భిన్న సారూప్యతతో ఒక ప్రీమియం లుక్ అందిస్తుంది మరియు చేతిలో ఒక "ఫాషన్ ఐకాన్" ఉన్న అనుభూతికి లోనుచేస్తుంది. గాజు శరీరం కలిగి ఉన్నప్పటికీ, ఫిర్యాదులు పెద్దగా లేకపోవడం గమనార్హం.

OPPO F9 Pro

భిన్నమైన చార్జింగ్ కాపబిలిటీస్ :

ఒప్పో F9 ప్రో 3500 mAh బాటరీని కలిగి ఉంది, AI (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) కాపబిలిటీస్ పొందుపరచబడి ఉంటుంది. అంతేకాకుండా VOOC ఫ్లాష్ చార్జింగ్ టెక్నాలజీ కలిగి ఉండడం దీని ప్రత్యేకతగా చెప్తున్నారు. ఈ VOOC ఫ్లాష్ చార్జింగ్ వలన, 5 నిమిషాలు చార్జ్ చేస్తే, 2 గంటల టాక్ టైం అన్లాక్ చేయబడుతుంది. బాటరీ మీద ఎక్కువ దృష్టి సారించేవారికి ఇది బెస్ట్ చాయిస్ అని చెప్పవచ్చు.

ప్రత్యేకమైన ఇంజనీరింగ్ బాడీ డిజైన్:

ఒప్పో F9 ప్రొ, నిజానికి ఇప్పటికే స్మార్ట్ఫోన్ కెమెరాలలో, పదునైన మరియు మెరుగైన ఛాయాచిత్రాలను అందిస్తూ ప్రత్యేకమైన పేరును సంపాదించుకుంది. అంతేకాకుండా సరికొత్తగా ఒప్పో F9 ప్రో, AI- ఆధారిత డ్యూయల్ రేర్ కెమెరాలతో కూడా వస్తుంది.

ఇది 16MP + 2MP డ్యూయల్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. సెల్ఫీలకోసం, AI వంటి అత్యత్తమ సామర్ధ్యాలతో కూడిన 25MP ఫ్రంట్ కెమరా షూటర్ దీని సొంతం. కెమెరా పూర్తి డీటైల్స్ కాప్చర్ చేయగలిగే సామర్థ్యం కలిగి ఉంటుంది. మీరు ఓవర్ సాచురేషన్ జాడను కూడా గమనించలేరు.

OPPO F9 Pro

ఒప్పో F9 ప్రొ 2 గిగాహెడ్జ్ మీడియాటెక్ హీలియో P60 ఆక్టాకోర్ ప్రాసెసర్ కలిగి, మాలి- G72 MP3 GPU గ్రాఫిక్స్ జతచేయబడి ఉంటుంది. 6GB రాం తో మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్లకు కొత్త ప్రమాణాలు ఏర్పాటుచేసేలా విడుదల చేశారు. అంతేకాకుండా మైక్రో SD కార్డు ద్వారా 256GB వరకు విస్తరించదగిన విధంగా, 64GB అంతర్గత నిల్వని కలిగి ఉంటుంది.

ఈ ఒప్పో F9 ప్రో, స్మార్ట్ఫోన్ సంస్థ యొక్క అధికారిక కలర్ OS 5.2 వర్షన్లో, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో OS తో నడుస్తుంది. మరియు ఈ స్మార్ట్ ఫోన్ గూగుల్ లెన్స్ మద్దతుతో కూడుకుని ఉంటుంది, ఇది ఫ్రేమ్లోని అంశాల గురించిన సమాచారాన్ని గుర్తించుటకు, డిస్ప్లే సంబంధిత సమాచారాన్ని తెలుసుకునేందుకు సహాయపడుతుంది.

Read more about: oppo
English summary

New OPPO F9 Pro: Unique Design, Gradient Body, Charging Capabilities andPiece Of Engineering

The OPPO F9 Pro has hit the shelves in three distinct colour variations—Starry Purple, Sunrise Red and Twilight Blue. All three options represent a unique gradient design which emits a combination of colours that changes depending on the angle and light.OPPO F9 Pro's design is one of its major selling points.
Story first published: Wednesday, August 29, 2018, 14:32 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more